
Aditi Rao Hydari : లస్ట్‌స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో అదితి రావు హైదరి.. భర్తతో కలిసి.. ఫోటోలు వైరల్..
లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నటి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నటి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Traditional Poornalu (Purnam Boorelu) recipe for Vinayaka Chavithi. Exact measurements for stuffing and outer dough, step-by-step method to make soft and crispy sweet dumplings at home. వినాయక చవితికి సాంప్రదాయ పూర్ణాలు (పూర్ణం బూరెలు) తయారీ విధానం. పూర్ణం, పిండి కొలతలు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సాఫ్ట్, క్రిస్పీ, తీపి బూరెలు ఇంట్లోనే చేసుకోండి.

ఇలాంటి జుంకాలు మంచి లుక్ ఇస్తాయి. పట్టు చీరల మీదకు మరింత గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ అదిరిపోయే లుక్ ఇస్తాయి. చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. పువ్వు ఆకారంలో ఉండే స్టడ్ కి.. మ్యాచింగ్ మాటీలతో సహా ఈ జుంకాలు ఉంటాయి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. పట్టు చీరల మీదకు ఇలాంటి గోల్డ్ జుంకాలు చాలా అందంగా ఉంటాయి. ఈ డిజైన్ కూడా మరింత అందంగా ఉంటుంది. మీకు లైట్ వెయిట్ లో జుంకాలు కావాలి అంటే.. ఇలాంటి మీనాకారీ జుంకాలు ట్రై చేయచ్చు. తేలికగా ఉంటాయి. ట్రెండీ లుక్ ఇస్తాయి. Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు! Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు

నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్ నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్ Prasanna Yadla 02 september 2026 Pic credit - Pinterest కొందరు నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతూనే ఉంటారు అలాంటి వాళ్లు ఈ బోన్ సూప్ తాగితే మంచిది గొంతు సమస్యలు ముందుగా మీరు మటన్ తీసుకుని ఎముకలను బాగా కడిగి పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి మటన్ ఆ తరువాత వీటిని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, 5 యాలకులు వేసి వేయించాలి. ప్రెషర్ కుక్కర్లో ఇంకా దీనిలో ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిముషాలు పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఇక ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ బోన్స్ కూడా 5 నిమిషాల పాటు వీటిని బాగా వేయించాలి. మటన్ బోన్స్ ఇంకా దీనిలో కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ మిరియాల పొడి ఉప్పు వేసి కలపాలి. ఈ బోన్స్ మొత్తం మునిగేలా నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించడమే మటన్ బోన్ సూప్ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాన, సాంబార్ ఒక సంప్రదాయ వంటకం. దీనిని ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్నం భోజనంలోనూ ఆనందిస్తారు. అనేక రకాల సాంబార్ వంటకాలు ఉన్నప్పటికీ, ఈ రెసిపీలో ఉల్లిపాయ, టమాటోను మాత్రమే ఉపయోగించి, సులభమైన పద్ధతిలో రుచికరమైన సాంబార్‌ను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం... ఇది ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. టమాటాలు: 2 చిన్నవి (పప్పు ఉడికించడానికి), 2 చిన్నవి (తరిగినవి), 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) ఉల్లిపాయలు: 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) కరివేపాకు: కొద్దిగా (మరిగించేటప్పుడు, పోపులో) పప్పు ఉడికించుకోవడం: ముందుగా 100 గ్రాముల కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దానిలోకి రెండు చిన్న సైజు టమాటాలను పొడవుగా కట్ చేసి వేయాలి. పప్పు తీసుకున్న గ్లాస్ తో రెండు గ్లాసుల నీరు పోసి, కుక్కర్లో మూత పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు చల్లారిన తర్వాత, మూత తీసి మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కూరగాయలు - మసాలాలు కలపడం: మెత్తగా మెదుపుకున్న పప్పులోకి పొడవుగా కట్ చేసిన మూడు చిన్న సైజు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన రెండు టమాటాలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉడికించడం: ఇప్పుడు దీనిలోకి అర కప్పు నీరు పోసి, మూత కొద్దిగా క్రాస్‌గా పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత, నిమ్మ సైజు చింతపండును నానబెట్టి తీసిన రసాన్ని సాంబార్‌లోకి కలపాలి. మీ రుచికి తగ్గట్టు పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీరు - సుగంధ ద్రవ్యాలు: తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు నీరు

సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా.. కాళ్లకు ఉన్న చెప్పులను బయటే విడిచి పెట్టి, భక్తి శ్రద్ధలతో లోపలికి వెళతాం. ఇది మన ఆచారం. కానీ, మన దేశంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో చెప్పులు వేసుకొని లోపలికి వెళతారని మీకు తెలుసా? వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజంగానే ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. వేరే ఏ ఇతర ఆలయాల్లో లేని ఈ రూల్... ఈ టెంపుల్స్ లో మాత్రం ఎందుకు ఉంది? దీని వెనక ఉన్న కారణం ఏంటి? ఈ దేవ్‌జీ మహారాజ్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా, మాలాజ్ పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు చెప్పులు ధరించే.. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు వెళ్లే భక్తులు.. పాదరక్షలను ధరించే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు. అయితే.. రోజువారీ సాధారణ పూజల సమయంలో చెప్పులు ధరించరు. కానీ, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే జాతరకు వెళ్లే వారు మాత్రం.. చెప్పులు ధరిస్తారు. అసలు కారణం: స్థానిక నమ్మకాల ప్రకారం, దుష్టశక్తులు, చేతబడులు లేదా శారీరక/మానసిక సమస్యలతో బాధపడేవారు దేవ్‌జీ మహారాజ్‌ను దర్శించుకుంటే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అక్కడ పాదరక్షలతో నడవడం వల్ల తమను ఆవహించిన దుష్టశక్తులు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ జిల్లా, భోపాల్‌పూర్ ప్రాంతంలో ఉన్న కాళీమాత దేవాలయం.భక్తులు తమ కాళ్లకు ఉన్న చెప్పులను తీయకుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. అసలు కారణం: ఈ ప్రాంతంలో అమ్మవారిని చాలా ఉగ్రరూపిణిగా, అలాగే భక్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా భావిస్తారు. భక్తులు ముళ్ల బాటలు, కఠినమైన దారుల్లో నడిచి వస్తారు కాబట్టి వాళ్లకు పాదరక్షల వల్ల ఎలాంటి హాని కలగకుండా, అమ్మవారే స్వయంగా చెప్పులతో రావడానికి అనుమతి ఇచ్చిందని ఇక్కడి స్థానిక జానపద కథనం చెబుతుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథుని ప్రధాన ఆలయంలోకి

ఈ సెప్టెంబర్ లో కృష్ణాష్టమితో పాటు వినాయక చవితి కూడా వస్తోంది. ఈ పండగలకు ఇలాంటి చీరలు మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. పూజ కోసం ఆఫ్-వైట్ రంగు కాటన్ చీరను ఎంచుకోవచ్చు. సింపుల్ అండ్ సోబర్ లుక్ కోసం ఈ చీర బెస్ట్ ఆప్షన్. దీనిపై కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్‌తో జత చేస్తే లుక్ అదిరిపోతుంది. నయనతార కట్టుకున్నట్లుగా ఎరుపు రంగు సిల్క్ చీరను పూజకు కట్టుకోవచ్చు. దీనిపై గోల్డెన్ లేదా టెంపుల్ జ్యువెలరీ ధరిస్తే చాలా బాగుంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమికి నీతా అంబానీలా బెనారసీ చీర కట్టుకోవచ్చు. దీనిపై సింపుల్ జ్యువెలరీతో మీ లుక్‌ను పూర్తి చేయండి. పూజలో మరింత ప్రకాశవంతంగా కనిపించాలంటే ప్యూర్ సిల్క్ చీరను ఎంచుకోండి. దీనిపై మినిమల్ మేకప్‌తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి. రస్ట్ ఆరెంజ్ రంగు చీర పూజకు బెస్ట్ ఛాయిస్. దీనిపై కాంట్రాస్ట్ కలర్ జ్యువెలరీ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్? Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు! Gold Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు

శరీరాన్ని చల్లగా ఉంచి, రోజంతా శక్తిని అందించే అల్పాహారాలలో జొన్న అంబలి (లేదా జొన్న సద్దన్నం) ఒకటి.. ఇది రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సాధారణ ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాలకు బదులుగా ఈ సాంప్రదాయ వంటకాన్ని ఎంచుకోవడం వల్ల కడుపులో హాయిగా ఉండడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. జొన్నల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. పురాతన కాలం మనుషులు శారీరకంగా బలంగా ఉండేవారు. జొన్న అంబలి ముఖ్యంగా ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. మన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఈ పులియబెట్టిన ఆహారంలో సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యంతో చేసే చద్దన్నంతో పోలిస్తే, జొన్న అంబలి బరువు పెరగకుండా చూస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా దీనిని తీసుకోవచ్చు.. ఎందుకంటే జొన్నలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. నానబెట్టడం: ఒక కప్పు తెల్ల జొన్నలను (లేదా పచ్చ జొన్నలు) ఒకటి, రెండుసార్లు శుభ్రంగా కడిగి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టాలి. బ్రేక్‌ఫాస్ట్ కోసం సిద్ధం చేయాలంటే ముందురోజు మధ్యాహ్నమే నానబెట్టుకోవడం ఉత్తమం. రుబ్బడం: నానిన జొన్నలలోని నీటిని వంపేసి, మిక్సీ జార్ లోకి వేసి నీళ్లు పోయకుండా పల్స్ మోడ్‌లో ఆపుకుంటూ రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా చూసుకోవాలి. ఉడికించడం: రుబ్బుకున్న జొన్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని, అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసి, ఉండలు కట్టకుండా వెంటనే కలుపుతూ ఉండాలి. ఫెర్మెంటేషన్

వాషింగ్టన్: ఎలాంటి వివక్ష లేకుండా ఇతరులకు సాయపడటమే భారతదేశ నాగరికతా సంప్రదాయాల ముఖ్య సారమని, భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా సేవలు అందించిందే తప్ప అగ్రరాజ్యంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. కెనడాలోని టొరంటోలో ‘కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్‌రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూ ప్రపంచ దృక్పథం సార్వత్రికమైందని, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని చెప్పారు. సేవాభావం భారతీయ నాగరికతా స్వభావానికి ప్రధాన నిర్వచనమని భాగవత్ ఉద్ఘాటించారు. ‘ప్రపంచంలో ఎవరు సాయం కోరినా భారత్ ఎన్నడూ నిరాకరించలేదు, అడగకున్నా ఆపన్నహస్తాన్ని అందిస్తుంది. ఇది మన సంప్రదాయం, భారత డీఎన్ఏ. అందుకే హిందువులు మేల్కొంటే, ప్రపంచమే మేల్కొంటుంది అనే సామెత వచ్చిందని భాగవత్ పేర్కొన్నారు. ప్రేమ అనే సందేశాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఒక వ్యక్తి సంపాదించిన జ్ఞానమంతా అర్థరహితమేనని చెప్పడానికి ఆయన సంత్ కబీర్ దోహాలను ఉదహరించారు. కబీర్ మహారాజ్ చెప్పినట్లు... మీరు ఎన్నో పుస్తకాలు చదివి గొప్ప విద్వాంసులు కావచ్చు, కానీ ప్రేమ అనే ఆ రెండక్షరాలను అర్థం చేసుకోకపోతే ఆ జ్ఞానానికి ఏ అర్థమూ లేదు’అని భాగవత్ వివరించారు. మానవాళిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని గుర్తిస్తూనే, వైవిధ్యాన్ని కూడా స్వీకరించాలని ఆయన ఉద్బోధించారు. ‘వైవిధ్యం ఏకత్వానికి ప్రతీక. అది ఏకత్వానికి అందాన్ని, అలంకారాన్ని ఇస్తుంది. అందుకే మనం వైవిధ్యాన్ని నిష్పాక్షికంగా అంగీకరించాలి, గౌరవించాలి. ఇందుకు మనం గరి్వంచాలి. సంతోషించాలి’అని ఆయన అన్నారు. ‘మన ప్రాచీన సంస్కృతి వైవిధ్యాన్ని సహ జమైనదిగా గుర్తిస్తుంది. అయితే ఏకత్వమే అసలైన నిజం. అదే మన పురాతన జీవన విధానం’అని ఆయన పేర్కొన్నారు. కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు) ‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు 'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు) AP: దారుణంగా

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ భారత పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసి, గంటల్లోనే దానిని ఉపసంహరించుకోవడంతో ఈ సందిగ్ధత మరింత బలపడింది. ఆగస్టు 23 నుంచి 25 మధ్య తారిఖ్ రెహమాన్ ఢిల్లీలో పర్యటించవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.అయితే, ఈ పర్యటనపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‌లో ఉంటున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నిందితులను తమకు అప్పగించే విషయంపై భారత ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత వస్తేనే పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న షేక్ హసీనా, తాను త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇటీవల ప్రకటించారు. ఆమె మీడియా సమావేశాలు నిర్వహించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెను తమకు అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు తారిఖ్ రెహమాన్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పర్యటనపై నెలకొన్న సందిగ్ధత ఈ సదస్సుపై ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది

కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది. లైట్ కలర్ శారీలో మరింత అందంగా కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత
కొబ్బరి తురుములో పాలు వేసి కొబ్బరి లడ్డూలను చేసుకోవచ్చు. పండుగ సమయంలో ఈజీగా చేసుకుని తినొచ్చు. బూందీ లడ్డూలు ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. శనగపిండితో బూందీ చేసి, పాకంలో కలిపి లడ్డూలు చుడితే సరిపోతుంది. శనగపప్పుతో బొబ్బట్లు చేసుకోవచ్చు. బెల్లంతో పూర్ణం చేసి, వత్తుకుని కాల్చుకోవాలి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బియ్యం పిండి, బెల్లం పాకంతో అరిసెలు చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయ పిండి వంటకం ఇది. మెత్తగా ఉండే గులాబ్ జాములను చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పండుగలో, కుటుంబ వేడుకల్లో పక్కన ఉండాల్సిన స్వీట్ ఇది. బెల్లం, పాలు, బియ్యం, యాలకుల పొడి కలిపి పాయసం చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. బాగుంటుంది. మైదా లేదా గోధుమ పిండితో కజ్జికాయలు చేసుకోవచ్చు. కొబ్బరి, బెల్లం, నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది. తాజా క్యారెట్లను తురిమి క్యారెట్ హల్వా చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది. రవ్వ, చక్కెర, పాలతో కేసరి ఈజీగా చేసుకోవచ్చు. పూజలు, పండుగల టైంలో బాగుంటుంది. సులువుగా అయిపోతుంది

బంగారు నాణేలపై లక్ష్మీదేవి రూపం ఉండే సంప్రదాయ డిజైన్ ఇది. పట్టు చీరలపైకి ఈ హారం చాలా హుందాగా, రాజసంగా కనిపిస్తుంది. సంప్రదాయ మామిడి పిందెల డిజైన్‌తో పాటు కాసులు కూడా ఉంటాయి. ఈ డిజైన్ మెడకు మరింత అందాన్ని, ఆడంబరాన్ని ఇస్తుంది. పాతకాలం నాటి బంగారం రంగులో ఉండే డిజైన్ ఇది. ఆధునిక దుస్తులు, కాటన్ చీరలపైకి రాయల్ లుక్ ఇస్తుంది. కెంపులు, రూబీలు వంటి రంగురాళ్లను పొదిగిన ఆధునిక డిజైన్ ఇది. సాయంత్రం పార్టీలకు ఈ హారం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెడకు అతుక్కుని ఉండే చోకర్‌తో పాటు పొడవైన హారం... ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్. పెళ్లికూతుళ్లకు ఇది గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెద్ద దేవుడి పతకం (Pendant) ఉండే టెంపుల్ జ్యువెలరీ డిజైన్ ఇది. సంప్రదాయ వేడుకల్లో ఇది మీకు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. సన్నని గొలుసుపై సింపుల్‌గా కాసులు ఉండే డిజైన్ ఇది. ఆఫీస్‌కు, రోజువారీ వాడుకకు చాలా సౌకర్యంగా ఉంటుంది. Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్! Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!

అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన గత రిలేషన్‌కు సంబంధించిన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో డిస్కషన్‌కు దారితీసింది. తన లైఫ్ లో ఎదురైన పరిస్థితులు, ఆ రిలేషన్షిప్ తనపై చూపిన ఇంపాక్ట్ గురించి ఆమె మాట్లాడటంతో ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హీరోయిన్ అదితి శంకర్(Aditi Shankar) కూడా అనుపమ ఇంటర్వ్యూపై రియాక్ట్ అయ్యారు. తాను ఆ ఇంటర్వ్యూను ఇటీవలే చూశానని, అందులో అనుపమ తనకు ఎదురైన ఎక్స్‌పీరియెన్స్‌ను తన యాంగిల్ లో వివరించినట్టుగా అనిపించిందని అదితి తెలిపారు. అనుపమ మాట్లాడిన విధానంలో ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచే ప్రయత్నం తనకు కనిపించలేదని అదితి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా చూడాల్సిన అవసరం లేదని, ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే తన ఎక్స్‌పీరియెన్స్ ను దాచకుండా బయటకు వచ్చి మాట్లాడినందుకు అనుపమను ఆమె అభినందించారు. ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటం వల్ల పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు మాత్రమే కాకుండా, సమాజంలో చర్చించాల్సిన కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని అదితి అన్నారు. ముఖ్యంగా ఈ తరహా పరిస్థితులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కావని అదితి గుర్తుచేశారు. కొన్ని సంబంధాల్లో పురుషులు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని, అయితే అది జరుగుతున్న టైమ్‌లో తమకు ఏం జరుగుతుందో వారు గుర్తించకపోవచ్చని చెప్పారు. అందుకే అనుపమ చెప్పిన విషయాన్ని బ్రేకప్ డిస్కషన్‌గా కాకుండా, అవగాహన కల్పించే కోణంలో చూడాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు

స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె అనుపమ కాంట్రవర్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్ (Aditi Shankar).. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరో కార్తి సరసన ‘విరుమన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘మావీరన్, ‘నేసియప్పా’ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా అర్జున్ దాస్ సరసన ఆమె నటించిన రొమాంటిక్ డ్రామా ‘వన్స్‌మోర్’ ఈ నెల 27న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి శంకర్, ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) - ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) కాంట్రవర్సీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై అదితి శంకర్ పూర్తిస్థాయిలో అనుపమకు మద్దతుగా నిలిచారు. ‘‘అనుపమ చూపించిన ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని, బాధను మనసులోనే దాచుకుని కుమిలిపోతారు. కానీ అనుపమ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాస్తవాలను బయటకు మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాలపై కొందరిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, ఆమె మాటల్లో నాకు పూర్తి నిజాయితీ కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి మానసిక క్షోభను అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను ఓపెన్‌గా మాట్లాడి అందరికీ అవగాహన కల్పించింది. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల చాలామందికి ఒక స్పష్టత వచ్చిందని నమ్ముతున్నాను’’ అని అదితి పేర్కొన్నారు. అలాగే చిత్రసీమలో తన కెరీర్ ప్రయాణంపై వస్తున్న కామెంట్లపై కూడా ఆమె స్పందించారు. చిత్రపరిశ్రమలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఎందుకు చేశారని చాలామంది అడుగుతున్నారని చెబుతూ.. సంఖ్య కంటే కంటెంట్ ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మనం

పెళ్లైన అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. మంగళసూత్రం కాంబినేషన్ లో ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతిరోజూ వేసుకోవడానికి లైట్ వెయిట్ బ్రేస్లేట్ బాగుంటుంది. సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇలాంటి బ్రేస్లేట్స్ చీరలు, లెహంగాల మీదకు కూడా చాలా అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ టచ్ ఇస్తాయి.. ఇలాంటి డిజైన్లు చాలా అరుదుగా దొరుకుతాయి. చేతికి హెవీ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చాలా అందంగా కనపడుతుంది. గోల్డ్ నచ్చనివారు.. కాస్త యూనిక్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి స్టోన్ బ్రేస్లేట్ డిజైన్లు ఎంచుకుంటే సరిపోతుంది. చేతులకు చాలా అందాన్ని ఇస్తాయి.. ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ ఇది. చైన్ కి.. హార్ట్స్ వేలాడదీసి ఉన్నాయి. చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది.. రోజ్ గోల్డ్ బ్రేస్లేట్ డిజైన్లు.. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. స్టోన్స్ తో నిండి ఉంటుంది. చేతులకు మంచి లుక్ ఇస్తుంది. Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే! చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!

Aditi Shankar: నటి అనుపమ పరమేశ్వరన్ గురించి తాజాగా మరో హీరోయిన్ అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అనుపమ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ గత సంబంధం కారణంగా తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, బాధ గురించి ఆమె ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అనుపమ తన గత సంబంధం గురించి మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. తనకు ఎదురైన పరిస్థితులను దాచకుండా, వాటి గురించి ధైర్యంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపైనే తాజాగా అదితి శంకర్ స్పందించారు. అనుపమ మాట్లాడిన విధానం తనకు నచ్చిందని ఆమె చెప్పారు. అనుపమ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆమెపై మరింత గౌరవం పెరిగిందని అదితి తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులు ఉంటాయని, అయితే వాటి గురించి బయటకు చెప్పడం అంత సులభం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి సమయంలో అనుపమ తన అనుభవాన్ని ధైర్యంగా పంచుకోవడం అభినందించాల్సిన విషయమని అన్నారు. ముఖ్యంగా తనకు జరిగిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు అనుపమలో నిజాయితీ కనిపించిందని అదితి పేర్కొన్నారు. ఎదురైన సమస్యలతో కుంగిపోకుండా, వాటి నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని కొనసాగించడం గొప్ప విషయమని చెప్పారు. అనుపమ చెప్పిన విషయాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మరికొందరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చని అదితి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. అనుపమ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా గతంలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. ఆ బంధం కారణంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని, తనను తానే తప్పుపట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పినట్లు సమాచారం. సుమారు రెండేళ్ల పాటు ఆ సంబంధంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో వింత నమ్మకం.. మహిషాసురుడు ఆవహించాడంటూ గడ్డి తింటున్న 70 ఏళ్ల వ్యక్తి! ఈ వార్తకు సంబంధించిన

ప్రేమలో ఓడిపోయిన వాళ్లు మళ్లీ కలుసుకుంటే ఏం జరుగుతుంది? గొడవలు, అసౌకర్యం, ఇబ్బందికరమైన పరిస్థితులు గుర్తొస్తాయి. కానీ వియత్నాంలో మాత్రం మాజీ ప్రేమికులను కలుసుకోవడానికే ఓ ప్రత్యేక సంత జరుగుతుంది. ఏడాదికి ఒక్కరోజు జరిగే ఈ వేడుకలో ఒకప్పుడు ప్రేమించుకున్నవారు మళ్లీ కలుసుకుని కాసేపు మాట్లాడుకుంటారు. స్థానిక సంస్కృతిలో ఇదొక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది.ఓ ప్రేమకథతో మొదలై..వియత్నాంలోని హా జియాంగ్ ప్రావిన్స్‌లో జరిగే ఈ వేడుకను ‘ఖావు వై లవ్ మార్కెట్’గా పిలుస్తారు. దాదాపు వందేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమకథ ఈ సంప్రదాయానికి కారణమైంది.నుంగ్ తెగకు చెందిన ‘బా’ అనే యువకుడు గియాయ్ తెగకు చెందిన ‘ఉత్’ అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరి కుటుంబాలు, సంప్రదాయాలు వేరు కావడంతో వారి ప్రేమకు అడ్డంకులు ఎదురయ్యాయి. కుటుంబాల మధ్య గొడవలు జరగకూడదని భావించిన ఆ ప్రేమికులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏడాదికి ఒక్కసారి ఖావు వైలో కలుసుకోవాలని అనుకున్నారు. ఆ చిన్న నిర్ణయమే కాలక్రమంలో ఓ సంప్రదాయంగా మారింది.ఏడాదికి ఒక్కసారి..చంద్ర క్యాలెండర్ ప్రకారం మూడో నెల 27వ రోజున ఈ లవ్ మార్కెట్ జరుగుతుంది. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ వేడుక ఉంటుంది. వివిధ గిరిజన వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుంటారు.ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తులను కలుసుకోవడానికి మాజీ ప్రేమికులు వస్తారు. కాసేపు మాట్లాడుకుంటారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారిలో వారు వెళ్లిపోతారు.పాటలు.. నృత్యాలు.. పండుగ వాతావరణంఇది కేవలం మాజీ ప్రేమికుల కలయికతోనే ముగిసిపోదు. సంప్రదాయ దుస్తుల్లో ప్రజలు

ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..!ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..! August 19 Jyothi Gadda కీళ్ల నొప్పుల నివారణ: జిల్లేడు ఆకులను వేడి చేసి బాధిస్తున్న కీళ్లపై కట్టడం లేదా ఆకుల రసాన్ని క్రమంగా రాయడం వల్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు: జిల్లేడు పువ్వులు లేదా ఆకుల డికాక్షన్ శ్వాసనాళాల్లోని కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడం ద్వారా ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పికి చక్కటి పరిష్కారం: జిల్లేడు ఆకులను మెత్తగా నూరి నుదిటిపై పేస్ట్‌లా రాయడం వల్ల అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి. చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ: ఆకుల పేస్ట్ లేదా రసాన్ని చర్మంపై పూయడం వల్ల తామర, దురదలు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు పెరగకుండా అరికట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైల్స్ సమస్యకు ఉపశమనం: పైల్స్ గాయాలు, నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పేస్ట్‌ను గాయంపై తరచూ అప్లై చేయడం వల్ల మంట తగ్గి గాయాలు త్వరగా నయమవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: జిల్లేడు భాగాలను సంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో సరైన మోతాదులో వాడటం వల్ల మలబద్ధకం, విరేచనాలు, కడుపు పూతల వంటి సమస్యలు తగ్గుతాయి. గాయాలను త్వరగా మానపడం: ఈ మొక్కలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరంపైన ఏర్పడే దెబ్బలు, గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో బాగా తోడ్పడతాయి. దంత సమస్యల నివారణ: జిల్లేడు వేరు లేదా పాలు ఆయుర్వేదంలో దంత క్షయం, పంటి నొప్పి, చిగుళ్ల వాపుల నివారణలో ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఎంతగానో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ: జిల్లేడు ఆకుల్లోని ప్రత్యేక గుణాలు శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మరిన్ని

సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) జైలు నుంచి హాస్పిటల్.. ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే

దురదలు తగ్గాలంటే ఈ ఆకు ఇలా వాడండి.. పాతకాలం నుంచి వస్తున్న చిట్కా!దురదలు తగ్గాలంటే ఈ ఆకు ఇలా వాడండి.. పాతకాలం నుంచి వస్తున్న చిట్కా! Prasanna Yadla 18 August 2026 Pic credit - Pinterest ఈ వేపాకులను మీరు మంచిగా కడిగి శుభ్రం చేసుకునిపేస్ట్లా రెడీ చేసుకోవాలి వేపాకులు ఈ వేపాకు పేస్ట్‌ను మీరు తీసుకుని చర్మం మీద ఒకసారి పరీక్షించి చూడాలి ఒకసారి పరీక్షించి చూడాలి ఇంకా దురద ఉన్న ప్లేస్ లో ఈ వేపాకు పేస్ట్‌ను రాసి కొద్దిసేపటి తర్వాత దీనిని కడిగేయండి దురద ఉన్న ప్లేస్ లో ఇంకా ఈ వేపాకులోని ఉండే యాంటీమైక్రోబయల్ నొప్పిని తగ్గిస్తాయి యాంటీమైక్రోబయల్ ఇంకా ఈ వేపాకు మీ చర్మానికి కూడా చల్లదనం ఇస్తుంది ఇంకా నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు నొప్పి నుంచి ఉపశమనం ఇంకా గాయాలు, పుండ్లు ఉన్న చోట కూడా ఇది మంచిగా పని చేస్తుంది గాయాలు, పుండ్లు ఇంకా ఈ వేపాకు రాసిన తర్వాత దురద, మంట కూడా తగ్గుతుంది కాకపోతే కొంచం జాగ్రత్త అవసరం దురద, మంట కూడా (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఇది సింపుల్ చైన్ డిజైన్. డైలీవేర్ కి చాలా బాగుంటుంది. ఫుల్ చైన్ డిజైన్ కి అక్కడక్కడ నల్లపూసలు ఉంటాయి. చైన్ కి గోల్డ్ బాల్స్, నల్లపూసల కాంబినేషన్ కి చిన్న డైమండ్ పెండెంట్ జత చేశారు. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ చైన్ చాలా సన్నగా ఉంటుంది. మెడలో వేసుకుంటే.. కేవలం కింద ఉన్న నల్లపూసలు, లాకెట్ మాత్రమే కనిపిస్తాయి.. ఈ నల్లపూసలు కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. దీనికి బర్డ్స్ లాకెట్ జత చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. సింపుల్ చైన్ కి కింద మాత్రమే కింద కొన్ని నల్లపూసలు మధ్యలో గోల్డ్ బాల్స్ ఉన్నాయి. కింద స్టోన్ లాకెట్ మరింత అందమైన లుక్ ఇస్తుంది. ఇది మోడ్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతుంది. ఆఫీస్ కి బెస్ట్ ఆప్షన్. రెండు ముత్యాలు కూడా ఉన్నాయి. మెడలో చాలా అందంగా కనపడుతుంది. ఇది డబల్ లేయర్ మంగళసూత్రం. ఒక లేయర్ నల్లపూసలు, మరో లేయర్ చైన్ ఉంది. ఆ చైన్ కి కింద ముత్యాలు వేలాడ దీశారు. మంచి లుక్ ఇస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ డిజైన్. ఎక్కువ నల్లపూసలు, తక్కువ చైన్ చాలా అందంగా ఉంటుంది. ఇన్ఫినిటీ లాకెట్ ఈ కాలం అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతుంది.. కంప్లీట్ గా మొత్తం చైన్ ఉంటుంది. కింద మాత్రం… నల్లపూసలు వేలాడదీశారు. డిఫరెంట్ లుక్ ఇస్తుంది. Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం Growing Carrots: ఈ టిప్స్ తో క్యారెట్ ని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు! Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్ Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు!

నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా?నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా? Samatha 17 August 2026 Gen Z వారు ఎక్కువగా తమ పుస్తకంలో నెమలి ఈకలను పెట్టుకునేవారు. చాలా వరకు ప్రతి పిల్లల పుస్తకంలో ఈ నెమలి ఈకలు అనేవి ఉండేవి. అయితే చాలా మంది పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మార్కులు ఎక్కువ వస్తాయి అనేవారు. మరి నిజంగానే పుస్తకంలో నెమలి ఈక పెడితే మార్కులు ఎక్కువ వస్తాయా? దీని గురించి పండుతులు ఏం చెబుతున్నారు అనేది ఇ ప్పుడు చూద్దాం. పుస్తకంలో నెమలి ఈక పెట్టడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. దీని వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంట. నెమలి ఈకలు కృష్ణుడికి, సరస్వతీ మాతకు చాలా ప్రీతికరం అంటారు. అందువలన ఈకలను పుస్తకంలో పెట్టడం చాలా మంచిదంట. దీని వలన జీవితంలోని అడ్డంకులు తొలిగిపోయి, చదువులో వెనకబడిన వారు కూడా మళ్లీ చదువులో రాణించే అవకాశం ఉన్నదం ట. పుస్తకంలో నెమలి ఈకను ఉంచడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగడంవలన అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండ ితులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమన ించాలి. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

పట్టీలకు మువ్వలు ఉంటే వచ్చే అందమే వేరు. ఈ డిజైన్ లో మువ్వలతో పాటు.. అక్కడక్కడ చిన్న చిన్న సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి. పట్టీలు మొత్తం ప్లెయిన్ గా ఉన్నా… మధ్యలో ఉన్న ఈ కమలం పువ్వు.. పట్టీలకు మంచి అందాన్ని తెస్తాయి. ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి. చిన్న చిన్న చైన్ లేయర్స్ మధ్యలో.. మువ్వలు పెట్టడంతో ఈ పట్టీలు చాలా అందంగా ఉన్నాయి. ఇలాంటి డిజైన్ పట్టీలు మీరు వెండిలో చూసే ఉంటారు. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పాదాలకే అందాన్ని తెస్తాయి. ఈ పట్టీలు పాదాలకు నిండుగా కనిపిస్తాయి. కింద ముత్యాలు వేలాడుతూ… ఉంటే చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇలాంటి పట్టీలు మీకు చాలా సింపుల్ లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి ఇలాంటివి పర్ఫెక్ట్ గా ఉంటాయి. Growing Carrots: ఈ టిప్స్ తో క్యారెట్ ని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు! Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్ Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు! Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Garuda Panchami Or Shravana Panchami: కశ్యప ప్రజాప్రతి భార్యలైన కద్రువ సంతానం నాగులు. వినతల సంతానమే గరుడుడు , అనూరుడు. వీరు ఇద్దరూ శ్రావణ శుద్ధ పంచమి నాడే జన్మించారని పురాణ కథనం. మహావిష్ణువు ఆదిశేషుని భక్తికి మెచ్చి, శ్రావణ పంచమి నాడు మానవులు సర్పాలను, నాగులను పూజిస్తారని వరం ఇచ్చాడు. అందువల్ల ఈ రోజును నాగ పంచమిగా మరియు గరుడ పంచమిగా సమానంగా జరుపుకోవడం ఆనవాయితీ వస్తోంది. ఈ నాగ / గరుడ పంచమి అనేది భారతదేశం, నేపాల్ సనాతులు నివసించే ఇతర దేశాలలో హిందువులు పాటించే ఒక సాంప్రదాయక సర్ప పూజ. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజైన పంచమి రోజున ఈ పూజను నిర్వహిస్తారు. సర్పాల నివాసం పాతాళ లోకం. ఇది భూమికి దిగువన ఉన్న విశ్వంలోని ఏడు లోకాలని మన ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రస్తావించబడింది. వాటిలో అత్యంత దిగువన ఉన్న దానిని నాగలోకం, అంటే నాగు పాములు నివసించే ప్రాంతం. సృష్టి శక్తిలో భాగంగా, కుటుంబ శ్రేయస్సు కోసం వారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. అర్హతగల పురోహితులచే నాగదేవతకు అభిషేకంతో పాటు పూజ చేయడం వల్ల కుజ దోషంతో పాటు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఇది కుటుంబ శ్రేయస్సును కలిగిస్తుంది. అష్ఠాదశ పురాణాల ప్రకారం, గరుత్మంతుడు సూర్య రథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం ఉన్నవాడు. సప్త సముద్రాలను ఒక్క రెక్క

వేడివేడి బీటెన్ కాఫీ నుంచి ఘుమఘుమలాడే కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ వరకు.. చివర్లో నోట్లో కరిగే ధార్వాడ్ పేడాతో ఈరోజు మీ రుచుల పండుగను పూర్తి చేసుకోండి. సులభమైన తయారీ విధానంతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మూడు వంటకాలు రుచితోపాటు ప్రత్యేకతను కూడా అందిస్తాయి. మరి ఈ వంటకాల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.. బీటెన్ కాఫీ.. కావలసినవి: ఇన్ స్టంట్ కాఫీ పొడి: 2 టేబుల్ స్పూన్లు, పంచదార: 2 టేబుల్ స్పూన్లు, వేడి నీళ్లు: 2 టేబుల్ స్పూన్లు, పాలు: 2 కప్పులు (చిక్కటివి), గార్నిష్ కోసం: కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి. ఒక కప్పులో లేదా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, 2 టేబుల్ స్పూన్ల పంచదార, రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోయాలి. మొదట్లో ఇది చిక్కటి నల్లని ద్రవంలా కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ లేదా విస్కర్‌తో వేగంగా తిప్పుతూ చిలకాలి. తిప్పుతున్న కొద్దీ కాఫీ రంగు నలుపు నుంచి క్రమంగా లేత గోధుమ వర్ణంలోకి మారి, చిక్కటి నురగలాగా తయారవుతుంది. ఒక పాత్రలో రెండు కప్పుల పాలను బాగా మరిగించాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇపుడు మనం తయారుచేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్‌ను రెండు సర్వింగ్ కప్పులలో సమానంగా వేయాలి. దానిపై వేడివేడి పాలను కొద్దిగా పైనుంచి ధారగా పోయాలి. ఇలా పోయడం వల్ల కాఫీ క్రీమ్ పైన తేలుతూ మంచి నురగలా వస్తుంది. స్పూన్ తో మెల్లగా ఒకసారి కలిపి, పైన కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి జల్లి వేడివేడిగా సర్వ్ చేయడమే! కాఫీ చిలికేటప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే, చుక్కల చొప్పున వేడి నీళ్లను మాత్రమే చేర్చుకోవాలి. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి, అందులో చిలికిన పెరుగు, కొద్దిగా కశ్మీరీ కారం

చికెన్, మటన్.. రోటిన్ కర్రీలు బోర్ కొట్టినప్పుడు.. నోటికి పుల్లగా టేస్టీగా ఉండి.. మొత్తం అన్నంలోకి అద్భుతంగా తినే సాంబార్ ను చేసుకుంటే ఆ మజానే వేరు.. వాస్తవానికి సాంబార్.. దక్షిణాది వంటకాలలో ఒక ముఖ్యమైన, ప్రసిద్ధ వంటకం. ఇది అన్నంతో, ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్లతో అద్భుతమైన కాంబినేషన్. హోటల్స్‌లో లభించే ప్రత్యేకమైన రుచితో కూడిన సాంబార్‌ను ఇంట్లోనే సులభంగా, వేగంగా తయారు చేసుకునే విధానాన్ని ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. ఈ వంటకం కొత్తగా పెళ్ళైన వారికి, బ్యాచిలర్స్‌కు, లేదా ఇంటికి ఎక్కువ మంది అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో రుచికరమైన సాంబార్ సిద్ధం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పచ్చిశెనగపప్పు: ¼ కప్పు (మొత్తం 1 కప్పు పప్పు) నీళ్లు: సుమారు 2 లీటర్లు (పప్పు ఉడికించడానికి 1 లీటరు, సాంబార్కి 1 లీటరు) కళ్ళుప్పు: 1 టేబుల్ స్పూన్ (లేదా రుచికి సరిపడా) కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది) క్యారెట్: 1, ముల్లంగి: 1, పచ్చిమిరపకాయలు: 4-5, టమాటాలు: 2, చిన్న ఉల్లిపాయలు: ½ కప్పు, సొరకాయ: చిన్న ముక్క, మునక్కాయలు: 2 (ముక్కలుగా తరిగినవి, ఐచ్ఛికం: బెండకాయలు, వంకాయలు, దొండకాయలు నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు: ½ టేబుల్ స్పూన్, జీలకర్ర: ½ టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు: 4-6 (తుంచినవి), వెల్లుల్లి రెబ్బలు: 5-6 (తొలగొట్టినవి), కరివేపాకు: 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ: ½ టీస్పూన్ పప్పు ఉడికించడం: ముందుగా ఒక కుక్కర్లో ¾ కప్పు కందిపప్పు, ¼ కప్పు పచ్చిశెనగపప్పు తీసుకుని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఈ పప్పుల కలయిక సాంబార్‌కు హోటల్ రుచిని అందిస్తుంది. కడిగిన పప్పులో 1 లీటరు నీళ్లు, ½ టీస్పూన్ పసుపు, కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మూడు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. పప్పు పలుకు

‘పోస్ట్’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. ‘పోస్ట్’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. అయితే జెన్ జీ మాత్రం ‘పోస్ట్’ అనే మాటను సరికొత్తగా వినాలని కోరుకుంటోంది. వాట్సాప్, ఫేస్బుక్ కాకుండా ఉత్తరాల అనుభూతిని ఆస్వాదించాలని ఆరాటపడుతోంది. వారి అభిరుచికి తగ్గట్టుగా ‘స్నెయిల్ మెయిల్’ క్లబ్బులు పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో సభ్యత్వం తీసుకున్నవారికి పోస్ట్‌లో లేఖలు పంపించడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. అమెజాన్, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్... వీటిల్లో ఏదైనా బుక్ చేస్తే... నిమిషాల్లో ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అందిస్తున్నాయి. వాట్సాప్, జీమెయిల్ వంటివి సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్నాయి. ఇన్‌స్టా, స్నాప్‌చాట్ వంటివి వీడియోలను అందిస్తున్నాయి. ఒకరకంగా ఈ ఇన్స్టంట్ సంస్కృతి జెన్ జీ తరానికి నచ్చడం లేదు. పోస్టులో వచ్చే ఉత్తరం కోసం వేచి చూసే అనుభూతిని వాళ్లు కోరుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘స్నెయిల్ మెయిల్’ క్లబ్‌లలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏం చేస్తారంటే... ‘స్నెయిల్ మెయిల్’ క్లబ్లో సభ్యత్వం తీసుకుంటే ప్రతీ నెలా ఇంటికి అందంగా అలంకరించిన లెటర్లు పంపిస్తారు. వాటిలో చేతితో రాసిన ఉత్తరం, స్టిక్కర్లు ఉంటాయి. ఇన్‌స్టాలో ‘స్నెయిల్ మెయిల్’ అని వెతికితే రంగురంగుల కవర్లు, చేత్తో రాసిన ఉత్తరాలు, పాతకాలపు స్టాంపులు, పూలతో అలంకరించిన లేఖలు కనిపిస్తాయి. ఇలాంటి క్లబ్బులు పాశ్చాత్య దేశాల్లో చాలాకాలంగా ఉన్నాయి. మన దగ్గర ఈ మధ్యకాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త తరహా క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వీటి నిర్వాహకులు అంటున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ప్రతీ నెల ఒక థీమ్‌ను ఎంచుకుంటారు. కథలు, సందేశాలు, జోక్స్ లెటర్స్, చిన్నచిన్న కానుకలు.. ఇలా లేఖలు తమ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. లేఖలో ఏముంటుందో

వర్షాకాలం... వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చుట్టూ పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి. ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అలా వానాకాలంలో ఆరోగ్య అతిథిగా పలకరించేది బొంత కాకరకాయ. ఈ కూరగాయ రుచిలో మేటి. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అరచేతిలో ఇమిడిపోయే బొంతలో అణువణువూ సుగుణాలు ఎన్నో. అలా వానలు మొదలవ్వగానే... వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమల్లో ఇట్టే తేడా కనిపిస్తుంది. అల్లం, వెల్లుల్లి, పుదీనా తదితరాల వాడకం ఎక్కువవుతుంది. మార్కెట్లో గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, పొట్లకాయ లాంటి కూరగాయల హవా మొదలవుతుంది. అయితే ఏడాది పొడవునా దొరికే వీటిని పట్టించుకోకుండా... వానాకాలపు ఆరోగ్య అతిథి కోసం తెగ వెదుకుతుంటారు గృహిణులు. అదే బొంత కాకరకాయ.... కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటారు. కేవలం మాన్సూన్ సీజన్లోనే కనిపించే బొంత కాకరకాయ ఎంతో అపురూపమైన కూరగాయ. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో ఈ సీజన్లో వీటిని తప్పక తింటుంటారు. ఒక్కో చోట ఒక్కో పేరు... భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని చెప్పడానికి బొంత కాకరకాయను చూపొచ్చు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో దీనిని పిలుస్తుంటారు. తెలుగువాళ్లు అడవి కాకరకాయ, బోడ కాకరకాయ, బొంత కాకరకాయ అంటారు. అదే హిందీలో - కాకోడా, మరాఠీలో - కంటోలి, గుజరాతీలో - కంటోలా, తమిళంలో- మూకు పావక్కాయ్, మలయాళంలో - కొట్టుపావక్కా, కన్నడలో - మాడహాగలకాయి... ఇలా వీటికి ఎన్నో పేర్లు. దీని తోలుపై మెత్తని ముళ్లు ఉండడం వల్ల ఇంగ్లీష్‌లో ‘స్పైనీ గార్డ్’ అంటారు. దేశమంతా ఈ కూరగాయ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ... మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రజలు అమితంగా బొంత కాకరకాయ రుచుల్ని ఆస్వాదిస్తారు. మల్టీ విటమిన్లకు చిరునామా... పేరును బట్టి బొంత కాకరకాయ, మామూలు కాకరకాయలాగానే చేదుగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినా కూడా కాకరకాయంత చేదు ఇందులో

చూడటానికి చేతికి నాలుగు గాజులు లాగా కనిపిస్తాయి. కానీ, నాలుగు కనెక్టెడ్ గా ఉంటాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చేయి నిండుగా ఉంటుంది. ఈ గాజులు చూడటానికి హెవీగా అనిపిస్తాయి. కానీ, చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. చేతికి నిండుగా కనిపిస్తాయి.. నెమలి డిజైన్ లో ఉన్న ఈ గాజులు చాలా ట్రెండీగా ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి గాజులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలాంటి డిజైన్ మీకు ఆర్టిఫిషియల్ లో దొరుకుతాయి. ఇలాంటి గాజులు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. డ్రస్సులు, చీరలు ఏది వేసుకున్నా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.. గాజులు మొత్తం ప్లెయిన్ గా ఉండి.. మధ్యలో మాత్రమే డిజైన్ ఉంటుంది. మట్టిగాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు. ఇలాంటి ప్లెయిన్ డిజైన్ చాలా తక్కువ మంది ఇష్టపడతారు. ఇవి చూడటానికి సింపుల్ గా ఉన్నా మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.. Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి! Silver Rings: తక్కువ బడ్జెట్లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి! Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది! Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

భారతీయ పండుగల వంటి సందర్భాలలో జంతికలు ఒక ప్రముఖమైన పిండి వంటకం. కొనసీమ రుచుల ప్రత్యేకతతో, వేపుడు శెనగపప్పును (పుట్నాలు) ఉపయోగించి గుల్లగా, కమ్మగా ఉండే జంతికలను ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ రెసిపీ చాలా సులభం, కొత్తగా వంట చేసేవారు కూడా సునాయాసంగా చేయవచ్చు. 1. పుట్నాల పొడి తయారీ: ముందుగా, ఒక గ్లాసు వేపుడు శెనగపప్పును మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి కచ్చితంగా జల్లించుకోవాలి, ఎటువంటి పలుకులు లేకుండా చూసుకోవాలి. (టిఫిన్స్ లోకి చట్నీ చేసే పప్పులా). 2. పిండి కలపడం: ఒక పెద్ద గిన్నెలో మూడు గ్లాసుల పొడి బియ్యప్పిండి తీసుకోవాలి. దీనికి జల్లించుకున్న పుట్నాల పొడిని కలపాలి. నిష్పత్తి ఇలా ఉండాలి: ఒక గ్లాసు బియ్యప్పిండికి పావు గ్లాసు పుట్నాల పొడి. రెండు గ్లాసుల బియ్యప్పిండికి అర గ్లాసు పుట్నాల పొడి. పిండిని బాగా జల్లించుకోవడం చాలా ముఖ్యం, లేదంటే జంతికల గొట్టంలో అడ్డు పడుతుంది. 3.మసాలాలు చేర్చడం: జల్లించుకున్న పిండి మిశ్రమంలో తగినంత ఉప్పు, తగినంత కారం, అర స్పూన్ వాము వేసి కలపాలి. వాము బదులుగా నువ్వులు కూడా వేసుకోవచ్చు, అవి మరింత కమ్మదనాన్నిస్తాయి. 4. వేడినీళ్లు కలుపుకోవడం: ఇప్పుడు పిండిని కలపడానికి వేడి నీళ్లు సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టి, అవి పూర్తిగా మరగనివ్వకుండా, మరగడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ మరిగే నీళ్లు వేస్తే జంతికలు నూనె పీలుస్తాయి. 5. పిండి కలపడం: గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా పిండిలో పోస్తూ తడిపొడిగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకుండా, పిండిని జిగురుగా మారేలా కలుపుకోవాలి. వేపుడు శెనగపప్పు వేసాం కాబట్టి వేడినీళ్లు వేయడం వల్ల పిండికి జిగురుదనం వస్తుంది. మినప జంతికలకు వేడినీళ్లు అవసరం ఉండదు, నూనె కాచి పోసుకుంటే సరిపోతుంది. 6. నానబెట్టడం: పిండిని లైట్ గా ముద్ద

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు భారత్‌కు రప్పించారు. యూఏఈలో తలదాచుకుంటున్న అతడిని అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 14న అధికారికంగా వెల్లడించారు.పుణెలో పట్టుబడిన సుమారు 1,837 కిలోల మెఫిడ్రోన్ (విలువ రూ.6,000 కోట్లు), ఢిల్లీలో బయటపడిన దాదాపు రూ.13,000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులతో వీరేందర్ బసోయాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాలను విదేశాలకు అక్రమంగా తరలించడంలో అతడు కీలక సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో పూణె డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత బసోయా భారత్ నుంచి పరారయ్యాడు.ఎన్సీబీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో, ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని భారత్‌కు అప్పగించగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అధికారికంగా అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ నివాసి అయిన బసోయా కుమారుడు రిషబ్ బసోయాను కూడా భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానంలో ఇది ఒక కీలక మైలురాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. న్యూఢిల్లీ, ఆగస్టు 14: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. రూ.13 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్న బసోయాను ఇంటర్ పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చారు. ఎన్సీబీ అభ్యర్థన మేరకు ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు బసోయాను అరెస్టు చేశారు. ఎన్సీబీ అధికారులు అతన్ని యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. యూఏఈ బోసోయాను భారత్‌కు అప్పగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా విదేశాల్లో దాక్కున్నా సరే వేటాడుతామని ‘ఎక్స్’లో పేర్కొన్నారు

దక్షిణ భారతదేశ దేవాలయాలలో లభించే పులిహోర కేవలం రుచికరమైన ప్రసాదం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. పులిహోర తయారీలో ఉపయోగించే చింతపండు, పసుపు, ఇంగువ, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఇది త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ పులిహోర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలు పులిహోర ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే.. దక్షిణ భారతీయ భాషల నుంచి వచ్చింది పులిహోర. ఇందులో పులి అంటే చింతపండు రుచి, హోర అంటే అన్నం లేదా వండిన బియ్యానికి సంబంధించిన పదం. ఈ పులిహోరను తమిళంలో పులియోదరై, కన్నడంలో పులియోగరే అని పిలుస్తారు. అందువల్ల పులిహోర అంటే పులుపు అన్నం అని అర్థం. ఇది కేవలం వంటకం కాదు. భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత కలసిన జీవన చిహ్నం. ఆలయాలలో పూజలు ముగిసిన తర్వాత భగవంతునికి నివేదించే నైవేద్యంలో పులిహోరకు అగ్రతాంబూలం ఉంటుంది. ఆయుర్వేద, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం, చింతపండుతో తయారుచేసే ఈ అమ్ల ఆహారం సాత్విక గుణాలను పెంపొందిస్తుంది. మంత్రోచ్ఛారణల మధ్య, పవిత్రమైన వాతావరణంలో తయారుచేసి స్వామివారికి అర్పించడం వల్ల ఈ ప్రసాదంలో సానుకూల శక్తి నిండి ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. చింతపండు : ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు: ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇంగువ, ఆవాలు: కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా

సింపుల్ లుక్ లో మెరిసిపోవాలి అనుకుంటే.. ఇలాంటి జుంకాలు ట్రై చేయచ్చు. పైన స్టడ్ మ్యాచింగ్ కలర్ ట్రై చేయచ్చు. మీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉంటే.. ఈ జుంకా కచ్చితంగా నచ్చుతుంది. స్డడ్ దగ్గర కృష్ణుడి బొమ్మ ఉంటే.. కింద జుంకా వేలాడుతూ ఉంటుంది. మంచి రాయల్ లుక్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన డిజైన్ ఇది. చీరల మీదకు ఇలాంటి జుంకాలు చాలా బాగుంటాయి. ఇలాంటి జుంకాలు చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ పార్టీ వేర్ లుక్ కి చాలా బాగుంటాయి. కేవలం ఇయర్ రింగ్స్ తోనే రాయల్ లుక్ రావాలి అంటే.. ఇలాంటి స్టోన్స్ ఇయర్ రింగ్స్ ధరించాల్సిందే. చాలా అందంగా కనిపిస్తారు. ఎరుపు, ఆకు పచ్చ స్టోన్స్ తో ఉన్న ఇలాంటి జుంకాలు చీరల మీదకు చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి జుంకాలు పిల్లలకు కూడా బాగుంటాయి. డ్యాన్స్ చేస్తున్న డాల్ లాగా ఈ జుంకాలు కనిపిస్తాయి. స్టడ్ లో బంగారం కాకుండా.. రెడ్ కలర్ స్టోన్ ఉంచి.. కింద ముత్యాలతో వేలాడే బుట్ట వేలాడదీశారు. మ్యాచింగ్ చీరలకు ఇది ట్రై చేయచ్చు. పొడవాటి జుంకాలు పెట్టుకోవడం ఇష్టమైన వారు.. ఇవి ట్రై చేయచ్చు. ఆర్టిఫీషియల్ జ్యూవెలరీ లో కూడా ఈ డిజైన్లు మీకు లభిస్తాయి. మెడలో ఎలాంటి జ్యూవెలరీ లేకపోయినా.. కేవలం ఇయర్ రింగ్స్ తో మంచి లుక్ కావాలి అంటే.. ఈ జుంకాలు పర్ఫెక్ట్ ఛాయిస్. Silver Anklets: డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి! రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా? Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా? Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

మైసూర్ పాక్ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో మహారాజు 4వ కృష్ణరాజ వడియార్ కోసం కొత్త స్వీట్ తయారు చేసే బాధ్యతను వంటమనిషి కాకాసుర మడప్ప తీసుకున్నారని చెబుతారు. శనగపిండి, పంచదార, నెయ్యితో చేసిన ఈ స్వీట్ అనుకోకుండా కొత్త రూపం దాల్చిందని కథనం.పంచదార పాకాన్ని మడప్ప ఉడికించిన సమయంలో అది కొంత ఎక్కువసేపు మంటపై ఉండటంతో బంగారు రంగులో, మెత్తగా ఉండే ప్రత్యేకమైన స్వీట్ తయారైందని ప్రచారంలో ఉన్న కథ చెబుతోంది. మహారాజు దాని పేరు అడిగినప్పుడు, అప్పటికప్పుడు మడప్ప దానికి ‘మైసూరు పాక’ అని పేరు పెట్టారని అంటారు. కన్నడలో ‘పాక’ లేదా ‘పాకా’ అనే పదానికి తీపి లేదా వంట ప్రక్రియ అనే అర్థాలు ఉన్నాయి.మహారాజుకు స్వీట్ నచ్చడంతో అది రాజభవనం దాటి ప్రజల్లోకి వెళ్లిందని చెబుతారు. మడప్ప మైసూర్ ప్యాలెస్ వెలుపల స్వీట్ షాపు ప్రారంభించారని, అదే తర్వాత ప్రసిద్ధ గురు స్వీట్స్‌కు మూలమైందనే వాదన కూడా ఉంది. అయితే ఈ విషయం కుటుంబ చరిత్రగా మాత్రమే ప్రచారంలో ఉంది. దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు.కాలక్రమంలో మైసూర్ పాక్ కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇది ప్రధానంగా మెత్తగా నోట్లో కరిగిపోయే రకం, సంప్రదాయంగా కొంత గట్టిగా ఉండే రకం అంటూ రెండు విధాలుగా కనిపిస్తుంది. అయితే ఈ స్వీట్ పేరు, ప్యాలెస్‌లో పుట్టిన కథకు సంబంధించిన వివరాలు ఎక్కువగా మౌఖికంగానే ప్రాచుర్యంలో

పండుగలప్పుడు లేదా ప్రత్యేక సందర్భాలలో తీపి వంటకాలంటే ముందుగా గుర్తొచ్చేది పూర్ణం బూరెలు. అయితే డీప్ ఫ్రై చేసే బూరెలను నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం, అలాగే డైట్లో ఉన్నవారి కోసం ఒక్క స్పూన్ నూనెతో రుచిగా, ఆరోగ్యకరంగా, క్రిస్పీగా పూర్ణం బూరెలను పనారం పాన్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. * ఇడ్లీ రవ్వ: ఒక గ్లాసు (లేదా సగం తగ్గించి అర గ్లాసు) ముందుగా, ఒక గ్లాసు పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి, అదే గ్లాసుతో రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. నానిన పప్పును కుక్కర్లో వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి, కానీ నీళ్లలా మారకూడదు. ప్రెజర్ పోయిన తర్వాత, అదనపు నీటిని వడకట్టి పప్పును ఒక ప్లేట్లో వేసి చల్లార్చాలి. ఇది ఇప్పటికే మెత్తగా ఉడికినందున మాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే పప్పు గుత్తితో మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, ఒక గ్లాసు బెల్లానికి రెండు స్పూన్ల నీళ్లు కలిపి సన్నని మంటపై కరిగించాలి. బెల్లం కరిగి నురగలు రావడం మొదలైన తర్వాత ఉడికించిన శనగపప్పును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు ఏడు, ఎనిమిది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. దగ్గరపడిన తర్వాత పావు స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసి మరో రెండు, మూడు నిమిషాలు కలిపి స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకుని, అవి డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు మంచి క్వాలిటీ మినపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. మరొక
మొటిమల ప్రదేశంలోని బ్యాక్టీరియాను తగ్గించేందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. దీనికోసం దాల్చినచెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి మొటిమల దగ్గర రాసుకోండి. 15 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. వేపాకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం వేపాకులను పేస్ట్ చేసి మొటిమలపై రాసుకోండి. అరగంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. దీనికోసం పసుపులో కొద్దిగా నీళ్లు లేదా తేనె కలిపి మొటిమలపై రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన క్లాత్‌లో చుట్టి మొటిమలు ఉన్న ప్రదేశంలో నొక్కుతూ ఉండండి. 5 నిమిషాలు ఇలా చేయడం వల్ల మొటిమల వాపు, ఎరుపు తగ్గుతుంది. అలోవెరాలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మొటిమల వాపు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం తాజా అలోవెరాను మొటిమల దగ్గర రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే చాలు. ముఖంపై జిడ్డు, బ్యాక్టీరియా తొలగించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. తద్వారా మొటిమలు కూడా తగ్గుతాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో టీ ట్రీ ఆయిల్ సహాయపడుతుంది. దీనికోసం ఒక చుక్క టీ ట్రీ ఆయిల్లో 9 చుక్కల కొబ్బరి నూనె కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసుకుంటే సరిపోతుంది. చర్మంపై పీహెచ్ బ్యాలెన్స్ బాగుచేసి మొటిమలు తగ్గించడంలో వెనిగర్ సహాయపడుతుంది. ఒక భాగం వెనిగర్‌లో మూడు భాగాల నీళ్లు కలిపి మొటిమలపై రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. మొటిమలు తగ్గించేందుకు ఆవిరి పట్టడం చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ముఖానికి ఆవిరి పడితే రంధ్రాలు ఓపెన్ అయి బ్యాక్టీరియా నశిస్తుంది. మొటిమలు తగ్గుతాయి

తొమ్మిది రోజుల పాటు పూజలు పెళ్లికాని యువతులకు ప్రత్యేకం రుద్రంగి(కరీంనగర్): గిరిజన తండా ల్లో సంస్కృతి, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తీజ్‌ను కేవలం తండాల్లో పెళ్లి కాని గిరిజన యువతులు మాత్రమే నిర్వహిస్తుంటారు. తమ ఆచార, వ్యవహారాలకు అనుగుణంగా ఆషా ఢం, శ్రావణమాసంలో తీజ్ పండుగను నిర్వహిస్తారు. ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికి గిరి జనులు తమ సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుం టూ వస్తున్నారు. యువ తుల ప్రత్యేక పూజలు తండాలోని పెద్ద మనిషి సూచనల మేరకు పండుగ జరుపుకొనే రోజును యువతులందరు కలిసి నిర్ణ యించుకుంటారు. యువతులు వారి సోదరులతో కలిసి అడవికి వెళ్లి పుట్టమన్ను సేకరిస్తారు. అల్లిన బుట్టలో పుట్ట మన్ను పోసి గోధుమ గింజలను వేస్తారు. ఇలా చేసిన బుట్టలను తండా పెద్ద మనిషి ఇంటి ఎదుట ఏర్పాటుచేసిన మంచెపై పెడుతారు. గోధుమ గింజలు ఉన్న వెదురు బుట్టలపైన మొలకలు వచ్చే వరకు తొమ్మిది రోజుల పాటు నీళ్లు పోస్తారు. తమ జీవితంలోకి మంచి భాగస్వామి రావాలని, తండాకు మంచి జరగాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. గిరిజనుల ఆరాధ్యదైవం అయిన సేవాలాల్, మేరమ్మకు పూజలు చేస్తారు. ఉత్సవాల్లో పాల్గొనే యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం బుట్టలకు నీరు పోస్తారు. తొమ్మిదో రోజు గిరిజన ప్రత్యేక దుస్తులు, ఆభరణాలు ధరించి తండా పెద్ద ఇంటి వద్దకు చేరుకుంటారు. ఊరేగిం పుగా వెళ్లి చెరువులు, వాగుల్లో గోదుమ మొలకలను నిమజ్జనం చేస్తారు. దీంతో పండగ ముగుస్తుంది. ఎక్కడ ఉన్నా సొంతగూటికి.. తొమ్మిది రోజులపాటు జరుపుకొనే తీజ్ వేడుకల్లో పాల్గొనడం కోసం గిరిజనులు ఎక్కడ ఉన్నా తమ తండాలకు చేరుకుంటారు. గిరిజన సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతులను కాపాడుకోవడం కోసం ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు, దూర ప్రాంతాల్లో

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ నిర్మించింది. లోకల్ గా తెలుగు రాష్ట్రాల్లో పెద్ది చిత్రం తిరుగులేని విజయం అందుకుంది కానీ.. ఓవర్సీస్ లో నిరాశ పరిచింది. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు జాన్వీ కపూర్ పాత్ర ప్రజెంటేషన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జాన్వీ కపూర్ పాత్రని చూపించిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించేలా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనితో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి జాన్వీ కపూర్ అభ్యంతరకర సన్నివేసాలని ట్రిమ్ చేశారు. తాజాగా తమిళ నటి అదితి బాలన్ పెద్ది మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదితి బాలన్ రీసెంట్ గా ఎక్జామ్ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అంతకు ముందు అదితి బాలన్ శాకుంతలం, కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. అదితి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా నటీమణుల పాత్రల గురించి ఓపెన్ అయింది. నేను రీసెంట్ గా పెద్ది మూవీ చూశాను. అందులో జాన్వీ కపూర్ పాత్రని ఎందుకు రాశారో, అలా ఎలా రాశారో అర్థం కావడం లేదు. అసలు హీరోయిన్లకు అలాంటి పత్రాలు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? జాన్వీ కపూర్ పాత్రని ఇంకా బాగా రాసి ఉండాల్సింది. ఆమెకి కూడా నటించే అవకాశం ఇచ్చి ఉండాల్సింది. జాన్వీ కపూర్ పాత్రని అలా చూపించడం చాలా పెద్ద తప్పు. హీరోయిన్ పాత్రని కేవలం సాంగ్స్ లో డ్యాన్స్ కోసం వచ్చి వెళ్లే విధంగా తీర్చిదిద్దకూడదు అని అదితి బాలన్ దుమ్మెత్తి పోశారు. సమంత మా ఇంటి

ఇది తయారు చేయడానికి పెద్దగా పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతోనే త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి బెల్లం, కొబ్బరి పాలతో రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. సేమియా – 1 కప్పు బెల్లం – 1 కప్పు కొబ్బరి పాలు – 2 కప్పులు నీరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్‌స్పూన్లు జీడిపప్పు – 10 ఎండు ద్రాక్ష – 1 టేబుల్‌స్పూన్ ఏలకుల పొడి – ½ టీస్పూన్ కొబ్బరి తురుము – కొద్దిగా ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించాలి. సేమియాకు మంచి వాసన వచ్చి లేత బంగారు రంగులోకి మారిన తర్వాత నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టాలి. సేమియా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం పాకాన్ని అందులో వేసి బాగా కలపాలి. బెల్లం, సేమియా బాగా కలిసిన తర్వాత మంటను తగ్గించాలి. ఇప్పుడు కొబ్బరి పాలను పోసి నెమ్మదిగా కలుపుతూ కొద్దిసేపు వేడి చేయాలి. అయితే కొబ్బరి పాలు వేసిన తర్వాత పాయసాన్ని ఎక్కువసేపు మరిగించకూడదు. చివరగా ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము వేసి కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన బెల్లం కొబ్బరి పాల సేమియా పాయసం రెడీ. వేడిగా లేదా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసిన తర్వాత పాయసాన్ని ఎక్కువగా మరిగిస్తే అవి విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చివర్లో కొబ్బరి పాలు వేసి తక్కువ మంటపై వేడి చేయడం మంచిది

ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ Prasanna Yadla 11 August 2026 Pic credit - Pinterest వేపాకులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, వీటి వలన ఎన్నో లాభాలు ఉన్నాయి వేపాకులు ఈ ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎలాగో ఇక్కడ చూద్దాం.. ఆయుర్వేదంలో ఈ వేప ఆకుల్లో ఉండే సహజ గుణాలు మీ చర్మాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి సహజ గుణాలు మీరు దీనిని ఆకుల రసంగా తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అవుతాయని అంటున్నారు పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అంతేకాదు మీ చర్మంపై ఉన్న మచ్చలను కూడా ఇవి పూర్తిగా తగ్గిస్తాయి. చర్మంపై ఉన్న మచ్చలను వేప చెట్టు మొదలు నుంచి ఆకులు, పువ్వులు ఇలా అన్ని మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడతాయి ఆకులు, పువ్వులు అంతేకాదు ఇది వ్యవసాయానికి కూడా పని చేస్తుంది అందుకే దీనిని సర్వరోగ నివారణిగా చెబుతారు సర్వరోగ నివారణి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులకు నాణ్యమైన కలపను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కేవలం అసలు ధరకే అందించాలని ఆయన అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టు 11న జరిగిన సమీక్షా సమావేశంలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్’ల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను ఆయన ఖరారు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న చేతివృత్తుల కళాకారులకు ముడిసరుకు కొరత ప్రధాన సమస్యగా మారింది. మార్కెట్లో మధ్యవర్తుల ప్రమేయం పెరగడంతో, నాణ్యమైన కలప అధిక ధరలకు లభిస్తోంది, దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది. ఈ సమస్యను గుర్తించిన పవన్ కళ్యాణ్, ముడిసరుకు సేకరణ నుంచి రవాణా మరియు నిల్వ వరకు అయ్యే ఖర్చులను మాత్రమే వసూలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కళాకారులకు కావాల్సిన ముడిసరుకు అత్యంత సరసమైన ధరలకే అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 6 ప్రధాన కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. కొండపల్లి, ఎటికోప్పాక, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి మరియు బొబ్బిలి ప్రాంతాల్లో ఈ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏర్పాటు వల్ల స్థానిక చేతివృత్తుల వారికి రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తేలికపాటి పొనికి కలపను, ఎటికోప్పాక బొమ్మలకు అంకుడు కలపను ఈ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితంగా బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే జాక్ ఫ్రూట్ మరియు రోజ్‌వుడ్ వంటి ఖరీదైన కలప కూడా ఇక నుంచి కళాకారులకు సులభంగా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ వుడ్ బ్యాంక్ ద్వారా వెదురు మరియు టేకు వంటి రకాలను కూడా సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా, అరుదైన కలప జాతులను గుర్తించి వాటిని అటవీ నర్సరీలలో పెంపకం చేపట్టాలని పవన్ కళ్యాణ్

మూడు లైన్ల ముత్యాల హారానికి. హెవీ లాకెట్ జత చేశారు. ఈ లాకెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. మీ లుక్ కంప్లీట్ అవుతుంది. మంచి రాయల్ లుక్ వస్తుంది. ముత్యాలతో సింపుల్ లుక్ కావాలి అంటే.. ఇలా చోకర్ ట్రై చేస్తే సరిపోతుంది. ముత్యాలకు హెవీ లాకెట్ ఎటాచ్ చేశారు. ఆ లాకెట్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ట్రై చేస్తే లుక్ బాగుంటుంది. ముత్యాల చోకర్లు అయినా కాస్త ట్రెండింగ్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే. ఇవి మెడకే అందాన్ని తెస్తాయి. ముత్యాల గొలుసుకు కాస్త డిఫరెంట్ లుక్ కావాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే. చాలా గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. మూడు లైన్ల పొడవాటి ముత్యాల గొలుసుకు.. కెంపులతో నిండిన లాకెట్ జత చేశారు. ఇలాంటి లాకెట్స్ మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. మీకు తెల్లటి ముత్యాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి పూసల హారం కూడా ట్రై చేయచ్చు. ఇలాంటి డిజైన్లలో మనకు చాలా రంగుల్లో లభిస్తాయి. ముత్యాల హారం సింపుల్ గా కనిపించాలి అంటే.. సింపుల్ లాకెట్ తో పెయిర్ చేయాలి. ఇలాంటివి చీరల మీదకు ఇలాంటి హారాలు చాలా బాగుంటాయి. Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ! Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..! Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళాకారులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి అవసరమైన నాణ్యమైన కలపను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అసలు ధరకే అందించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల’ ఏర్పాటుపై సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కలప సేకరణ, రవాణా, నిల్వకు అయ్యే వాస్తవ వ్యయాన్ని మాత్రమే వసూలు చేస్తూ చేతివృత్తుల వారికి ముడిసరుకును సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ముడిసరుకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు ఈ వుడ్ బ్యాంకులు ఒక భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రక్రియలో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా కళాకారుల ఉత్పత్తి వ్యయం తగ్గి, వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని వివరించారు.రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి వంటి ఆరు ప్రధాన కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. కొండపల్లి బొమ్మలకు అవసరమైన తెల్లపొనికి, ఏటికొప్పాక హస్తకళలకు వినియోగించే అంకుడు, బొబ్బిలి వీణల తయారీకి వాడే పనస, రోజ్‌వుడ్ వంటి కలపను ఈ బ్యాంకుల ద్వారా సరఫరా చేస్తారు. అలాగే, రాజమండ్రి సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు, టేకు వంటివి అందుబాటులో ఉంటాయి. అరుదైన కలప జాతుల లభ్యతను మ్యాపింగ్ చేసి, వాటిని అటవీ నర్సరీలలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Star Heroine: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించారు. అయితే ఆమె పాత్రను తెరపై చూపించిన విధానంపై విడుదల సమయంలో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాల విషయంలో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై తాజాగా అదితి బాలన్ మాట్లాడారు. జాన్వీ కపూర్ పాత్ర తనకు చాలా నిరాశ కలిగించిందని ఆమె చెప్పారు. అంతేకాదు, ఆ పాత్రను అలా చూపించాల్సిన అవసరం లేదని తనకు అనిపించిందన్నారు. ఒక హీరోయిన్‌కు మంచి పాత్రను రాసే అవకాశం ఉన్నప్పటికీ, ‘పెద్ది’లో ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల్లో మహిళా పాత్రలను మరింత బలంగా, అర్థవంతంగా రాయాలని అదితి బాలన్ సూచించారు. హీరో పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, హీరోయిన్ల పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మహిళలను కేవలం కొన్ని సన్నివేశాల కోసం ఉపయోగించకుండా, కథలో కీలకంగా ఉండే పాత్రలను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదితి బాలన్ ప్రస్తుతం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమాలో నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, డాలీ ధనుంజయ, ప్రియాంక మోహన్ తదితరులు నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌కు హేమంత్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహిళా పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయని అదితి తెలిపారు
తమిళనాడుకు చెందినది కంచి పట్టు. మందపాటి నేత, స్వచ్ఛమైన బంగారు జరీ పనితనానికి ఈ చీరలు పెట్టింది పేరు. పెళ్లిళకు వీటిని ధరిస్తారు. వారణాసిలో తయారయ్యే ఈ చీరలు మొఘలుల కాలం నుంచి ఉన్నాయి. సన్నటి పట్టుపై బంగారం, వెండి దారాలతో నేసే డిజైన్లు ఎంతో అందంగా కనిపిస్తాయి. పైతానీ పట్టు మహారాష్ట్ర సంప్రదాయ చీర. దీని కొంగుపై రంగురంగుల నెమలి డిజైన్లు వస్తాయి. చేనేత కళకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. కర్ణాటకకు చెందిన మైసూర్ సిల్క్. ఈ చీరలు చాలా ఫేమస్. కట్టుకుంటే చాలా మృదువుగా, తేలికగా ఉంటాయి. గుజరాత్‌కు చెందిన ఈ చీరను ఇక్కత్ అనే డబుల్ వీవింగ్ పద్ధతిలో నేస్తారు. చీరకు రెండు వైపులా ఒకే రకమైన డిజైన్, రంగులు ఉంటాయి. అసోం రాష్ట్రంలోని అరుదైన పట్టు పురుగుల నుంచి తీసిన పట్టుతో ఈ చీరను నేస్తారు. ఈ చీరను ఉతికే కొద్దీ దాని మెరుపు మరింత పెరుగుతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చందేరీ పట్టు చీరలో కాటన్ కూడ కలుస్తుంది. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి! Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్ Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి

మన దేశంలో - సహజంగానే - కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. 'విధిరాత'కి సర్వత్రా విధేయత లభించింది. మన దేశంలో - సహజంగానే - కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. 'విధిరాత'కి సర్వత్రా విధేయత లభించింది. అర్ధం కానిదల్లా 'బ్రహ్మలిపి' అయింది. అయితే ఇది కొద్దిరోజుల్లో కొంతమంది ఒక చోట గుమిగూడి చేసిన కుట్ర కాదు; శతాబ్దాలపాటు క్రమేపీ దేశమంతటా వ్యాపించిన భావజాలం. మాట్లాడే జంతువు మనిషి మాత్రమే. సుమారు లక్ష సంవత్సరాల క్రిందట భాషకు మౌలిక రూపాలు ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల అంచనా. ఆదిమ మానవులు గుంపులుగా వేటాడేటప్పుడు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, జంతువు జాడను తెలియపరచుకుంటూ ముందుకి సాగిన కాలంలో శబ్దాలు, అనుకరణలు, మాటలు అవసరమయ్యాయి. వేట ముగిసాక, రాత్రిపూట మంట చుట్టూ చేరి, మాంసం తింటూ, ఆ రోజున జరిగిన సాహసాల్ని పిల్లలకు వివరించినప్పుడు కథలు పుట్టి ఉండవచ్చు. మాటలు, పాటలయ్యాయి; పాటకి నృత్యం తోడైంది. సాహిత్యం, సంగీతం, భాషతోనే వికసించాయి. భాష అనే ఉమ్మడి సాధనమే మానవ సమూహాల తొలి అస్తిత్వ ప్రకటన. లిపి తరవాతెప్పుడో (సుమారు క్రీ.పూ.3000) పుట్టింది. తిండిని పోగు చేసుకుంటూనో, వేటాడుతూనో, లేదా పశుపోషకులుగానో జీవించిన తెగలకు లిపి అవసరం లేదు. నదీ తీరాలలో స్థిర వ్యవసాయం మొదలై, పట్టణాలు వెల్లివిరిసాక – నాగరికులకు ఎన్నో వస్తువులు, దినుసులు, వస్త్రాలు, మద్యం, వగైరాలు అవసరమ య్యాయి. అదనపు ఫలసాయం, వస్తు మార్పిడి, ఇతర ప్రాంతాలలో దొరికే వస్తువులను సంపాదించుకోవడానికి తోడ్పడ్డాయి. డబ్బు వాడుకలోకి వచ్చాక, దూర దేశాలతో వ్యాపారం సుగమం అయింది. నౌకా రవాణా వృద్ధి చెంది, రేవులు నగరాలయ్యాయి. ఈ క్రమంలోనే లిపి అవసరమైంది. సింధునదీ ప్రాంతంతో సహా అన్ని ప్రాచీన నాగరికతలలోనూ వర్తకుల ముద్రలకు, సుంకాల పట్టీలకు, పాలకుల ప్రకటనలకు లిపి ఆధారమైంది. శిలాక్షర రూపాల్లో శాసనాలు లిఖించబడ్డాయి. తర్వాతి దశలో అంతవరకూ మౌఖికంగా ఉండిన జానపద గాథలకు

హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. రంజాన్‌కు 33 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా: సంజయ్ హైదరాబాద్/సైదాబాద్/చాంద్రాయణగుట్ట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘రంజాన్ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు ఇచ్చింది. వారికి ఎందుకిచ్చారని నేను అడగడం లేదు. కానీ 80 శాతం ఉన్న హిందువుల పండుగకు కేవలం రూ.20 కోట్లు విదిలిస్తారా? హైదరాబాద్‌లో 3,400 ఆలయాలుంటే ఈ నిధులు ఏం సరిపోతాయ’ని మండిపడ్డారు. బోనాల ఉత్సవాలకు ఆలయాల్లో కనీస సౌకర్యాలు సమకూర్చలేదని, అభివృద్ధి గురించి తాము మాట్లాడితే మతం రంగు పులుముతారా అని ప్రశ్నించారు. జెన్ జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోందని, హిందూ సమాజం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జెన్ జీలు ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాదు, హిందూ సనాతన ధర్మం కోసం కూడా మాట్లాడుతున్నారన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం సంజయ్.. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళి, సైదాబాద్ కుర్మగూడలోని నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష మంది భక్తులు సందర్శించుకునే లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో బోనాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.5.50 లక్షలు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. ఒవైసీ బాధ పడతారనే ఈ ఆలయానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హిందూ ధర్మమంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్‌ది అని ధ్వజమెత్తారు. ‘నేను గత జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే హేళన చేసిన కేటీఆర్ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు. కేటీఆర్‌లాంటి మూర్ఖుడికి కూడా జ్ఞానోదయం