నారాయణ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదా? అని పంతులు అడుగుతారు. రావడానికి ఎవరున్నారు అని తాయారు ఎగతాళి చేస్తుంది. అంతకు ముందే రుద్రాంబిక అమ్మవారి వద్ద తన బాధను చెప్పుకుంటుంది మహా. నేను ఆ ఇంటి కోడలిని కాదు..నేను చక్రిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు.. నీకు కూడా బంధాలే కావాలా? అమ్మా.. పెద్ది కోసం నేను ఇది చేయాలని అనుకుంటున్నా.. అని మహా అంటుంది. ఆ టైంకి గుడిలోని గంట మోగుతుంది. అదే అమ్మ వారి అంగీకారం అని మహా అనుకుంటంది. నిప్పుల చట్టీతో మహా వస్తుంది. అటు చూడండి అని మనీషా అంటుంది. అలా గాయత్రి, మహా ఇద్దరూ నిప్పుల చట్టీతో వస్తుంటారు. దీంతో నారాయణ సంబర పడతాడు. విజిల్స్ వేస్తాడు. ఇక ఎండలో అలా మహాలక్ష్మీ చెప్పులు లేకుండా నిప్పుల చట్టీతో నడుస్తుండటంతో చక్రి చూడలేకపోతాడు. బిందెతో నీళ్లు తీసుకు వచ్చి దారి అంతా కూడా తడుపుతూ ఉంటాడు. అలా కాసేపు సేవ చేస్తాడు చక్రి. చివరకు మహా, గాయత్రి ఇద్దరూ కూడా మూడు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అలా పూజా కూడా చివరకు పూర్తవుతుంది.శైలుకి డౌట్.. ఆటోలోంచి దిగేటప్పుడు.. దిగమ్మా.. రామ్మా అని అంటుంది శైలు. ఆరోగ్యం బాగానే ఉందా? నీకు ఏమైంది? అని శైలు అడుగుతుంది. నాకేం అవుతుందే అని వరాలు అంటుంది. ఎప్పుడూ కాళ్లు విరిచేస్తా.. చేతులు విరిచేస్తా.. చంపేస్తా అని నన్ను కొడుతూనే ఉంటావ్.. ఇప్పుడు పదమ్మా.. రామ్మా అని ప్రేమగా అంటున్నావ్.. అంటే ఏదో తేడా కొడుతోంది.. ఏదో చేస్తున్నారు.. చెప్పండి.. ఏం చేస్తున్నారు అని శైలు అడుగుతుంది. మేం ఏం చేస్తామే.. హోమం చేయడానికి వచ్చాం అని చెప్పాను కదా అని శైలుతో వరాలు అంటుంది.నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది.. లేదు.. మీరు అబద్దం చెబుతున్నారు.. ఏ గుడికి వెళ్లినా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.. కానీ ఇక్కడ నాకు