
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Garuda Panchami Or Shravana Panchami: కశ్యప ప్రజాప్రతి భార్యలైన కద్రువ సంతానం నాగులు. వినతల సంతానమే గరుడుడు , అనూరుడు. వీరు ఇద్దరూ శ్రావణ శుద్ధ పంచమి నాడే జన్మించారని పురాణ కథనం. మహావిష్ణువు ఆదిశేషుని భక్తికి మెచ్చి, శ్రావణ పంచమి నాడు మానవులు సర్పాలను, నాగులను పూజిస్తారని వరం ఇచ్చాడు. అందువల్ల ఈ రోజును నాగ పంచమిగా మరియు గరుడ పంచమిగా సమానంగా జరుపుకోవడం ఆనవాయితీ వస్తోంది.
ఈ నాగ / గరుడ పంచమి అనేది భారతదేశం, నేపాల్ సనాతులు నివసించే ఇతర దేశాలలో హిందువులు పాటించే ఒక సాంప్రదాయక సర్ప పూజ. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజైన పంచమి రోజున ఈ పూజను నిర్వహిస్తారు. సర్పాల నివాసం పాతాళ లోకం. ఇది భూమికి దిగువన ఉన్న విశ్వంలోని ఏడు లోకాలని మన ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రస్తావించబడింది. వాటిలో అత్యంత దిగువన ఉన్న దానిని నాగలోకం, అంటే నాగు పాములు నివసించే ప్రాంతం. సృష్టి శక్తిలో భాగంగా, కుటుంబ శ్రేయస్సు కోసం వారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. అర్హతగల పురోహితులచే నాగదేవతకు అభిషేకంతో పాటు పూజ చేయడం వల్ల కుజ దోషంతో పాటు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఇది కుటుంబ శ్రేయస్సును కలిగిస్తుంది.
అష్ఠాదశ పురాణాల ప్రకారం, గరుత్మంతుడు సూర్య రథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం ఉన్నవాడు. సప్త సముద్రాలను ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల బలం గరుత్మంతుడి సొంతం. అందుకే తనకు సువర్ణుడు అనే పేరు కూడా వచ్చింది. గరుడ పంచమి వివరాలు భవిష్యత్తు పురాణంలో ఉన్నాయి.
సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకొచ్చాడు. అందుకోసం ఇంద్రుడితోనే ఏకంగా పోరాటం చేశాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు అందుకుని ఆయన వాహనం అయ్యే భాగ్యం దక్కించుకున్నాడు. అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని విశ్వాసం ఉంది.
గరుడ పంచమి రోజున గరుత్మంతుడు వంటి మాతృ భక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తారు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





