
OnePlus 13 Sale : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ. 60వేలు అయితే, వన్‌ప్లస్ 13 అద్భుతమైన ఆఫర్.
ఈ సేల్ సమయంలో ఈ వన్‌ప్లస్ 13 కొనుగోలుపై ధర తగ్గింపు, మరెన్నో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ (OnePlus 13) ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ 13 ఆఫర్లు, డిస్కౌంట్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ 13 ధర ఆఫర్లు : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వన్‌ప్లస్ 13 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,990 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 3575 డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో అసలు ధర రూ. 58,415 అవుతుంది.
Read Also : Google Pixel 11 Series : కొత్త పిక్సెల్ 11 ఫోన్లు వచ్చేశాయ్.. ఒక్కో AI ఫీచర్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.. ఐఫోన్, శాంసంగ్‌కు గట్టి షాక్..!
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 55,200 సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది జనవరిలో రూ. 69,999 ధరకు వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.11,584 తగ్గింపు ధరకే లభిస్తోంది.
వన్‌ప్లస్ 13 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల క్వాడ్ HD+ ఎల్టీపీఓ 4.1 ProXDR డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 1440×3168 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz టాప్ బ్రైట్నెస్ 4500 నిట్స్. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC జీపీఎస్ ఉన్నాయి.



