
Aditi Rao Hydari : లస్ట్‌స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో అదితి రావు హైదరి.. భర్తతో కలిసి.. ఫోటోలు వైరల్..
లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నటి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నటి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Harish Rao | 22Aపై ఒక్క ఆరోపణకు కూడా పొంగులేటి సమాధానం చెప్పలే.. మా మామ భూకుంభకోణం చేయలె..!

Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే

Harish Rao | భూముల చుట్టే రేవంత్ పరిభ్రమణం.. 22ఏ పేరిట ప్రజల జీవితాలతో చెలగాటం

Harish Rao | 22A బిగ్ స్కామ్.. రేవంత్ A1.. పొంగులేటి ఏ2.. నిప్పులు చెరిగిన హరీశ్‌రావు

Harish Rao | భూ భారతి కాదు, భూ హారతి.. హరీశ్ రావు ఫైర్

Harish Rao | చీము, నెత్తురు ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి : హరీశ్ రావు

Harish Rao | నీళ్లు ఉండి మోటార్లు నడపడం చాతకాని ముఖ్యమంత్రిని నిన్నే చూస్తున్నా: హరీశ్ రావు

Harish Rao | మిగతా మూడు మోటార్లు ఎందుకు బంద్ పెట్టారు..?.. ఎల్లూరు పంప్‌హౌస్‌పై హరీశ్ రావు

Harish Rao | రేవంత్ రెడ్డికి సొంత ఊరి నుంచే కౌంట్‌డౌన్ మొదలైంది : హరీష్‌రావు

Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా

Harish Rao | ఇది కౌరవ సభ.. రేవంత్ రెడ్డి కలియుగ దుశ్వాసనుడు.. అసెంబ్లీ వేదికగా హరీశ్‌రావు ధ్వజం

Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..

Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం

Kavitha : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత..బీఆర్ఎస్కు దూరం అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన టార్గెట్‌ను మారుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్లో తనకు అన్యాయం జరిగిందన్న మాటనే బలంగా వినిపిస్తున్న కవిత..పార్టీ తనను దూరం పెట్టడానికి..తన తండ్రి కేసీఆర్‌కు తనకు గ్యాప్ పెంచడానికి కారణం..వాళ్లే అంటూ పలువురు లీడర్లపై బాణాలు ఎక్కుపెడుతు వస్తున్నారు. మొన్నటి వరకు జోగినపల్లి సంతోష్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత గుంటనక్క అంటూ హరీశ్‌పై అటాక్ చేశారు. అటు కేటీఆర్‌ను అప్పుడప్పుగు గట్టిగానే విమర్శిస్తున్నారు. లేటెస్ట్గా ఇందూరు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డే తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు కవిత. దీంతో ఆమె టార్గెట్ మారినట్లే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక ఆమె లక్ష్యమేంటన్న చర్చ మొదలైంది. కేసీఆర్‌తో తనకు దూరం పెరగడానికి ప్రశాంత్‌రెడ్డే కారణమన్నది కవిత ఆరోపణ. తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని విమర్శిస్తూ..మహాభారతంలోని శకునితో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే..కవిత రాజకీయ కథనంలో ప్రశాంత్‌రెడ్డిని ఒక కీలక పాత్రగా చూపించే ప్రయత్నం జరుగుతోందా.? ఇంతకాలం హరీశ్‌రావు చుట్టూ తిరిగిన వివాదం..ప్రశాంత్‌రెడ్డి వైపు తిరగడానికి కారణమేంటన్నది డిస్కషన్‌కు దారితీస్తోంది. ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కవిత ఇందూరునే వేదికగా చేసుకున్నారు. అక్కడే సభలు పెడుతూ..రాజకీయ భవిష్యత్‌పై సంకేతాలు ఇస్తూ వస్తున్న కవిత.. అదే నిజామాబాద్ కేంద్రంగా ప్రశాంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో అన్యాయం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కవిత కన్నీళ్లపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఇది ఆమె వ్యక్తిగత ఆవేదనా.? లేక ప్రజల్లో సానుభూతిని పెంచుకునే రాజకీయ వ్యూహమా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పాలిటిక్స్‌లో సెంటిమెంట్ కూడా ఒక బలమైన ఆయుధమే. ఒక నాయకుడికి అన్యాయం జరిగిందన్న భావనను ప్రజల్లో బలంగా నాటగలిగితే..అది రాజకీయంగా సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. కవిత కూడా సానుభూతి కార్డుతోనే బీఆర్ఎస్ను బ్లేమ్ చేసే ప్లాన్‌లో ఉన్నారా

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎంఅనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ!నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల దాహార్తిని తీరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పయనించి వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు, స్వయంగా కాలువలోనే నిల్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న గోదారమ్మకు పుష్పాలు సమర్పించి, జలహారతి ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకున్న అనంతరం, ఉద్విగ్నభరిత వాతావరణంలో గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.బుధవారం పాయకరావుపేటలో జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, ఎంపీలు చింతకాయల విజయ్, సీఎం రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటంతో కళాకారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తొలిసారిగా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్‌ను ప్రారంభించి జలప్రవాహానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన గోదావరికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కాలువ ద్వారా ఏలేరు కాలువకు నీటిని అందించడంతో పాటు అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపే ప్రణాళిక ఉంది. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాలకు భరోసా లభించడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడి ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం ప్రాంతం నుంచి ప్రారంభమై తూర్పు దిశగా విస్తరిస్తుంది. గోదావరి జలాలను కొండ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేలా దీని మార్గాన్ని రూపొందించారు. ప్రారంభ ప్రాంతంలోనే కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన ఇంజినీరింగ్ ప్రత్యేకత. సుమారు 914 మీటర్ల పొడవుతో నిర్మించిన సొరంగం ద్వారా గోదావరి జలాలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ కాకినాడ, అనకాపల్లి మీదుగా విశాఖ ప్రాంతానికి చేరేలా కాలువ వ్యవస్థను రూపొందించారు. ఈ మార్గంలో పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రావిటీ ద్వారా నీరు సహజ ప్రవాహంతోనే ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం నిర్మించిన ప్రధాన కాలువతో పాటు తాగునీటి పంపిణీ వ్యవస్థలను కలుపుకొని సుమారు 213 కిలోమీటర్ల మేర జలమార్గాన్ని అభివృద్ధి చేశారు. పోలవరం ఎడమ కాలువ

Bhimavaram: పవన్ కళ్యాణ్ జన్మదిన బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు! Bhimavaram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ కారిడార్లలో డిప్యూటీ సీఎం అనే పదవికి సరికొత్త గ్లామర్, బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం భీమవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విస్సాకోడెరు వంతెన దగ్గర జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఉండి రోడ్డులోని మల్టీప్లెక్స్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కేవలం ఒక హోదాగా పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే సేవకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనందిస్తున్నారని అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. ప్రజాదరణ పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారని, గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అనంతరం జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జి, బుధవారం మార్కెట్ రోడ్, పోలీస్ బొమ్మ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బాంబే స్వీట్స్ సెంటర్, ఉండి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే

Anakapalle: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే! Anakapalle: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే బొబ్బిలి RVSKK రంగారావు (బేబీ నాయన) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అనకాపల్లి ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని శ్రీ నూకాంబిక అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, టెంపుల్ డైరెక్టర్లు పొలిమేర ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజు, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఎస్. భానుచందర్ (అఖి)తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్ బటన్ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు. హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు. Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!

భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 02 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ తీరుగా తయారు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసోళ్లు బిజెపి నాయకులపై దాడి చేయాలనే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ఇటీవల నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిలోకి వెళ్లి అధ్యక్షుడి తల్లిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు బిజెపిని అధికారంలోకి తెచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ రవిదాస్ ఫొటోపై కూడా నల్లరంగు పోశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీపై దాడులు అధికమవుతున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రదర్స్ అండ్ కంపెనీ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలి మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలి పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలనిస్తోంది. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25లక్షలమంది అక్షరాస్యులుగా మారారు, ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఎపి కృషిని కేంద్రప్రభుత్వం అభినందించినట్లు అధికారులు తెలుపగా, మంత్రి లోకేష హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుంది, 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. 2027 మార్చినాటికి మరో 25లక్షలమందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27లక్షలమంది అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం 11 ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి, పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది ఇంటర్మిడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మడియట్ లో సుమారు 10వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్

Narayanpet : నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస మరణాలపై తక్షణ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల కాలంలో నమోదవుతున్న మరణాలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసేందుకు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం నారాయణపేటకు వచ్చింది. విచారణ బృందంలో డాక్టర్ బాబురావు(పీడియాట్రిక్ సర్జన్), డాక్టర్ కవిత (పీడియాట్రిక్ ప్రొఫెసర్)లు ఉన్నారు. వీరిద్దరూ నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణులు. నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. సంపత్ కుమార్ సింగ్ (చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు) సమక్షంలో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి చెందిన ప్రత్యేక వైద్యుల బృందం విచారణ చేపట్టింది. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సకు సంబంధించిన వివరాలు ఆరా తీసింది. మృతి ఘటనలకు దారితీసిన పరిస్థితులను ప్రత్యేక వైద్యుల బృందం సమగ్రంగా పరిశీలించింది. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రత్యేక వైద్యుల బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Govt Employees DA Hike: సుదీర్ఘ కాలంగా తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు భత్యం, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లు పరిష్కరించని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రోజు తమ ఆందోళనలను తీవ్ర రూపం చేశారు. తమ నిరసన కార్యక్రమాలతో హైదరాబాద్‌ను దద్దరిల్లేలా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లోని సచివాలయం, కలెక్టరేట్, భీమా భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్ తదిదతర ప్రాంతాల్లో మహాధర్నా చేపట్టారు. సెక్రటేరియేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బాహుబలి గేట్ వద్ద మహా గర్జన చేశారు. రెండో వేతన సవరణ సంఘం, డీఏ, పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్, ఓపీఎస్, డీపీసీ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల మహా గర్జన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరీయేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల భారీగా మోహరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాతన పింఛన్ పథకం (ఓపీఎస్) అమలు చేయాలని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్, భీమా భవన్, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్‌ల వద్ద పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో భోజన

తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తప్పకుండా విమానాశ్రయం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ స్థల పరిశీలనకు రానున్న కేంద్ర సాంకేతిక బృందంఈ మేరకు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రితో భేటీ అయి, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాకపోవడంతో కొత్తగా గుర్తించిన స్థలాల వివరాలు తెలిపారు.నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలుకొత్త స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. వారి నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సాంకేతిక బృందాన్ని పంపించేందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.ఈ ప్రాజెక్ట్ తీర్ధ యాత్రికులకే కాదు ప్రాంత అభివృద్ధికి కీలకం ఈ ప్రాజెక్టు భద్రాచలం తీర్థయాత్రికులు, స్థానిక ప్రజలకు గొప్ప ఉపయోగం చేకూర్చనుంది.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు, వ్యాపారవేత్తలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగై, ఈ ప్రాంత సమగ్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని భావిస్తున్నారు.తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్ర సహకారం తెలంగాణా రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్రం నుండి సహకారం లభిస్తోంది, ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఈ అణచివేత చర్య కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి, నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అత్యంత హేయమని నితిన్ నబీన్ అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసు యంత్రాంగం... బాధితులకు అండగా నిలిచేందుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పే మాటలన్నీ కేవలం ప్రజలను మభ్యపెట్టే నాటకాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై దాడులకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు. రాంచందర్ రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

కష్టకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత చర్యల వల్ల తండ్రి కేసీఆర్ ఎంతటి మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఆలోచించుకోవాలని... తాను ఎప్పుడూ కేసీఆర్-కవితలను కలపడానికే ప్రయత్నించాను తప్ప విడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ వెంటే ఉన్నామని, తాము టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యులమని గుర్తుచేశారు. "బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్" అని పేర్కొన్న ఆయన... కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ లోపలా బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలనని... మరి కాంగ్రెస్‌తో కవిత రహస్య మంతనాలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని నిలదీశారు. కేసీఆర్‌కు అత్యంత ఆప్తులుగా, బలంగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ... పార్టీని బలహీనపరిచి పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కేవలం రాజకీయం కోసం, సానుభూతిని పొందేందుకేనని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీని చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసని, నిన్నటి వరకు ఆమెపై ఉన్న గౌరవాన్ని తన వ్యాఖ్యలతో కవిత స్వయంగా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఫోన్ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడులు, నేతల అరెస్ట్‌లపై ఆరా తీశారు. అదే సమయంలో కాంగ్రెస్ నిరంకుశ విధానంపై పోరాటాన్ని కొనసాగించాలని రాంచందర్‌రావుకు నబిన్ సూచించారు. కాగా, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న(సోమవారం, ఆగస్టు 31వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్‌పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై (వ్యక్తిగత కార్యాలయం) సోమవారం బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నేతృత్వంలో కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మంత్రి ప్లెక్సీకి నిప్పంటించారు. దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో దేవరకొండ రోడ్డు చైతన్యపురికాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు. ‘ ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్

ఉత్తరాంధ్ర ప్రజా సమూహాల దశాబ్దాల కల నెరవేరే సువర్ణ ఘడియలు ఆసన్నమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు మార్గం సుగమమైంది. రేపు పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, పుడమి తల్లిని తడిపే గోదావరి తరంగాలకు జల హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందిన ఈ కాలువ ద్వారా ఉగ్రరూప మెత్తే గోదావరి ప్రవాహం ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి దాహాన్ని తీర్చబోతోంది.తూర్పు కనుమల విసిరిన క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను దాటుకుంటూ, రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైఫన్లు నిర్మించారు.ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో అక్విడెక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా ప్రాజెక్టును వేగవంతం చేశారు.Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!2.87 లక్షల ఎకరాలకు సాగునీరు..ఈ గోదావరి జలాల విడుదలతో నాలుగు జిల్లాల పరిధిలోని 2,87,320 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, 5.23 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా లభించనుంది. మొత్తం 23.44 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ పరిశ్రమలకు, తాగునీటికి, సాగుకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. పాయకరావుపేట అక్విడెక్ట్ ద్వారా విడుదలయ్యే నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువను, అలాగే జిల్లాలోని

Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో.. తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని చెప్పారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు తన చిరకాల మిత్రుడని మంత్రి తుమ్మల గుర్తుచేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని, జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana bjp chief ramchander rao fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న జరిగిన దాడితో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తార్నాకాకు భారీగా చేరుకున్నారు. బీజేపీ నేతలు సైతం అక్కడకు చేరుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకుని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో అక్కడ బీజేపీ కార్యర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు రామ చందర్ రావు ముందుకు వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రామచందర్ రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపు పాలనసాగుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే దాడులు, అడ్డుకొవడాలు ఏంటని మండిపడ్డారు. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హమీలు ఇచ్చి ప్రజలను తీవ్రంగా దగా చేసిందన్నారు. Read more: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇవే! మరోవైపు రానున్న రోజులలో కాంగ్రెస్ కు పతనం తప్పదన్నారు. ఈ ఘటనలో బీజేపీ నేత వర్షిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో తెలంగాణ

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు ( House Arrest) చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్టు ప్రకటించడంతో ఆయన్ను గృహనిర్బంధం చేసినట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాలో నిన్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. నల్గొండలో మంత్రి కోమటి రెడ్డి కార్యాలయం (Komatireddy office) పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయగా, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి (Varshit Reddy) నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు

కోలీవుడ్ లో యోగిబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను పోషిస్తూ కథానాయకుడిగాను కొనసాగుతున్నాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన తమిళ సినిమానే 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'. అముత సారథి దర్శకత్వం వహించిన సినిమా ఇది. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ మరుసటి నెలలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే రీసెంటుగానే తెలుగులో అందుబాటులోకి వచ్చింది.యశోద (సితార) ఒక ఒంటరి మహిళ .. ఆమెకి మాటలు రావు. ఆమెకి పదేళ్ల వయసున్న ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే 'శబరి. అతనికి కూడా మాటలు రావు. అయితే అతనికి మాటలు రావాలనే బలమైన కోరికతో యశోద ఉంటుంది. అయ్యప్పస్వామి మాల వేస్తే మాటలు వస్తాయని కొంతమంది చెప్పడంతో ఆమె శబరికి మాల వేస్తుంది.దీక్ష పూర్తిచేయించి .. ఇరుముడి కట్టించి 'పులిమేడు' సన్నిధానానికి తీసుకొస్తుంది. శబరికి దాహంగా ఉండటంతో, అతనికి మంచినీళ్లు తీసుకురావడానికి యశోద వెళుతుంది. 'సన్నిధానం పోస్టాఫీస్' దగ్గర నిలబడిన అతను, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. శబరి కనిపించకపోవడంతో యశోద కంగారు పడిపోతుంది. తన కొడుకు కోసం కంగారుగా వెదకడం మొదలుపెడుతుంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను స్టేషన్ కి తీసుకు వెళతారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటం వలన ఆ కేసు నుంచి బయటపడటానికి ఆమెకి చాలా కాలం పడుతుంది. యశోద నుంచి తప్పిపోయిన శబరి ఎక్కడికి వెళతాడు? మాటలు రాని అతనిని ఎవరు ఆదరిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? జైలు నుంచి విడుదలైన యశోద తన కొడుకుని కలుసుకోగలుగుతుందా? అయ్యప్పస్వామి ఆ తల్లి కొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేరుస్తాడు? అనేది మిగతా కథ.అయ్యప్పస్వామి మహిమలకు సంబంధించిన

రామచందర్ రావు అరెస్ట్ నల్గొండలో చెలరేగిన దాడులు ముదిరిన కాంగ్రెస్ భాజపా వివాదం Ramchander Rao Arrest: తెలంగాణ రాజకీయాలు నల్గొండ జిల్లా వేదికగా తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు సిద్ధమైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు(Ramchander Rao Arrest)ను పోలీసులు ముందస్తు చర్యగా అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతుండగా, ప్రతిపక్ష గొంతు నొక్కడమేనని భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Gold Silver Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే! కోడిగుడ్ల దాడి - కాంగ్రెస్, భాజపా శ్రేణుల పరస్పర ఘర్షణలు: నల్గొండ పట్టణంలో నిన్న కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై భాజపా శ్రేణులు కోడిగుడ్లతో దాడికి పాల్పడగా, దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భాజపా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగాయి. ఈ పరస్పర దాడులతో నల్గొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులకు పరామర్శకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు: జిల్లా అధ్యక్షుడి ఇంట జరిగిన దాడి ఘటనను పరామర్శించి, బాధితులకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రామచందర్ రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, నిరంకుశంగా ప్రవర్తిస్తోందని భాజపా నేతలు మండిపడుతున్నారు. పరిస్థితులు చేయిదాటకుండా నల్గొండ వ్యాప్తంగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు

మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవుతో నిర్మించగా.. సీఎం నేడు ప్రారంభోత్సవం చేశారు. మూసీ నదిలో లక్షా యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పటిష్ఠంగా దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జితో అంబర్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాలకు ప్రయాణాలు సులభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ , జూబ్లీహిల్స్ ఎంఎల్ ఏ నవీన్ యాదవ్ , ఎంఎల్ ఏ మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ,ప్రభుత్వ ఉన్నతాధికారులు

* విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన * సిరిపురం సర్కిల్ లో దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ * ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్ మన్షిప్’ గా రోశయ్య గారి విగ్రహం నిలవాలని మంత్రి లోకేష్ ఆకాంక్ష * ఆయన రాజకీయ విలువలు, పార్టీలకు అతీతంగా సమాజానికి ఆయన చేసిన సేవ భవిష్యత్ తరాలకు తెలపాలని పిలుపు * విశిష్ట అతిథులుగా హాజరైన రోశయ్య గారి కుటుంబసభ్యులతో మంత్రి లోకేష్ ప్రత్యేక భేటీ * కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఏపీ ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు
'Tiger Nageswara Rao' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.0/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.0/5, GreatAndhra - 2.75/5, Telugu360 - 2.75/5.
'Tiger Nageswara Rao' చిత్రం 7వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹2.5 కోట్ల గ్రాస్ మరియు ₹1.5 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹45.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹70.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రతి రోజూ స్థిరమైన వసూళ్లతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి కారణంగానే ఆ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ప్రసంగించారు.బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని కవిత విమర్శించారు. ఆ పార్టీ హయాంలో నాలుగు ఇళ్లు మాత్రమే బంగారమయ్యాయని ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేకపోయారని దుయ్యబట్టారు.ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రి నుంచి దూరం చేశారని, ఆయనకు తన ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమించినా ప్రశాంత్ రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించనని స్పష్టం చేశారు. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే పుట్టింటి వాళ్లే కుట్ర చేసి తరిమేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.తాను ఏ తప్పూ చేయకపోయినా నాలుగేళ్లుగా ఈడీ, సీబీఐలతో వేధించి తీహార్ జైలులో పెట్టారని కవిత అన్నారు. తాను నిర్దోషినని సుప్రీంకోర్టే చెప్పిందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక సీబీఐ అధికారిపైనే విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పంతం పట్టి పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ప్రతిపక్షంగా

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాల్సిందే సీఎం రేవంత్‌రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయ్ సాక్షి, సిద్దిపేట: ‘22ఏ జాబితాలో చేర్చిన భూము లకు వెంటనే విముక్తి కల్పించాలి..లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. ధరణి కంటే దారు ణంగా భూభారతి మారిందన్నారు. 22ఏలో చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు హాజరై మాట్లాడారు. 22ఏ జాబితా విషయంలో పొరపాట్లు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, వాటిని వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఒక ఫ్యామిలీ.. ఇప్పుడు బ్రదర్స్ బాగుపడు తున్నారన్నారు. సీఎం ఇల్లు ఎలా బయటపడిందో చెప్పాలి జూబ్లీహిల్స్‌లోని 403 సర్వే నంబర్లో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే ప్రభుత్వ భూములని, మిగతా భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చా రని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇదే జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డి నివాసం కూడా ఉందని, ఆ ఇల్లు 22ఏ జాబితా నుంచి ఎలా బయటపడిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయని చెప్పారు. 22ఏలో జరిగిన గందరగోళాన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన దరఖాస్తు చూపించాలి: రఘునందన్‌రావు 22ఏ జాబితాలో ఉన్న తన ఇల్లు తొలగింపు కోసం రేవంత్‌రెడ్డి చేసిన దరఖాస్తును ప్రజలకు చూపించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఎలాంటి దరఖాస్తు లేకుండానే సీఎం ఇల్లు నిషేధిత భూముల్లో నుంచి తొలగించారని ఆరోపించారు. ‘పొట్టోడికి పరిపాలన రాదు.. భూముల లిటికేషన్ పెట్టడం మాత్రం వచ్చు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు