Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
13 Year Old AI App Developer Zhu Shuhan : సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే విపరీతమైన కోడింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, మంచి ఆలోచన ఉంటే కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని. చైనాకు చెందిన ఝూ షుహాన్ అనే 13 ఏళ్ల చిన్నారి ఒక్క లైన్ కోడింగ్ కూడా రాయకుండానే ఒక వినూత్నమైన ఏఐ స్టడీ అసిస్టెంట్ యాప్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన ఆలోచనతో తయారుచేసిన ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 18,000 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.5 లక్షలకు పైగా) అర్జించి సంచలనం సృష్టించింది.'వర్చువల్ పేరెంట్' యాప్ వెనుక అసలు కథ ఇదే..!ఝూ షుహాన్ రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్‌కు 'జై చాంగ్' అని నామకరణం చేసింది. ఇంగ్లీష్‌లోకి దాన్ని అనువదిస్తే 'ఆన్ సైట్' అంటే అందుబాటులో ఉండటం అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో వారిపై నిఘా ఉంచడాన్ని, పర్యవేక్షించడాన్ని సులభతరం చేసేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు తమ ఫోటోను అప్లోడ్ చేసిన వెంటనే.. ఈ యాప్ ఒక 'వర్చువల్ పేరెంట్' లేదా 'డిజిటల్ పేరెంట్ క్లోన్' రూపంలో మారి బాధ్యతలు స్వీకరిస్తుంది.విద్యార్థి తన చదువును పక్కన పెట్టి మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటున్నా లేదా తను కేటాయించిన స్థానాన్ని వదిలి పక్కకు వెళ్లినా.. కెమెరా సాంకేతికత ద్వారా పసిగట్టి తక్షణమే తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది. "నా తల్లిదండ్రులు నిరంతరం ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల నేను చదువుకునే సమయంలో నా పక్కన ఉండేందుకు సమయం దొరికేది కాదు. దాంతో హోమ్‌వర్క్ చేసే సమయంలో దారితప్పి రహస్యంగా ఫోన్ వాడేదాన్ని. నా తోటి విద్యార్థుల్లో చాలామంది స్వయం క్రమశిక్షణ లేక ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. స్పోర్ట్స్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'ముత్యాలమ్మ' (IND-AP-E8-MO-135) బోటులో ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని పారాదీప్ తీరం వద్ద ఒక పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా పంపించామని, సరిహద్దు తీరప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నెల 24 తర్వాత కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ గాలింపు చర్యలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి రక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా `కొరియన్ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్‌కు చెందిన వామికా అనే యువతి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది. వామికా ఎప్పటిలాగే వేడి నీటి స్నానం చేసింది. అయితే, స్నానం చేస్తున్నపుడు బాత్రూములోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆమె ఆఫ్ చేసింది. దీంతో వేడి నీటి కారణంగా ఏర్పడ్డ ఆవిరి బాత్రూము నుంచి బయటకు వెళ్లింది. బయట ఉన్న స్మోక్ డిటెక్టర్‌ను ఆవిరి కప్పేసింది. ఆవిరిని పొగగా భావించిన ఫైర్ అలారం ఒక్కసారిగా మోగటం మొదలెట్టింది. పోలీసులు ఫైర్ ఇంజిన్‌తో సహా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సూచనలు లేకపోవటంతో.. యువతిని ఎంక్వైరీ చేశారు. ‘నాకు ఏమీ తెలీదు. అలారం మోగుతుంటే ఫైర్ డ్రిల్ అనుకున్నాను’ అని యువతి అధికారులతో చెప్పింది. అయితే, ఫైర్ అలారం మోగటానికి కారణమైనందుకు గాను యువతికి అధికారులు 1800 డాలర్ల ఫైన్( ట్యాక్స్‌లు అదనం) వేశారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 1.30 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తనకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాన్ని యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. 1800 డాలర్ల ఫైన్ పడినందుకు కంటతడి పెట్టుకుంది. యువతి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భారతీయులు విదేశాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తనకు కూడా ఫైర్ అలారం కారణంగా 1800 డాలర్ల ఫైన్ పడిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్.. అర్హులైన ఓటరు మిగలకూడదు

తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్: మారుతున్న సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాలకు చెందిన 513 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. బదిలీ అయిన 513 మందిలో 5 మంది సీఐలు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు ఉన్నారు. వీరితో పాటు 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ తెలిపారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. కొత్త బాధ్యతలు చేపట్టే ముందు సిబ్బందిని రెండు నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్మెంట్ ద్వారా పనిచేయించనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, సామర్థ్యం ఆధారంగా తుది బాధ్యతలను నిర్ణయించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో నాలుగు రైల్వే బహుళ మార్గాల ప్రాజెక్టులు కాగా, మరొకటి బిహార్‌లో రహదారి ప్రాజెక్టు (Union Cabinet Decisions). కేంద్ర కేబినెట్ ఆమోదించిన నాలుగు రైల్వే ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు రూ.9,450 కోట్లు. ఇవి నాలుగు రాష్ట్రాల్లో రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించినవి. ముఖ్యంగా గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,229 కోట్లతో గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఖరగ్‌పూర్-భద్రక్ 4వ లైన్‌కు రూ.3,352 కోట్లు, భద్రక్-హరిదాస్పూర్ 4వ లైన్‌కు రూ.1,583 కోట్లు, కటక్-పారాదీప్ 3, 4వ లైన్లకు రూ.2,286 కోట్లు కేటాయించారు (Rs.13,041 Crore Projects). ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది (NH-22 Bihar Cabinet Approval). మొత్తం మీద సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు కూడా మరింత సులభతరం కానున్నాయి. అలాగే బిహార్‌లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్బర్సా హైవే నిర్మాణానికి కూడా కాబినెట్ నుంచి ఆమోదం లభించింది. నాలుగు లైన్లతో నిర్మించే ఈ హైవేకు రూ.3,591 కోట్లు కేటాయించారు. ఈ రహదారి బిహార్ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంతో పాటు నేపాల్ సరిహద్దు వైపు రవాణా సౌకర్యాలను బలోపేతం చేయనుంది
Defective Notice ITR: 2025-26 ఆర్థిక సంవత్సరం లేదా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసిన టాక్స్ పేయర్స్ తమ రిజిస్టర్డ్ మెయిల్, ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. రిటర్న్స్‌లో సరైన వివరాలు లేకపోయినా, ఇంకా మీరు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉన్నా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు రావొచ్చు. అయితే ఈ నోటీసులు వచ్చినప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా, దాంట్లో పేర్కొన్న లోపాన్ని గుర్తించి నిర్ణీత సమయంలోగా సరిచేయడం ముఖ్యం.ఐటీఆర్‌లో అవసరమైన సమాచారం పూర్తిగా ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాల మధ్య తేడాలు ఉన్నా లేదా ఐటీ రిటర్న్స్ ఫారాలకు సంబంధించిన నిబంధనల్ని సరిగ్గా పాటించకపోయినా దాన్ని డిఫెక్టివ్ రిటర్న్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక టాక్స్ పేయర్ టీడీఎస్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసి, దానికి సంబంధించిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించకపోతే సమస్య రావొచ్చు. అలాగే బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం ఉన్న అవసరమైన ఆర్థిక వివరాల్ని పూర్తిగా ఇవ్వకపోయినా నోటీసులు వస్తాయి.ఇన్‌కంటాక్స్ విభాగం ప్రధానంగా 3 మార్గాల్లో డిఫెక్టివ్ రిటర్న్ గురించి సమాచారం ఇవ్వొచ్చు. ముందుగా రిజిస్టర్డ్ ఇ- మెయిల్‌కు నోటీసు పంపుతుంది. ఎక్కువ శాతం ఇదే చేస్తుంది. లేదా పోస్ట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. లేదా ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో నోటీసును అందుబాటులో ఉంచొచ్చు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ నోటీసులో సాధారణంగా ఐటీఆర్‌లో ఏ లోపం ఉంది? దాన్ని ఎలా సరిచేయాలో వివరాలు ఉంటాయి.Read Also: అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన15 రోజుల్లోగా స్పందించాలిసెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు అందుకున్నప్పుడు సాధారణంగా నోటీసు అందుకున్న తేదీ నుంచి 15 రోజుల్లో అందులో ఉన్న లోపాన్ని లేదా తప్పుల్ని సరిచేసి పంపించాల్సి ఉంటుంది. నోటీసులో ప్రత్యేకంగా

కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి అమల్లోకి సర్వం సిద్ధం చేసిన ట్రాఫిక్ పోలీసులు 13 చోట్ల ఎగ్జిట్ పాయింట్లు అదనంగా 35 సీసీ కెమెరాల ఏర్పాటు పాదచారుల కోసం ‘సిటిజన్ పెవిలియన్లు’.. ప్రత్యేక జీబ్రా క్రాసింగ్స్ నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పహారా.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి ‘వన్ వే’ అమలు కానుంది. ఈ మేరకు పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ట్రాఫిక్ కష్టాలకు చరమగీతం పాడేలా అమలు చేయనున్న వన్‌వే ప్రయాణతీరుపై వాహన చోదకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రోడ్డులో ఎగ్జిట్ పాయింట్స్, లైన్ చేంజింగ్ పై అవగాహన ఉంటే సాఫీగా ప్రయాణం చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను పరిగణలోకి తీసుకొని సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. లేన్ 1.. 2 రోడ్ల వర్గీకరణ హెచ్-సిటీ ప్రణాళికలో భాగంగా వాహనాలు ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగేందుకు రహదారులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. లేన్-1 : దూరం వెళ్లే వాహనాలు, నాన్-స్టా్పగా ప్రయాణించే వారి కోసం ప్రత్యేకించారు. లేన్- 2: కాలనీలు, ఉప రహదారుల్లోకి వెళ్లే వారి కోసం నిర్దేశించారు. పది ప్రాంతాల్లో లేన్ చేంజింగ్‌కు అవకాశం కల్పించారు. 13చోట్ల ఎగ్జిట్ పాయింట్లు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లేందుకు వీలుగా కేబీఆర్ చుట్టూ 13చోట్ల ఎగ్జిట్ పాయింట్లను శాస్త్రీయంగా తీర్చిదిద్దారు. కేబీఆర్ పార్కుకు నిత్యం వేలాది మంది వాకర్లు, పర్యాటకులు వస్తుంటారు. వీరికి ఇబ్బందులు రాకుండా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్డు దాటాలనుకునే పాదచారులు సురక్షితంగా వేచి ఉండేందుకు పలు కీలక కూడళ్లలో అత్యాధునిక ‘సిటిజన్ పెవిలియన్స్’ నిర్మించారు. అవకాశమున్న చోట్ల స్పష్టమైన జీబ్రాక్రాసింగ్స్, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు బ్లింకర్లు, రేడియం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అదనంగా 35 సీసీ కెమెరాలు కేబీఆర్

Devdutt Padikkal: శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో అజేయంగా నిలిచి అదరగొట్టాడు. 2024 చివరిలో పర్త్ టెస్టు ఆడిన తర్వాత ఆయన మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. ఈ సుదీర్ఘ నిరీక్షణపై బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన పడిక్కల్.. బెంచ్ మీద కూర్చొని ఆటను చూడటం ఏ క్రీడాకారుడికైనా సులువైన విషయం కాదని పేర్కొన్నాడు. ఆ సమయంలో మానసికంగా బలంగా ఉంటూ తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవడానికి నిరంతరం శ్రమించానని, ఆ కష్టానికి ఈ రోజు ప్రతిఫలం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. గాలే మైదానంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉందని, విపరీతమైన చెమట పడుతూ అలసట ముంచెత్తిందని పడిక్కల్ తెలిపాడు. ముఖ్యంగా మూడో సెషన్లో శరీరం సహకరించకపోయినా వికెట్ పారేసుకోకూడదనే ఏకాగ్రతతో ముందుకు సాగానని అన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అంత తేలికగా ఏమీ లేదని, అనవసరమైన షాట్లు ఆడకుండా మైదానంలో ఎక్కువ సేపు నిలబడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాడు. సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో కాస్త కంగారు పడ్డా, ఆ ఒత్తిడిని అధిగమించి సెంచరీ బాదడం కెరీర్లోనే ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి : BAN vs AUS: 23 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ సాయి సుదర్శన్ గాయం కారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న పడిక్కల్, ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఆయన శతకంతో రాణించాడు. గాలే మైదానంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఇక్కడ గతంలో ఆడినప్పుడు కూడా మంచి పరుగులు చేశానని, ఈ వేదిక తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమైనదని వివరించాడు. విజయ్
భారత పురుషుల క్రికెట్ జట్టు కొన్నాళ్లుగా స్లో, టర్నింగ్ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ లంక స్పిన్నర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. తొలి రోజు ఆటలో పడిక్కల్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 131 పరుగులు) క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతినే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు.ఈ మ్యాచ్‌లో ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో పడిక్కల్ క్రీజు వదిలి ముందుకు వచ్చి లాంగాన్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. యంగ్ బ్యాటర్ కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే అతడు తన తొలి టెస్ట్ శతకాన్ని భారీ డబుల్ సెంచరీగా మలిచేలా స్పష్టంగా కనిపిస్తోంది. టర్నింగ్ పిచ్‌లపై కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ చక్కగా డిఫెన్స్ చేశాడు. అంతేకాకుండా గ్యాప్‌లలో సింగిల్స్ తీస్తూ ఫ్రంట్‌ఫుట్, బ్యాక్‌ఫుట్ రెండింటిపైనా అద్భుతమైన షాట్లు ఆడుతూ అలరించాడు.ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ .. పడిక్కల్ ఆటతీరును ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఎదుర్కొంటున్న స్పిన్ సమస్యకు దేవదత్ పడిక్కల్ రూపంలో పర్ఫెక్ట్ సమాధానం దొరికిందని, అతడు జట్టుకు దేవుడిచ్చిన వరం అని అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు అనుకూలించే ఆసియా పిచ్‌లపై స్పిన్నర్ల తలమీదుగా సునాయాసంగా షాట్లు ఆడగల సామర్థ్యం పడిక్కల్ సొంతమని ఆయన కొనియాడాడు.ఇదే సమయంలో టీమ్ మేనేజ్మెంట్కు మంజ్రేకర్ ఒక ముఖ్యమైన సూచన చేశాడు. భవిష్యత్తులో సాయి సుదర్శన్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, స్పిన్ బౌలింగ్‌ను ఇంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్న దేవదత్ పడిక్కల్‌నే మూడో స్థానంలో నిలకడగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశాడు. పడిక్కల్ ఆడుతున్న తీరు భారత ఇన్నింగ్స్‌కు కొండంత బలాన్ని ఇస్తుందని, రాబోయే రోజుల్లో అతడు టెస్టుల్లో మరింత కీలక పాత్ర పోషిస్తాడని మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా భారత్ తరఫున మూడో టెస్టు

దేశం శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం విశేషం. ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటలో జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గీతానికి నివాళిగా ఈ చారిత్రక అడుగు వేశారు. ఎన్సిసి క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు కలిసి వందేమాతరం పాడగా, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన వినిపించింది. ప్రధాని మోదీ ముందుగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు చేరుకుని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అధికారుల స్వాగతం స్వీకరించారు. గౌరవవందనం తీసుకున్న తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశీ 105 మి.మీ. ఫీల్డ్ గన్లతో 21 తుపాకుల గౌరవార్థన జరిగింది. వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, అధికారికంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ సందర్భాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. దీంతో దేశ ప్రజల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోందని చెప్పారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోట నుంచి వందేమాతరం మారుమ్రోగుతోందని పేర్కొన్నారు. 150 సంవత్సరాలు పూర్తయిన జాతీయ గీతానికి దీనికంటే అనుకూలమైన రోజు మరొకటి ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా చిన్న కలలతో ఇకపై సరిపోదని, పెద్ద కలలు కనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫలితంగా

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. న్యూఢిల్లీ, ఆగస్టు 14: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. రూ.13 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్న బసోయాను ఇంటర్ పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చారు. ఎన్సీబీ అభ్యర్థన మేరకు ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు బసోయాను అరెస్టు చేశారు. ఎన్సీబీ అధికారులు అతన్ని యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. యూఏఈ బోసోయాను భారత్‌కు అప్పగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా విదేశాల్లో దాక్కున్నా సరే వేటాడుతామని ‘ఎక్స్’లో పేర్కొన్నారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ సైన్యం తన దాడులను... కీవ్‌పై 133 డ్రోన్లతో రష్యా ప్రతీకార దాడులు కీవ్, ఆగస్టు 13: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ సైన్యం తన దాడులను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా, సరిహద్దుకు సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన రిఫైనరీపై గురువారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ‘గాజ్ప్రోమ్ నెఫైఖిమ్ సాలావత్’ చమురు శుద్ధి, పెట్రోకెమికల్ సముదాయంపై డ్రోన్లతో దాడులు చేశామని ఉక్రెయిన్ సైన్యం టెలిగ్రామ్ వేదికగా వెల్లడించింది. మాస్కో చమురు పరిశ్రమను దెబ్బతీయడమే లక్ష్యంగా కీవ్ మూడు రోజుల్లో చేపట్టిన నాలుగో దాడి ఇది. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో విరుచుకుపడుతోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు ఉక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్లతో జరిపిన దాడుల్లో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు.. అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Giant Python Viral Video: సాధారణంగా పాము పేరు చెబితేనే.. చాలా మంది ఆమడదూరం పరుగులు తీస్తూ బయపడి పోతూ ఉంటారు.. ఇక అది భారీ కొండచిలువ (Python) అయితే.. చూసిన వెంటనే గుండె ఆగినంత పనవ్వడం ఖాయం.. సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే, తాజాగా ఓ నిర్మాణంలో ఉన్న నీటి గుంతలో ఏకంగా 13 అడుగుల పొడవాటి ఓ భారీ కొండచిలువను ఒక యువకుడు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ వీడియోనే కనిపిస్తూ ఉంది.. నీటిలో భారీ కొండచిలువ.. చాలా రోజుల నుంచి అడవులు అంతరించిపోతుండటంతో వన్యప్రాణులు తరచుగా జనాలు నివసించే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఓ పెద్ద నీటి గుంతలో భారీ కొండచిలువ పడిపోయింది. ఆ నీటిలోంచి బయటకు రాలేక ప్రాణాపాయ స్థితిలో, ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండటాన్ని స్థానికులు గమనించారు.. ఆ భారీ పామును చూసి జనాలు భయంతో వణిపోకుండా... వెంటనే స్నేక్ క్యాచర్‌కు (Snake Catcher) సమాచారం అందించారు. అయితే, వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ పవన్ సర్పమిత్ర (Pavan Sarpmitra) బృందం అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ కొండచిలువ ఏకంగా 13 అడుగుల పొడవు ఉన్నట్లు గమనించిన స్నేక్ క్యాచర్స్ సైతం ఆశ్చర్యపోయారు. పైగా కొండచిలువలకు విషం లేకపోయినా.. వాటికి ఉండే విపరీతమైన బలంతో

ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతితో పనులు చేసే వారి ప్రత్యేకతలు, అలవాట్లు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏడాది ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎడమ చేతితో రాయడం, తినడం, ఇతర పనులు చేయడం అలవాటుగా ఉన్నవారు ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ రోజును ఎడమచేతి వాటం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి ప్రత్యేకతలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచంలోని చాలా వస్తువులు, పనిముట్లు కుడిచేతి వాటం వారికి అనుకూలంగా రూపొందించబడి ఉంటాయి. దీంతో ఎడమచేతి వాటం వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు తమకు అనుకూలమైన విధంగా వాటిని ఉపయోగిస్తూ పనులను పూర్తి చేస్తారు. లెఫ్ట్-హ్యాండర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్‌బెల్ 1976లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటం వారి ఆలోచనా విధానం, సృజనాత్మకతలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువ తెలివితేటలు లేదా అధిక ఐక్యూ కలిగి ఉంటారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. వారిలో సృజనాత్మకత, సమస్యలను విభిన్నంగా పరిష్కరించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ప్రత్యర్థులకు భిన్నమైన సవాలుగా నిలుస్తారు. రఫెల్ నాదల్, డియెగో మారడోనా, బ్రియాన్ లారా, పీలే వంటి ప్రముఖ క్రీడాకారులు ఎడమచేతి వాటం వారిగా గుర్తింపు పొందారు. మొత్తంగా చూస్తే, ఎడమచేతి వాటం అనేది లోపం కాదు.. ఒక సహజమైన భిన్నత్వం. తమకు అనుకూలంగా లేని పరిస్థితులను అధిగమిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న ఎడమచేతి వాటం వారిని గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో

OnePlus 13 Sale : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ. 60వేలు అయితే, వన్‌ప్లస్ 13 అద్భుతమైన ఆఫర్. ఈ సేల్ సమయంలో ఈ వన్‌ప్లస్ 13 కొనుగోలుపై ధర తగ్గింపు, మరెన్నో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ (OnePlus 13) ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ 13 ఆఫర్లు, డిస్కౌంట్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి. వన్‌ప్లస్ 13 ధర ఆఫర్లు : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వన్‌ప్లస్ 13 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,990 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 3575 డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో అసలు ధర రూ. 58,415 అవుతుంది. Read Also : Google Pixel 11 Series : కొత్త పిక్సెల్ 11 ఫోన్లు వచ్చేశాయ్.. ఒక్కో AI ఫీచర్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.. ఐఫోన్, శాంసంగ్‌కు గట్టి షాక్..! మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 55,200 సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది జనవరిలో రూ. 69,999 ధరకు వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.11,584 తగ్గింపు ధరకే లభిస్తోంది. వన్‌ప్లస్ 13 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల క్వాడ్ HD+ ఎల్టీపీఓ 4.1 ProXDR డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 1440×3168 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz టాప్ బ్రైట్నెస్ 4500 నిట్స్. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. గురువారం రూ.220 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,42,200 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. అటు ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.05 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,54,960 వద్ద ఉండగా.. MCX సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్టులు 0.16 శాతం తగ్గి కిలోకు రూ.2,37,450 వద్ద ఉన్నాయి
ఒంటరిగా ఉన్న రాధ మీద అటాక్ ప్లాన్ చేస్తాడు భవానీ శంకర్. ఇలా లైవ్‌లో మర్డర్ చూసి చాలా రోజులు అయిందని భవానీ శంకర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధ పక్కన విక్రమ్ వచ్చి కూర్చుంటాడు. దీంతో రౌడీలు సైలెంట్ అవుతారు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని భవానీ శంకర్ అనుకుంటాడు. ఇక రాధను కూల్ చేసేందుకు ఐస్ క్రీం కూడా తెస్తాడు. కానీ రాధ మాత్రం మారాం చేస్తుంది. నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్తావా? అని అలుగుతుంది. రాధను కూల్ చేసి ఆ ఐస్ క్రీం తినిపించాలని విక్రమ్ అనుకుంటాడు.ఇక అప్పుడే ఫోన్ చేసిన దమయంతికి భవానీ శంకర్ లైవ్ రన్నింగ్ కామెంటరీ చేస్తాడు. రాధ చిన్నగా నవ్వింది.. విక్రమ్ గట్టిగా నవ్వాడు.. ఇద్దరూ కలిసి పకపకా నవ్వుకుంటున్నారు.. రాధకి విక్రమ్ ఐస్ క్రీం తినిపిస్తున్నాడు అని చెప్తాడు భవానీ శంకర్. వదిలేసినోడు మళ్లీ ఎందుకు వచ్చాడు అని దమయంతి అనుకుంటుంది. ఏమో అమ్మా.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగానే ఉన్నట్టుంది. నువ్వులేక నేనులేను అనే రేంజ్లో ప్రేమ ఉంది.. ఏడేడు జన్మల బంధం అన్నట్టుగా ఉందని భవానీ శంకర్ అంటాడు.ఇంకో వైపు సునంద మాత్రం వారసుడు రావాలని పూజ చేయించాలని చూస్తుంది. రాధ, విక్రమ్ ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదని, ఏమైనా దోషాలున్నాయేమో అని పంతుల్ని అడుగుతుంది సునంద. అప్పుడు ఏదో వ్రతం ఉందని రాధ చెప్పింది కదా అని నంద గోపాల్ గుర్తు చేస్తాడు. నాకు తెలిసి అది అబద్దం అండి, అందుకే ఇలా పంతుల్ని అడిగాను.. పూజకి ముహూర్తం కూడా పెట్టించాను అని సునంద అంటుంది. ఇంకో వైపు రాధ తన పుట్టింట్టో విక్రమ్‌ను ఏడ్పిస్తుంటుంది. తినడానికి కూర్చో పెట్టి.. పద్మావతి పక్కకు వెళ్లిన ప్రతీ సారి విక్రమ్‌ని గిల్లుతూ, గిచ్చుతూ ఏడ్పిస్తుంటుంది రాధ.ఇంకో వైపు ఖాళీ తింటూ ఎంజాయ్

కర్ణాటకలో నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. కర్ణాటక జాయింట్ యాక్షన్ కమిటీ.. కన్నడ ఒక్కూట ఈ బంద్ కు పిలుపునిచ్చింది. బెంగళూరు సహా చాలాచోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. మరి కొన్ని చోట్ల సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు యథాతథంగా పని చేస్తోన్నాయి. బెంగళూరులో బీఎంటీసీ బస్సుల రాకపోకలపైనా పెద్దగా ప్రభావం పడలేదు.తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ హక్కుల పరిరక్షణ వేదిక నేత వాటాల్ నాగరాజ్ ఈ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కిందటి నెల 28వ తేదీ నుంచి కర్ణాటక ప్రభుత్వం రోజూ 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం పట్ల కర్ణాటక హక్కుల పరిరక్షణ వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.దీనికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగాల్సి ఉంది. కావేరి నదీ పరీవాహక ప్రాంత జిల్లాలు.. మండ్య, మైసూరు, చామరాజనగర, మడికెర్రి, హాసన్ లల్లో సానుకూల స్పందన లభించింది. బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల కేఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బస్సులు డిపోల నుంచి బయటికి రాకుండా ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించారు. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలంటూ నినదించారు.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్బెంగళూరులో బంద్ ప్రభావం అంతంత మాత్రమే. ఆటో, క్యాబ్ యూనియన్లు పెద్దగా స్పందించట్లేదు. ఫలితంగా ఆటోలు, క్యాబ్ లు రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వాటి సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎప్పట్లాగే పని చేస్తోన్నాయి. బంద్ ప్రారంభమైనప్పటికీ వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.అమరావతిలో మొదటి
ఇందు, నందు ఎంత చెప్పినా శశి గాడి ట్రాప్ లోంచి ఐశ్వర్య బయటకు రాదు. దీంతో ఐశ్వర్య ఫ్రెండ్ రేణుని తీసుకు వస్తుంది నందు. రేణు కూడా శశి గాడి గురించి నిజం చెబుతుంది. వాడు మంచి వాడు కాదు, నిన్ను మోసం చేస్తున్నాడు.. వాడు ప్రేమించడం లేదు అని రేణు చెబుతుంది. కానీ ఐశ్వర్య మాత్రం నమ్మదు. ఈ ఇందు, నందు నిన్ను భయపెట్టి ఉంటారు.. అందుకే ఇలా చెబుతున్నావ్ అని ఐశ్వర్య అంటుంది. నన్ను ఎవ్వరూ భయపెట్టడం లేదు.. ఇదే నిజం అని అంటుంది రేణు. కానీ ఐశ్వర్య నమ్మదు. నువ్వు నమ్మవు అని నాకు తెలుసే.. అందుకే ఎవరి చేత చెప్పించాలో వాడ్నే తీసుకు వచ్చా అని శశి గాడ్ని దించుతుంది నందు. వీళ్లు చెప్పింది నిజం.. అని శశి గాడు అంటాడు. దీంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇప్పటికైనా నమ్ముతావా? అని నందు అంటే.. నమ్మకం ఏం చేస్తుంది అని శేషు, భ్రమరం అంటారు. నీకు బుద్దిలేదా ఇలాంటి పనులు చేయడానికి అని అంతా శశి గాడి మీద ఫైర్ అవుతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని భ్రమరం అంటుంది.ఇలానే చెప్పమని బెదిరించారు.. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీరు చెప్పమన్నట్టుగానే చెప్పా.. అని ప్లేటు ఫిరాయిస్తాడు శశి. ఏంట్రా అబద్దాలు ఆడుతున్నావ్ అని ఇందు అంటుంది. నిన్న వీళ్లు నన్ను కొట్టారు.. ఇలా చెప్పకపోతే నా కుటుంబం పరువుతీస్తామని అన్నారు.. అసలే మాది పెద్ద కుటుంబం.. మా నాన్నకి ఉన్న పలుకుబడి గురించి తెలిసిందే కదా.. అందుకే ఇందాక అలా అబద్దం చెప్పా అని శశి అంటాడు. వాడు అబద్దాలు చెబుతున్నాడు అని ఇందు అంటే.. నువ్వే అబద్దాలు చెబుతావ్.. నేను శశిని నమ్ముతున్నాను.. నేను శశిని ప్రేమిస్తున్నా.. శశినే పెళ్లి చేసుకుంటా అని ఐశ్వర్య అంటుంది.ఇది కూడా దాని అమ్మలాంటిదే.. అక్కా అంటావ్.. ఐశ్వర్య మీద నీకు ఇంత
జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది. కార్తీక్‌తో బంధాన్ని తెంపేసుకుని సూరజ్ వైపు గాలి మళ్లించింది. ఓ వైపు అతను వద్దూ అంటూనే.. అతని ప్రేమకోసం తపించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు (ఆగస్టు 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. కార్తీక్ ఇంటికి వచ్చిన జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్లడానికి క్యాబ్స్ కోసం చూస్తుంటుంది. ఎప్పటికీ క్యాబ్ బుక్ కాదు. దాంతో ఎలా వెళ్లాలీ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సెకండ్ హీరో వచ్చేస్తాడు బైక్ వేసుకుని. ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుందని బ్రదర్ చెప్పాడు కదా.. పైగా వర్షం పడేలా ఉంది.. రా లిఫ్ట్ ఇస్తాను.. అని అంటాడు సూరజ్. ‘నువ్వు ఎంత అడిగినా నేను రాను’ అని అంటుంది జ్యోత్స్న. ‘అబ్బా రా.. గొడవల్ని పక్కనపెట్టి ఎక్కు.. వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతాం’ అని బ్రతిమిలాడి జ్యోత్స్నని బైక్ ఎక్కించుకుంటాడు సూరజ్. ఇక అద్దంలో జ్యోత్స్నని చూస్తూ.. ‘ఎవరే.. ప్రేమని మాయన్నదీ’ అంటూ తెగ ప్రేమించేస్తూ సాంగ్ వేసుకుంటాడు సూరజ్. ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో థాంక్స్ అని అంటుంది జ్యోత్స్న. ఇట్స్ ఓకే కానీ.. చాలా కష్టపడుతున్నట్టున్నావ్ అని అంటాడు సూరజ్.వస్తువులు తిరిగి ఇచ్చేస్తే మనసులో ఉన్న ఇష్టం పోతుందా?? దేని గురించి మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న అంటే.. ‘నన్ను నమ్మించడానికి’? అని అంటాడు సూరజ్. ‘నిన్ను నమ్మించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావ్.. అని అంటాడు సూరజ్. ‘నేను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదు.. అలాగే నా మనసులో ఎవరికీ స్థానం లేదు.. రాదు’ అని అంటుంది జ్యోత్స్న. ‘సర్లే.. కనీసం నీ మనసులో నీకైనా స్థానం ఉందా? వస్తువులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ఇష్టం పోతుందా? అని అడుగుతాడు సూరజ్. మా బావపై ఉన్నది
ఇక్కడికి కూడా దాపరించారా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చార్రా అని తిడుతుంది తాయారు. ఇదేమైనా నా మొగుడి సొత్తా? మేం రాకూడదా? అని కేశవ అంటాడు. ఈ టైంకే రావాలని, ఇక్కడికే రావాలని ఉందా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి..అసలు మీకు ఈ అడ్రెస్ చెప్పింది ఎవడ్రా అని తిడుతుంది తాయారు. మేం వెళ్లం నీకు నచ్చకపోతే.. నువ్వే వెళ్లిపో అని చక్రి, కేశవ అంటాడు. ఈ అడ్రెస్ ఆ మెడలు తిరగనోడే ఇచ్చాడు అని అంటాడు నారాయణ. వాడి సంగతి చెప్తా అని తాయారు రమణయ్యకి ఫోన్ చేసి తిడుతుంది. అమ్మో ఇప్పుడు దీనికి నేనే కావాలని చెప్పాని తెలిస్తే నన్ను చంపేస్తుంది.. అమ్మవారు కలలోకి వచ్చింది. అందుకే చెప్పాను అని కవర్ చేస్తాడు రమణయ్య. ఏమైనా సమస్య.. నేను కూడా రావాలా? అని అంటాడు రమణయ్య. వద్దులే.. ఏమైనా ఉంటే ఫోన్ చేస్తా అప్పుడు రా అని అంటుంది తాయారు. ఇంకో వైపు శైలు, కేశవ మాట్లాడుకుంటూ ఉంటే సురేష్ ఉడికిపోతుంటాడు. దీంతో సురేష్ ఓ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.కేశవతో ఫోన్.. కేశవకి శైలు ఫోన్ చేస్తుంది. వామ్మో ఇది ఫోన్ చేస్తుంది.. ఫోన్ చేయలేదు అని తిడుతుందేమో.. మనమే రిటర్న్‌లో తిడదాం అని కేశవ అనుకుంటాడు. నన్ను మర్చిపోయావా?ఫోన్ కూడా చేయడం లేదు అని శైలు అంటుంది. ఇప్పుడే సత్రంలోకి దిగాం.. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండటం లేదు అని కేశవ అంటాడు. మనం కూడా అక్కడే పెళ్లి చేసుకుందాం.. ఎలాగూ మనం లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే.. నువ్వు మా వాళ్లకి నచ్చవు.. నేను నిన్ను తప్ప ఇంకెవ్వర్నీ చేసుకోను అని అంటుంది శైలు. ఈ మాటలన్నీ కూడా సురేష్ గాడు వింటాడు. వచ్చి శైలుతో గొడవ పడతడు. వందకి ఫోన్ చేయాలా? అని శైలు బెదిరిస్తుంది.సైలెంట్‌గా పెళ్లి.. నేను

ఈ ట్రైలేటరల్ హైవే మణిపూర్‌లోని మోరెహ్ నుంచి ప్రారంభమై.. మయన్మార్ మీదుగా థాయ్‌లాండ్‌లోని మే సోట్ వరకు కొనసాగుతుంది. మార్గంలో టాము, కలేవా, మండలే, నేపిడా వంటి ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాజెక్టును 2002లో తొలిసారిగా ప్రతిపాదించారు. భారత్‌కు ఆగ్నేయాసియాతో భూభాగం ద్వారా మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించడమే ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కలేవా-యాగీ రహదారి, టాము-క్యిగోన్-కలేవా మార్గంలోని వంతెనల నిర్మాణం, రహదారి అభివృద్ధి వంటి పనులను భారత్ చేపట్టింది. భారత్ ఈశాన్య రాష్ట్రాలకు ప్రస్తుతం భౌగోళికంగా ఉన్న కొన్ని పరిమితులను తగ్గించడంలో ఈ హైవే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈశాన్య ప్రాంతం నుంచి మయన్మార్, థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ASEAN దేశాల మార్కెట్లకు రవాణా సులభమవుతుంది. దీంతో వస్తువుల రవాణా సమయం, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాపారం, పర్యాటకం, పెట్టుబడులు, విద్య, ప్రజల మధ్య రాకపోకలు కూడా పెరగవచ్చు. భారత్ ఈ ప్రాజెక్టును ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక కనెక్టివిటీ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఈ ప్రాజెక్టుకు మయన్మార్‌లో కొనసాగుతున్న రాజకీయ, భద్రతా పరిస్థితులు ప్రధాన అడ్డంకిగా మారాయి. పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతుండటంతో రహదారి నిర్మాణం, రవాణా కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ప్రాజెక్టును పూర్తి చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ సమావేశంలో కలాదాన్ ప్రాజెక్టుతో పాటు ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ ట్రైలేటరల్ హైవేను పూర్తి చేయడానికి కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. అలాగే 2026 జూలైలో భారత్-మయన్మార్ జాతీయ స్థాయి సమావేశంలో కూడా ఈ హైవేను పూర్తి చేయడంపై ఇరు పక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ హైవే అందుబాటులోకి వస్తే భారత్‌కు ASEAN దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తువులను భూభాగం ద్వారా

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఏళ్లుగా సాగుతున్న నీటి వివాదాలు మళ్లీ అగ్గి రాజేసాయి. తమ హక్కుల సాధన కోసం కన్నడ ఉద్యమకారులు సమరశంఖం పూరించారు. వచ్చే ఆగస్టు 13న కర్ణాటక వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన మాతృభాషా సంఘాలు, దానికి ముందస్తు హెచ్చరికగా సరిహద్దుల్లో రాకపోకలను స్తంభించిపోయేలా చేశాయి. మేకదాటు, మహదాయి, కళసా బండూరి వంటి కీలక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం హింసాత్మక రూపు దాల్చేలా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొంటున్నారు.మహా బంద్‌కు సమరభేరి మోగిస్తూ కన్నడ చలవళి నేత వాటాల్ నాగరాజ్ నేతృత్వంలో సోమవారం ఉదయం నుంచే నిరసనలు ఉధృతమయ్యాయి. కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని అత్యంత బిజీ రహదారి అయిన అట్టిబెల్లె చెక్‌పోస్ట్ వద్ద ఉద్యమకారులు బైఠాయించారు. దీంతో తమిళనాడు నుంచి కర్ణాటకలోకి, అలాగే బెంగళూరు వైపు నుంచి తమిళనాడు వైపు వెళ్లే వేలాది లారీలు, బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మందుబాబులకు బిగ్ షాక్ - రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్..!!3,000 సంఘాల మద్దతు: బంద్‌కు సర్వం సిద్ధంగురువారం కర్ణాటకను పూర్తిగా స్తంభింపజేస్తామని వాటాల్ నాగరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 2,000కు పైగా కన్నడ అనుకూల, రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయని, ఆ సంఖ్య 3,000 మార్కును చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు, మైసూర్ నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా రంగాలు తమ వ్యాపారాలను బంద్ చేసి పోరాటానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం మేకదాటు ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!ముఖ్యమంత్రి విజ్ఞప్తి నిరాకరణ.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూతపడతాయి?పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బంద్
Colombia 7.4 Earthquake : దక్షిణాఫ్రికా ఖండంలోని కొలంబియా దేశాన్ని ఓ వినాశకరమైన ప్రకృతి విపత్తు తీవ్రంగా నాశనం చేసింది. పశ్చిమ కొలంబియా ప్రాంతంలో 7.4 తీవ్రతతో కూడిన అత్యంత శక్తివంతమైన భూకంపం రాగా.. పలు నగరాలు క్షణాల్లో శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. ఈ శతాబ్దంలోనే కొలంబియా ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఈ భూకంప ధాటికి ఇప్పటి వరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 570 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వాటి కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తీవ్రమైన ఆస్తి నష్టం.. అత్యవసర పరిస్థితి విధింపు !ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు అబెలార్డో గాబ్రియెల్ డి లా ఎస్ప్రియెల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఈ విపత్తు మొదటి పెద్ద సవాలుగా మారింది. జూన్ నెలలో పొరుగున ఉన్న వెనిజులాలో సంభవించిన భూకంపం జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోకముందే కొలంబియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తొలిసారి వచ్చిన భూకంపం తర్వాత మరో 21 సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఈ విధ్వంసంలో కనీసం 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. దాదాపు 61 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయని పేర్కొన్నారు.కళ్లముందే కుప్పకూలిన నిర్మాణాలుబాధితులకు తక్షణ నిధులు, ఉపశమన చర్యలు వేగవంతం చేసేందుకు అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. "బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలేయబోం. ప్రజలను కచ్చితంగా ఆదుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు భూకంప ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలగా.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవవుతున్నాయి. ముఖ్యంగా పెరేరా నగరంలో నాలుగు అంతస్తుల భవనం చూస్తుండగానే నేలమట్టమైంది. మానిజాలెస్ నగరంలోని ప్రసిద్ధ నియో-గోథిక్ కేథడ్రల్ పక్క టవర్లు కూలిపోయి వీధులపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.కాలి నగరంలో ఐదు అంతస్తుల భవన శిథిలాల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ద్వారా 13 వేల రూపాయలను వాటి ఖాతాలో జమ చేస్తుంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంపై ఏపీ సర్కార్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.కొత్తగా తల్లికి వందనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అప్పటిదాకా గడువుఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగస్టు 25వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే తల్లికి వందనం పథకంలో లబ్ది జరగని వారు, గతంలో వివిధ కారణాల వల్ల పథకం ప్రయోజనం పొందలేకపోయిన వారి దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 7తో ముగిసింది.అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అప్పుడే కొత్తగా చేరిన విద్యార్థులను కూడా పథకం పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ క్రమంలో దరఖాస్తులు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హుల జాబితా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 30వ తేదీన అర్హత సాధించిన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.ఆగస్టు 25లోపు వివరాలు నమోదు చేసుకోవాలన్న అధికారులు ఈ సాయం పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆగస్టు 25లోపు వివరాలు నమోదు చేసుకొని, 30న అందే ఆర్థిక సహాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించి, తల్లులకు సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.తెలంగాణా రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. రూ. 600 కోట్లతో వారికోసం!