ఇంట్లో విషయాలు నీకు ఎంటర్టైనింగ్గా ఉన్నాయా? శ్రుతికి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. పెళ్లి అని చెప్పడంతో.. పెళ్లి చేసుకోవే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని శ్రుతి అంటుంది. అది సరే గానీ మేకప్ గురించి మాట్లాడతా అన్నావ్ ఓకేనా? అని ఆ ఫ్రెండ్ అడుగుతుంది. దాదాపు కన్ఫామ్ చేసుకో.. అడిగి చెప్తా అని శ్రుతి అంటుంది. మన ఇంట్లో విషయాలు నీకు ఎంటర్టైనింగ్గా ఉన్నాయా? అని రవి అడుగుతుంది. అక్కడ రోహిణి వదిన ఏడుస్తూ ఉంటే నీకు ఇలా ఉందా? అని రవి అంటాడు. అవును అని అంటుంది శ్రుతి. మేం కో సిస్టర్స్, మాతో అన్నీ పంచుకోవాలి.. అబద్దాలు చెప్పకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని శ్రుతి అంటుంది.ఎవ్వరి మాట వినరు.. ఇప్పుడు నేను ఈ మేకప్ విషయం రోహిణికి చెప్పాలా? ఆంటీ ఏమైనా అంటుందా? అని శ్రుతి అడుగుతుంది. రోహిణి వదిన ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు అని రవి అంటాడు. ఏమైనా దొంగతనం చేస్తున్నామా? అందరి ముందే చెప్తా.. వెళ్తే వెళ్తుంది. లేదంటే లేదు అని శ్రుతి అంటుంది. అలాంటప్పుడు నన్ను సలహా అడగడం ఎందుకు? మా బాలు అన్నయ్య, నువ్వు.. ఎవ్వరి మాట వినరు.. మీరు అనుకున్నదే చేస్తారు కదా అని అంటాడు రవి. అవును అని శ్రుతి నవ్వేసి వెళ్లిపోతుంది. హాల్లో ఫోన్ చూస్తూ కూర్చుంటాడు బాలు. తీరిగ్గా వచ్చి ప్రభావతి అందరినీ గెలుకుతుంది.ప్రభావతికి కౌంటర్లు.. ఏం చేస్తున్నావ్ రా అని బాలుని అడిగితే.. మటన్ కొడుతున్నా అని అంటాడు బాలు. ఏయ్ మీనా ఏం చేస్తున్నావే అని ప్రభావతి అడిగితే.. మలేషియా సినిమాలు చూస్తున్నా అని మీనా కౌంటర్ వేస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి అని సత్యంను ప్రభావతి అడుగుతుంది. మలేషియా జైలు నుంచి పోలీసులు ఇప్పుడే రిలీజ్ చేశారు అని సత్యం కౌంటర్లు వేస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నార్రా అని రవి, శ్రుతిలను ప్రభావతి అడుగుతుంది. పార్కు నుంచి, గుడి మెట్ల కాడ అడుక్కుతిని అని ఇద్దరూ సమాధానం చెప్తారు. మీ అందరికీ ఏమైంది.. నన్ను వెర్రిదాన్ని చేస్తున్నారా? అని ప్రభావతి అంటుంది.. దానికి పార్లరమ్మ ఉంది కదా? అని బాలు మళ్లీ కౌంటర్లు వేస్తాడు..ఎంత చక్కగా కూస్తున్నావే.. కోయిలలా.. అందరూ ఒకే చోట ఉన్నారు కదా అని రోహిణి అని పిలుస్తుంది శ్రుతి. ఇప్పుడు అది ఎందుకు అని ప్రభావతి అడుగుతుంది. మిమ్మల్ని పిలిచానా? మీరు పేరు రోహిణియా? మీకు ఎందుకు అని శ్రుతి అంటుంది. రేయ్ నీ పెళ్లాం నోరుని కంట్రోల్లో పెట్టుకోమను రా అని రవికి చెబుతుంది ప్రభావతి. అది మేమంతా నీకు చెప్తాం కదా అమ్మా అని రవి అంటాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి అత్యయ్య గారు పిలిచారు అని ఏమీ తెలియని నంగనాచీలా అడుగుతుంది రోహిణి. ఆహా.. ఎంత చక్కగా కూస్తున్నావే.. కోయిలలా.. నిన్ను నేను పిలవలేదు.. అని ప్రభావతి అంటుంది. నేనే పిలిచాను అని శ్రుతి చెబుతుంది.అత్తయ్య వెళ్లమంటే వెళ్తాను మా ఫ్రెండ్ పెళ్లి.. మేకప్ చేయడానికి వెళ్తావా? అని రోహిణిని శ్రుతి అడుగుతుంది. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావ్.. బయటకు వెళ్లలేక.. గదిలోనే ఉంటూ చేసిన మోసాలు లెక్క పెట్టి శేష జీవితాన్ని గడుతుపున్న పార్లరమ్మకి ఏం తోచడం లేదు అని బాలు అంటాడు. అత్తయ్య వెళ్లమంటే వెళ్తాను అని నటిస్తుంది రోహిణి. ఏం నటిస్తున్నావే.. నంగనాచిలా.. నా దగ్గరా నీ నాటకాలు అని అంటుంది ప్రభావతి. నువ్వు తనను పని చేయొద్దని చెప్పావా? అని సత్యం అడుగుతాడు. ఫర్నీచర్ షాప్‌లో మాత్రం అడుగు పెట్టొద్దని చెప్పా అని ప్రభావతి అంటుంది. ఆ మేక మామ వల్ల నీకు జ్ఞానోదయం ఇది అన్యాయం అని మీనా అంటుంది. నీకు తెలీదు.. అది మన గోదారిని మలేషియాకి అమ్మేస్తుంది.. నువ్వు మూరెడు పూలు అల్లే సరికి దేశాన్ని అమ్మేస్తుంది అని ప్రభావతి అంటుంది. అబ్బ ఆ మేక మామ వల్ల నీకు జ్ఞానోదయం అయింది.. జ్ఞానావతివి అయ్యావ్ కదా అమ్మా అని అంటాడు బాలు. మీరు మధ్యలోకి రాకండి.. మీ వల్లే ఇదంతా అని రోహిణి అంటుంది. చేయాల్సినవన్నీ చేసి.. ఇప్పుడు మా మీద పడి ఏడ్వడం ఎందుకు అని మీనా అంటుంది. అంత మీ వల్లే కదా.. అని రోహిణి, మనోజ్ అంటారు. భ్రమలో ఉన్నప్పుడైనా బాగున్నాం అని మనోజ్ అంటాడు.ఎలుకొచ్చి.. ఏనుగుకి నడక నేర్పించాల్సిన అవసరం లేదు అంటే ఏంట్రా.. మోసం చేయడం తప్పు కాదు కానీ.. నిజాల్ని బయట పెట్టడం తప్పు అంటావా? అని మనోజ్ మీద సత్యం ఫైర్ అవుతాడు. ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదురా అని రవి కూడా తిడతాడు. దీంతో మనోజ్ షాక్ అవుతాడు. దీన్ని ఫర్నీచర్ షాప్‌లో అడుగు పెట్టనిస్తే.. బీరువాకి, సోఫా సెట్లకు పిల్లలు ఏమీ పుట్టరు.. పైగా మనోజ్‌కి నేనే షాప్ పెట్టించాను అని చెప్పుకు తిరుగుతుంది.. ఎలుకొచ్చి.. ఏనుగుకి నడక నేర్పించాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. అయితే మేకప్ చేసుకోడానికి పంపించొచ్చు.. అలా పంపించకపోవడం అన్యాయం అవుతుందని సత్యం, రవి అంతా అంటారు.రోహిణి పిలక మా అమ్మ చేతిలో ఇదంతా కాదు.. నువ్వు వెళ్తావా? వెళ్లవా? అని శ్రుతి అడుగుతుంది. దీన్ని కూడా చెడగొట్టేందుకు బాలు రెడీగా ఉన్నాడు కదా అని రోహిణి అంటుంది. వాడ్ని ఎందుకు అంటున్నావే.. నువ్వు ఇంత చేసినా కూడా బాలు, మీనా, శ్రుతి, రవి నీకు సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారు కదా అని ప్రభావతి అంటుంది. ఫర్నీచర్ షాప్‌కి మాత్రం వెళ్లొద్దు.. అని ప్రభావతి అంటుంది. దీంతో థాంక్స్ అత్తయ్య అని రోహిణి సంబర పడుతుంది. నాకు కాకుండా ఆంటీకి థాంక్స్ చెబుతోంది ఏంటి అని శ్రుతి అంటుంది. ఇప్పుడు రోహిణి పిలక మా అమ్మ చేతిలో ఉంది కాబట్టి అని బాలు అంటాడు. నీ భార్య బయటకు వెళ్లిన తర్వాత నువ్వు రూంలోకి వెళ్లు అని మనోజ్‌కి చెబుతుంది ప్రభావతి.ఓ కోడలు వస్తే.. సాయం చేస్తుంది.. ఇక ఇంకో వైపు అరుణ్ ఇంటికి సుమతి వెళ్తుంది. రాజేశ్వరి యోగక్షేమాలు అడుగుతుంది. ఇంట్లో చాలా పని ఉందమ్మా అని రాజేశ్వరి అంటే ఆ పనులు తర్వాత చేసుకోవచ్చు కదా అని సుమతి అంటుంది. ఓ కోడలు వస్తే.. సాయం చేస్తుంది.. వీడేమో పెళ్లి అంటే.. అమ్మాయి ఓకే చెప్పాలని అంటాడు.. ఆ అమ్మాయి ఎవరో చెప్పడు.. నువ్వైనా కాస్త నచ్చ జెప్పమ్మా అని రాజేశ్వరి పక్కకి వెళ్తుంది. ఇక సుమతి, అరుణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంటికి ఎప్పుడు వస్తావ్ మరి అని అరుణ్ అంటాడు. ఇంకాస్త టైం కావాలి.. ఇంట్లో వాళ్లని ఒప్పించాలి కదా అని సుమతి అంటుంది. అంతలో ఎపిసోడ్ పూర్తవుతుంది.