
దాదా : మంచు మనోజ్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
దాదా : మంచు మనోజ్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

దాదా : మంచు మనోజ్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

అప్పుడు మనోజ్ మూవీలో బాలయ్య కేమియో.. ఇప్పుడు దాదా మూవీ కలిసొచ్చేనా?

‘దాదా’ ప్రమోషన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం – గోపీచంద్ మలినేని

కాకా..దాదా..రాకా టైటిల్స్ తోనే దడ పుట్టిస్తున్నారుగా!

పోలీసులు నందన, మధుకర్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. (Youtuber Nandana)

బుల్లెట్స్‌కి బలుపు ఉండాలి: బాలయ్య ‘దాదా’ గ్లింప్స్
క్రిస్మస్ బరిలో దాదా vs కింగ్ 100.. దశాబ్దం తర్వాత నందమూరి – అక్కినేని హీరోల పోరు

బాలకృష్ణ 111వ చిత్రానికి 'దాదా' టైటిల్, రిలీజ్ డేట్ ఖరారు

'దాదా'.. బాలకృష్ణ 111వ చిత్రానికి పవర్ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. (Thrigun)

బాలయ్య సినిమా టైటిల్ ‘దాదా’.. ఒక్క డైలాగ్‌తో ఫ్యాన్స్ ఫిదా..!

దాదా టైటిల్ గ్లింప్స్ టాక్: థియేటర్స్ లో బ్లాస్ట్ ఖాయం.. ఊరమాస్ స్టఫ్ తీసుకొస్తున్న వీర సింహా రెడ్డి కాంబో

Dada : 'దాదా'గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!

మీరు కూడా దాదా గ్లింప్స్ చూసేయండి.. (NBK 111)
NBK111: క్రిస్మస్కి ‘దాదా’గా వస్తోన్న నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్‌కి దబిడి దిబిడే

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ స్వామివారి పాదాల వద్ద రాకెట్ సెప్టెంబర్ 4న జీఎస్ఎల్వీ ప్రయోగం ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్. సోమనాథ్, ఇతర ఉన్నతాధికారులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఇస్రో బృందం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆనంద నిలయంలోకి ప్రవేశించి స్వామివారి సేవలో పాల్గొంది. రాబోయే ముఖ్యమైన రాకెట్ ప్రయోగానికి ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్-05 (GSLV F-17, EOS-05) రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Jai Kottu Logo Launch: జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన.. పవన్ కీలక సందేశం సెప్టెంబర్ 4న జీఎస్ఎల్వీ ఎఫ్-17 ప్రయోగం: దర్శనం అనంతరం ఇస్రో చైర్మన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ద్వారా ఇఓఎస్-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్, తుది ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు.. చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు

Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి! Veenavanka: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం,మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి గ్రామస్తులకు స్వీట్లు పంచినారు. ఈ సందర్భంగా టిపిసిసి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి,పేద ప్రజల ఉన్నతికి వారి జీవితాన్ని అంకితం చేసినారని వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్, నిమ్మల సమ్మన్న ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూలం సమ్మన్నగౌడ్,మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,93 వ బూత్ అధ్యక్షులు పల్లేర్ల కిరణ్,94 వ బూత్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి,9వ వార్డ్ సభ్యులు గంధం ప్రశాంత్,డీలర్ కర్రె వెంకట నర్సయ్య, రాయణవేణి చంద్రయ్య, దూలం కిరణ్,మాజీ వార్డ్ సభ్యులు గోనెల సమ్మయ్య,అర్సం నాగేష్, దూలం వెంకటేష్, కర్రె రాజు, కర్రె కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు

Telangana State Holiday: తెలంగాణలో పాత పెన్షన్ విధానం (OPS) అంశం మరోసారి చర్చకు వచ్చింది. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని CPS ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పాటించాలని CPSEU పిలుపునిచ్చింది. నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సెలవు పాటించాలని కోరింది. ప్రస్తుతం తెలంగాణలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న ఉద్యోగులు తమకు పాత పెన్షన్ విధానం కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే OPSను తిరిగి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో తన ఎన్నికల మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానం అమలుపై హామీ ఇచ్చిందని CPSEU పేర్కొంది. ఆ హామీని గుర్తు చేస్తూ నవంబర్ 17న సామూహిక సెలవు పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ రోజున ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన విషయాన్ని CPSEU ప్రస్తావించింది. అదే విధంగా తెలంగాణలో కూడా CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఉద్యోగుల భవిష్యత్తు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పాత పెన్షన్ విధానం అవసరమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాయి. ఇదే డిమాండ్‌తో ఉద్యోగులు ఇటీవల హైదరాబాద్‌లో మహాధర్నా కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 17న సామూహిక సెలవు పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. OPSపై ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల

షావోమీ 17 అల్ట్రా అధికారిక ధర రూ. 1,39,999 అమెజాన్‌లో ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 10వేలు తగ్గింపు మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత ఆదా Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్. ఇందులో ప్రీమియం హార్డ్‌వేర్, హై-ఎండ్ కెమెరా ఉంది. ధర పరంగా చాలా ఖరీదైనది అయినా ప్రస్తుతం అమెజాన్ అదిరిపోయే డీల్ అందిస్తోంది. తద్వారా అసలు ధర రూ. 10వేల వరకు తగ్గుతుంది. షావోమీ 17 అల్ట్రా కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.. షావోమీ 17 అల్ట్రా డీల్ : షావోమీ 17 అల్ట్రా ఫోన్ అధికారిక ధర రూ. 1,39,999 మాత్రమే. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కొంటే ఎస్బీఐ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో ఈఎంఐ రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. అదనపు తగ్గింపు కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. Read Also : OnePlus 16 : సూపర్ ఫోన్ మావా.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 16 వస్తోంది.. ఫుల్ డిటెయిల్స్! షావోమీ 17 అల్ట్రా స్పెసిఫికేషన్లు : షావోమీ 17 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ షావోమీ ఫోన్ 6,000mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. షావోమీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది.. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.447.80 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరు చేయనున్నాయి. ఈ రూ.2.50 లక్షల్లో.. కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా.. రాష్ట్రం వాటా కింద రూ.లక్ష ఇస్తారు. వీటితో పాటుగా వీబీ జీరామ్‌జీ (ఉపాధి హామీ పథకం) కింద రూ.27వేలు.. అలాగే స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు ఇస్తారు. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.89 లక్షలు అందుతాయి. కేంద్రం పీఎంఏవై-2.0 కింద పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది.. వీటిని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించనుంది.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఈ 17,912 ఇళ్లను జిల్లాల వారీగా కేటాయించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ)ల పరిధిలో 15,793 ఇళ్లు ఉంటే.. పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల పరిధిలోకి మరో 2,119 ఇళ్లు వస్తాయి. ఈ 17,912 ఇళ్లలో అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 కేటాయించారు.. ఆ తర్వాత పల్నాడు జిల్లాకు (1,229), నెల్లూరు జిల్లాకు (1,057), కడప జిల్లాకు (1053) ఇళ్లు కేటాయించారు. రాష్ట్రంలో అత్యల్పంగా 212 ఇళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి జిల్లాల కలెక్టర్లు అనుమతులు ఇస్తారు.PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి కార్పెట్ ఏరియా కనీసం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు నమూనా డిజైన్లను

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ధీటైన అల్లుడి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్లో రామ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ డాక్టర్ గా కనిపించబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టే షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఒకవేళ సంక్రాంతికి వస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే జనవరి 12న విడుదల, చిరు – బాబీ సినిమా, జార్జిక్రిష్ సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఇప్పడు రజనీ సినిమా వస్తే పొంగల్ పోరు జోరుగా ఉంటుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ ఎనర్జీ కలగలిసి రానున్న ఈ మామా-అల్లుళ్ల ఈగో వార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.తాజాగా నర్సాపూర్ నుంచి ట్యుటికోరిన్ (తూత్తుకుడి) ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు సెప్టెంబర్ 7వ తేదీన పట్టాలెక్కనుంది. 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన హాల్ట్ స్టేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు.. మూడో రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12: 20 నిమిషాలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.సెప్టెంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో ప్రతి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్- హాల్ట్ స్టేషన్లుట్యుటిమేలూర్, కోవిల్ పట్టి, సత్తూర్, విరుధునగర్, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై
Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 7 రోజుల వరుస నష్టాల తర్వాత కిందటి రోజు (ఆగస్ట్ 21) భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. ఇవాళ (ఆగస్ట్ 21) మళ్లీ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ ఫ్లాట్‌గా 77,530 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 24230 స్థాయిలో ట్రేడవుతోంది. అయితే మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ప్రముఖ మల్టీనేషనల్ పైపుల తయారీ కంపెనీ షేరు ధర భారీగా పెరిగింది. ఏకంగా 17 శాతానికిపైగా పెరగడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాల్ని అందిస్తోంది.అదే ప్రముఖ పైప్ తయారీ సంస్థ వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆ కంపెనీ చరిత్రలోనే తాజాగా అతిపెద్ద ఆర్డర్ దక్కడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో రూ. 2005.20 వద్ద ముగిసిన ఈ షేరు ధర ఇవాళ నేరుగా 8 శాతానికిపైగా లాభంతో రూ. 2175 వద్ద ఓపెన్ అవగా, తర్వాత ఇంకా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో 17 శాతానికిపైగా పెరిగి రూ. 2348.90 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కూడా కావడం విశేషం.ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 61.31 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 710 గా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ భారీగా పుంజుకుంటూ వస్తోంది. 5 రోజుల్లో ఏకంగా 27 శాతం పెరగ్గా, నెలలోనే 45 శాతం పెరిగింది. గత 6 నెలల వ్యవధిలో చూస్తే ఏకంగా 200 శాతం పెరగడం విశేషం. ఈ క్రమంలో లక్షను రూ. 3 లక్షలు చేసింది. గత ఐదేళ్లలో 2 వేల శాతానికిపైగా పెరిగింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని 20 లక్షలకుపైగా

Eng Vs Pak: ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “పాకిస్థాన్ పరమచెత్త జట్టు. వారిలో ఏమాత్రం టాలెంట్ లేదు. ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో చాలా తేలికగా గెలుచుకుంటుంది” అంటూ వ్యాఖ్యానించాడు. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కేవలం 171 పరుగులకే ఆలౌట్ కావడంతో బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పై సల్మాన్ భట్ ప్రశ్నాస్త్రాలు స్టువర్ట్ బ్రాడ్ చేసిన విమర్శలపై సల్మాన్ భట్ ఘాటుగా స్పందించాడు. తమ జట్టు ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడటం లేదనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అలా అని చెత్త జట్టు అని సంబోధించడం సరైంది కాదని మండిపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు గొప్పలు చెప్పుకోవడం ఆపి తమ సొంత రికార్డులను చూసుకోవాలని సూచించాడు. “మీరు ఆస్ట్రేలియా వెళ్లిన ప్రతిసారీ 0-5 తేడాతో ఘోరంగా ఓడిపోయి వస్తారు. గత 16 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే గెలిచింది” అంటూ ఇంగ్లాండ్ వైఫల్యాలను ఎండగట్టాడు. ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్ ఒకప్పుడు పాకిస్థాన్ బౌలింగ్ విభాగం అత్యంత బలంగా ఉండేదని సల్మాన్ భట్ గుర్తు చేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టులో 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సాధారణ బౌలర్లు ఉన్నారని, అప్పట్లో ఎవరూ ఇంగ్లాండ్‌ను చెత్త జట్టు అని అనలేదని పేర్కొన్నాడు. తమ జట్టు బలహీనంగా ఉన్న మాట వాస్తవమేనని, ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్

Apple iPhone 17 : ఆపిల్ గత ఏడాదిలో భారత మార్కెట్లో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐఫోన్ సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. మీరు ఐఫోన్ 17 కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లతో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 17 డీల్స్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 17 ధర, ఆఫర్లు : 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 80,900గా ఉంది. అయితే, గత ఏడాదిలో రూ. 82,900కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల (Apple iPhone 17) విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 5,955 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 74,955 అవుతుంది. అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 57,250 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఎక్స్ఛేంజ్ డివైజ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే సుమారు రూ. 7,945 తగ్గింపుతో లభిస్తుంది. Read Also : SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్‌డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే? ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ ఐఫోన్ మోడల్ 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ iOS 26పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సై ఫై థ్రిల్లర్ 'కిల్లర్' సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 17న విడుదల అవుతోంది. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. ఇందులో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. 'కిల్లర్' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశపు గొప్ప సైంటిస్ట్ డా.పూర్వజ్ ను ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు. ఒక స్పేస్ షిప్ ను భూమికి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మిగతా వారికీ చెప్పమని, తాము మానవులను రక్షించాలని అనుకుంటున్నట్లు ఆ ఏలియన్ డా.పూర్వజ్ కు చెబుతుంది. మన భవిష్యత్, ఆ ఏలియన్ కు గతం. ఇలా మరో కాలం నుంచి వస్తున్న ఆ ఏలియన్ డా.పూర్వజ్ ను ఎందుకు కాంటాక్ట్ అయ్యింది ? స్పేస్ షిప్ ను భూమికి ఎందుకు పంపించాలనుకుంది ? మానవాళికి ఏర్పడిన ముప్పు ఏంటి ? ఆ ఏలియన్ చేయాలనుకున్న సాయం ఏంటి ? వంటి ప్రశ్నలతో రిలీజ్ డేట్ గ్లింప్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 'కిల్లర్' మూవీని ఓఎంజి పిక్చర్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దీనిని అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. ఇదిలా

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్గా సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ‘ఆర్సీ 17’ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. నాలుగేళ్ళుగా తమ కుటుంబంలో భాగమైన బఘీరాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాక పెట్ డాగ్‌ను ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్ళీ ప్రచారం వేడెక్కింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడంతో దర్శకుడు వశిష్ఠ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయదశమికి ఈ కాంబోలో రానున్న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్ ఆనంద్! Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం Sanjjanaa Galrani: విజయ్.. త్రిష.. సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్!

RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పుష్పా సక్సెస్‌తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్.. ‘RC17’లో హీరోయిన్గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ సినిమాలో కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్ను ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్, సారా అర్జున్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే ‘RC17’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన చేతి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించిన తర్వాత నవంబర్ 2026 నుంచి
పాకిస్థాన్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2026 సిరీస్‌లో భాగంగా హెడింగ్లే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు అతిథ్య జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ నమ్మకాన్ని వారి పేసర్లు వంద శాతం నిలబెట్టారు. గాయం కారణంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ దూరం కావడంతో కొత్త కెప్టెన్ సల్మాన్ అఘా సారథ్యంలో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు మ్యాచ్ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అజాన్ అవైస్ పరుగులేమీ చేయకుండానే ఆలీ రాబిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు.ఆ తర్వాత అబ్దుల్లా షఫీక్ (61; 8 ఫోర్లు), ఇమామ్-ఉల్-హక్ (42; 6 ఫోర్లు) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో పాక్ 97/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా కుప్పకూలే అలవాటు ఉన్న పాక్.. ఈమ్యాచులోనూ అదే ప్రదర్శన చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (5), సౌద్ షకీల్ (5), సల్మాన్ అఘా (21), మహమ్మద్ రిజ్వాన్ (12) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో పాక్ కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ పేసర్ల పక్కా ప్లానింగ్ ముందు పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు.ఇంగ్లాండ్ బౌలర్లలో ఆలీ రాబిన్సన్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, జోష్ టంగ్ 46 పరుగులకే 5 వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచారు. ఫలితంగా పాకిస్థాన్ 48.1 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఎమిలియో గే (33) పర్వాలేదనిపించినా, పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ అలీ క్యాచ్ ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రిజ్‌లోకి వచ్చిన స్టార్ బ్యాటర్ జో రూట్, జోర్డాన్ కాక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ మూడో వికెట్‌కు

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ప్రయాణికుల నుంచి అందుతున్న ఆదరణ నేపథ్యంలో వాటిని రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ గా మార్పు సైతం చేస్తోన్నారు.ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి. తాజాగా మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్దీకరించారు. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి రానుంది. తెలంగాణ, ఏపీ నుంచి తిరుపతికి వెళ్లే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07607 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు తిరుచానూర్ కు చేరుకుంటుంది.ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూర్ నుంచి బయలుదేరే నంబర్ 07608 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.మొత్తం 20 బోగీలతో కూడిన రైలు ఇది. వీటిల్లో 2ఏ- 2, 3ఏ- 8, స్లీపర్- 6, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు- 4 ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే 'పెద్ది' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చేతికి సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న RC 17 ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు చరణ్. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆర్ సీ 17లో మొదట కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. చాలా రోజుల క్రితమే ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గతంలో రామ్ చరణ్, కియారా కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' ల్లో వీరు హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సుక్కూ సినిమాలో కియారాను హీరోయిన్ గా తీసుకున్నారని తెలియగానే మెగాభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. ఆర్ సీ 17 కియారా స్థానంలో మరో హీరోయిన్ని పరిశీలిస్తోందట చిత్ర బృందం. ప్రస్తుతం ఈ రేసులో ధురంధర్ సినిమాల హీరోయిన్ సారా అర్జున్ పేరు మొదట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో సారానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో

పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తోన్న చిత్రం RC17. రంగస్థలం తరువాత చరణ్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేస్తోన్న చిత్రం RC17. రంగస్థలం తరువాత చరణ్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చరణ్.. సర్జరీ తరువాత రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇంకోపక్క సుకుమార్.. RC17 స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. మొదటి నుంచి ఈ సినిమాలో కథానాయికగా మొదట బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పటికే చరణ్ - కియారా రెండు సినిమాల్లో జంటగా కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక ముచ్చటగా మూడోసారి ఈ జంట RC17లో కనిపిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రేసులోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుని ధురంధర్ చిత్రంలో యలీనా పాత్రతో మెప్పించిన సారా అర్జున్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కియారా అద్వానీ స్థానంలో సారా అర్జున్ను కథానాయికగా తీసుకుంటే రామ్ చరణ్ సరసన ఒక సరికొత్త ఫైరీ కాంబినేషన్ కుదురుతుందని సుకుమార్, ఆయన టీమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా విక్రమ్ నాన్న వంటి చిత్రాలలో మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు కథానాయికగా ప్రమోషన్ పొంది రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేయడం నిజంగా పెద్ద మైలురాయనే చెప్పాలి. ఇందులో నిజమెంత

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. అర్జున అవార్డుల జాబితాలో అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి గోపిచంద్ తదితరులు చోటు దక్కించుకున్నారు. అర్జున అవార్డు గ్రహీతలు వీరే.. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి. బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్ పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్ హాకీ: లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ కబడ్డీ: సుర్జీత్, పూజ పారా-షూటింగ్: రుద్రాంశ్ ఖండేల్వాల్ పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్ రోయింగ్: అరవింద్ సింగ్ షూటింగ్: అఖిల్ షియోరాన్ లైఫ్‌టైమ్ అర్జున అవార్డు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడైన మాజీ ఆటగాడు ఐ. అరుమైనాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) దక్కింది. ద్రోణాచార్య అవార్డులు ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీలో పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్‌కుమార్ చవాన్ (షూటింగ్) ఎంపికయ్యారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్‌కు ప్రకటించారు. ఆగస్టు 29 సంప్రదాయానికి బ్రేక్ సాధారణంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఆగస్టు 29న జరుగుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే కరోనా తర్వాత ఈ సంప్రదాయంలో మార్పులు వచ్చాయి. క్రీడా క్యాలెండర్‌కు అనుగుణంగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2025లోనూ పురస్కారాల

రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలులో గత ప్రభుత్వం విఫలం: తుమ్మల హైదరాబాద్: రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ అమలు తీరు దారుణంగా సాగిందని, ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరించినా.. రైతులు మాత్రం గుర్తుపెట్టుకున్నారని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉందని, అయినప్పటికీ రూ. లక్ష వరకు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా.. వాయిదాల్లో నాలుగు సంవత్సరాల పాటు చెల్లించడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల వడ్డీ భారం పడిందని అన్నారు. 2018లోనూ రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని నమ్మించి, చివరకు సగం మందికే అమలు చేసి.. రూ. 8,379 కోట్లు పూర్తిగా ఎగవేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు వారిపై కపటప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ఒకేసారి రూ. 20,617కోట్లు మాఫీ చేసి.. 25,35,964 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిందని తుమ్మల స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో రూ. 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటిని మాఫీ చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నామని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు ఉన్న పంట రుణ బాకీలు అత్యల్పమని పార్లమెంట్లో కేంద్ర నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

క్రికెట్‌ను సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకొచ్చే బంతి శరీరంలోని కీలక భాగాలకు తగిలితే ప్రాణాంతకంగా మారొచ్చు. చారిత్రక రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్ ఆడుతూ బంతి తాకిడితో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక చారిత్రక అధ్యయనం ప్రకారం 1858 నుంచి 2016 మధ్య మొత్తం 174 క్రికెట్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఫిలిప్ హ్యూస్.. ప్రపంచాన్ని కుదిపేసిన విషాదం క్రికెట్ బంతి తాకిడితో జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ అతని మెడ భాగంలో బలంగా తగిలింది. వెన్నుపూస సమీపంలోని రక్తనాళానికి తీవ్రమైన గాయం కావడంతో హ్యూస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత మరణించాడు. ఈ ఘటన తర్వాత బ్యాటర్ల భద్రతపై క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా హెల్మెట్ల డిజైన్, మెడ రక్షణకు సంబంధించిన పరికరాలపై మరింత దృష్టి పెట్టారు. రమణ్ లాంబా.. ఫీల్డింగ్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు ఫిబ్రవరి 23, 1998న భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయస్సులో టీమిండియా కీలక ఆటగాడు రామన్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్‌లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్లో ఉన్న లాంబాకు తాకి


గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 3, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంకపై భారత్ ఇంకా 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 460/9 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. నిషాన్ ఫెర్నాండో(0), లాహీరు ఉదారా(27), దినేశ్ చండిమాల్(4), కమిందు మెండిస్(14), ధనంజయ డిసెల్వా(21) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను సోనాల్ దినుశా, డిక్వెల్లా గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేశారా నువాంత(2), ప్రభాత్ జయసూర్య(10), లాహిరు కుమార(10) వరుసగా ఔటయ్యారు. గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే? శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CPS Abolition: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అవుతోంది. ప్రభుత్వ సర్వీసులో దశాబ్దాల తరబడి పని చేసిన వారికి గుర్తింపు లేకుండా పోతుందని ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రభుత్వ టీచర్లు వాపోతున్నారు. కొత్త పెన్షన్ విధానం వల్ల పదవీ విరమణ జీవితానికి గ్యారంటీ లేకుండా పోయిందని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం ఆవేదన చెందుతోంది. తమకు సామాజిక, ఆర్థిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా సీపీఎస్ అమలులోకి వచ్చిన సెప్టెంబర్ 1వ తేదీని 'పెన్షన్ విద్రోహ దినం'గా పరిగణిస్తూ, ఆ రోజు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ "మహాధర్నా" చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాయి. ప్రస్తుత సీపీఎస్ విధానం ఉపాధ్యాయులు, ఉద్యోగుల భవిష్యత్తును తీవ్ర అభద్రతలోకి నెట్టివేసిందని సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కష్టపడి సంపాదించే వేతనం నుంచి కట్ చేసే నిధులను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ అయ్యాక వచ్చే అరకొర పెన్షన్‌తో కాలం వెళ్లదీయడం నానా అవస్థలతో కూడుకున్న పని అని, అందుకే ఎలాంటి మార్కెట్ రిస్క్ లేని పాత పెన్షన్ విధానమే తమకు ఏకైక ఆధారమని ఉపాధ్యాయులు గట్టిగా నిలదీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపాధ్యాయ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా ఆ

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది
మా అమ్మ.. రోహిణిని రోస్ట్ చేస్తోంది.. అని బాలు ఇంకో ఇంగ్లీష్ పదాన్ని వాడతాడు. రోస్టా? అంటే ఏంటి? అండి అని మీనా అడుగుతుంది. రోస్ట్ అంటే కాల్చుకుని తినడం.. ఈ రోజే ఈ పదాన్ని నేర్చుకుని పార్లరమ్మ పుణ్యమా? అని ఈ రోజే ఆ పదాన్ని వాడేశా అని బాలు అంటాడు. రోహిణి విషయంలో అత్తయ్య గారు ఓవర్ చేస్తున్నారనిపిస్తోంది అని మీనా అంటుంది. పార్లరమ్మ మాత్రం ఏమైనా తక్కువ చేసిందా? ఎన్ని మోసాలు చేసింది అని బాలు అంటాడు. అయినా శిక్షిస్తున్నట్టు లేదు.. కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉంది అని మీనా అంటుంది. హారతి కర్పూరం ఆర్పేసి మరీ చెప్పింది కదా.. ఆ మాటకు అయినా గౌరవం ఇచ్చి వదిలేయాల్సింది కదా అని మీనా అంటుంది. నాకు డౌటే.. ఇంకా ఎన్ని దాచి పెడుతుందో.. ఇంకా ఎన్ని చేస్తుందో.. చేస్తుందో బాలు అంటాడు. ఆ టైంలోనే విద్య ఫోన్ రావడంతో మీనా లిఫ్ట్ చేస్తుంది. ప్రేమ ప్రపోజల్ గురించి చెబుతుంది. నెక్ట్స్ ఏం చేయాలని సలహా అడుగుతుంది. ఇంకేముంది పెళ్లి చేసుకోండి.. నిజాయితీగా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది.. అని సలహా ఇస్తుంది. సరే త్వరలోనే గుడ్ న్యూస్‌తో ఫోన్ చేస్తాను అని విద్య అంటుంది.నేను మాత్రం ఇవ్వకూడదు.. నువ్వు మాత్రం లవ్ గురులా సలహాలు ఇవ్వొచ్చు.. నేను మాత్రం ఇవ్వకూడదు.. పైగా నువ్వు ఆ పార్లరమ్మ ఫ్రెండ్ విద్యకు ఇస్తున్నావ్ అని మీనాతో బాలు అంటాడు. విద్య మంచిది.. ఫ్రెండ్ కోసం అలా మన దగ్గర కూడా విషయాన్ని దాచి పెట్టింది అంట.. అని మీనా చెబుతుంది. మీరు ఆ మురళీకి సలహాలు ఇస్తే ఏం జరిగిందో చూశారు కదా అని మీనా అంటుంది. అది అప్పుడు అని బాలు కవర్ చేస్తాడు. నేను హర్ట్ అయ్యాను అని బాలు అంటే.. మిమ్మల్ని కూల్ చేయాలా? అని చక్కిలిగింతలు పెడుతుంది మీనా.మన
నారాయణ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదా? అని పంతులు అడుగుతారు. రావడానికి ఎవరున్నారు అని తాయారు ఎగతాళి చేస్తుంది. అంతకు ముందే రుద్రాంబిక అమ్మవారి వద్ద తన బాధను చెప్పుకుంటుంది మహా. నేను ఆ ఇంటి కోడలిని కాదు..నేను చక్రిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు.. నీకు కూడా బంధాలే కావాలా? అమ్మా.. పెద్ది కోసం నేను ఇది చేయాలని అనుకుంటున్నా.. అని మహా అంటుంది. ఆ టైంకి గుడిలోని గంట మోగుతుంది. అదే అమ్మ వారి అంగీకారం అని మహా అనుకుంటంది. నిప్పుల చట్టీతో మహా వస్తుంది. అటు చూడండి అని మనీషా అంటుంది. అలా గాయత్రి, మహా ఇద్దరూ నిప్పుల చట్టీతో వస్తుంటారు. దీంతో నారాయణ సంబర పడతాడు. విజిల్స్ వేస్తాడు. ఇక ఎండలో అలా మహాలక్ష్మీ చెప్పులు లేకుండా నిప్పుల చట్టీతో నడుస్తుండటంతో చక్రి చూడలేకపోతాడు. బిందెతో నీళ్లు తీసుకు వచ్చి దారి అంతా కూడా తడుపుతూ ఉంటాడు. అలా కాసేపు సేవ చేస్తాడు చక్రి. చివరకు మహా, గాయత్రి ఇద్దరూ కూడా మూడు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అలా పూజా కూడా చివరకు పూర్తవుతుంది.శైలుకి డౌట్.. ఆటోలోంచి దిగేటప్పుడు.. దిగమ్మా.. రామ్మా అని అంటుంది శైలు. ఆరోగ్యం బాగానే ఉందా? నీకు ఏమైంది? అని శైలు అడుగుతుంది. నాకేం అవుతుందే అని వరాలు అంటుంది. ఎప్పుడూ కాళ్లు విరిచేస్తా.. చేతులు విరిచేస్తా.. చంపేస్తా అని నన్ను కొడుతూనే ఉంటావ్.. ఇప్పుడు పదమ్మా.. రామ్మా అని ప్రేమగా అంటున్నావ్.. అంటే ఏదో తేడా కొడుతోంది.. ఏదో చేస్తున్నారు.. చెప్పండి.. ఏం చేస్తున్నారు అని శైలు అడుగుతుంది. మేం ఏం చేస్తామే.. హోమం చేయడానికి వచ్చాం అని చెప్పాను కదా అని శైలుతో వరాలు అంటుంది.నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది.. లేదు.. మీరు అబద్దం చెబుతున్నారు.. ఏ గుడికి వెళ్లినా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.. కానీ ఇక్కడ నాకు

Flipkart Freedom Sale : కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఐఫోన్ 17 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900 ఉండగాప్రస్తుతం రూ.6వేలు తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఐఫోన్ 17 మోడల్ మరింత చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 డిస్కౌంట్ : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై రూ.6వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు రూ.77వేలకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5,750 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మొత్తంగా రూ.11,750 వరకు తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఐఫోన్ కేవలం రూ.71,250కే లభిస్తుంది. ఈ ఐఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే అందబాటులో ఉంది. Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్‌మి P4s వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..! ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఆపిల్ A19 ప్రాసెసర్‌తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, USB-C పోర్ట్ ఉన్నాయి

Nagula Panchami Holiday:ఆగస్టు 17న నాగుల పంచమి జరగనుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇది అందరికీ అధికారిక సెలవు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు సాధారణంగానే కొనసాగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం స్థానిక సంప్రదాయాల కారణంగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నాగుల పంచమి పండగకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఏడాది నాగుల పంచమి ఆగస్టు 17న, సోమవారం జరుపుకోనున్నారు. దీంతో ఈ రోజున పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుందా అనే సందేహం చాలామందిలో ఉంది ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగస్టు 17న హాలిడే ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అధికారిక సెలవుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టత వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2026 అధికారిక సెలవుల జాబితాలో ఆగస్టు 17న నాగుల పంచమిని సాధారణ సెలవుగా ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక క్యాలెండర్లో ఆగస్టు నెలలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 26 ఈద్ మిలాద్, ఆగస్టు 28 రక్షా బంధన్/వరలక్ష్మీ వ్రతం వంటి సెలవులు ఉన్నాయి. ఆగస్టు 17 మాత్రం సాధారణ సెలవుల జాబితాలో లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 2026 సాధారణ సెలవుల ప్రకటనలో కూడా ఆగస్టు 17ను సాధారణ సెలవుగా పేర్కొనలేదు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ అధికారిక సెలవు కాదు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాలు, విద్యాసంస్థల నిర్ణయాల కారణంగా సెలవు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగుల పంచమిని ప్రత్యేకంగా జరుపుకునే సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు తమ విద్యార్థులకు సెలవు ఇవ్వవచ్చు. అందువల్ల మీ పాఠశాల లేదా కాలేజీ నుంచి వచ్చిన అధికారిక మెసేజ్‌ను ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. హిందూ సంప్రదాయంలో పాములకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడి మెడలో నాగుపాము కనిపిస్తుంది. అలాగే విష్ణుమూర్తికి ఆదిశేషుడు