
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Giant Python Viral Video: సాధారణంగా పాము పేరు చెబితేనే.. చాలా మంది ఆమడదూరం పరుగులు తీస్తూ బయపడి పోతూ ఉంటారు.. ఇక అది భారీ కొండచిలువ (Python) అయితే.. చూసిన వెంటనే గుండె ఆగినంత పనవ్వడం ఖాయం.. సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే, తాజాగా ఓ నిర్మాణంలో ఉన్న నీటి గుంతలో ఏకంగా 13 అడుగుల పొడవాటి ఓ భారీ కొండచిలువను ఒక యువకుడు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ వీడియోనే కనిపిస్తూ ఉంది..
నీటిలో భారీ కొండచిలువ.. చాలా రోజుల నుంచి అడవులు అంతరించిపోతుండటంతో వన్యప్రాణులు తరచుగా జనాలు నివసించే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఓ పెద్ద నీటి గుంతలో భారీ కొండచిలువ పడిపోయింది. ఆ నీటిలోంచి బయటకు రాలేక ప్రాణాపాయ స్థితిలో, ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండటాన్ని స్థానికులు గమనించారు.. ఆ భారీ పామును చూసి జనాలు భయంతో వణిపోకుండా... వెంటనే స్నేక్ క్యాచర్‌కు (Snake Catcher) సమాచారం అందించారు. అయితే, వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ పవన్ సర్పమిత్ర (Pavan Sarpmitra) బృందం అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు.
ఆ కొండచిలువ ఏకంగా 13 అడుగుల పొడవు ఉన్నట్లు గమనించిన స్నేక్ క్యాచర్స్ సైతం ఆశ్చర్యపోయారు. పైగా కొండచిలువలకు విషం లేకపోయినా.. వాటికి ఉండే విపరీతమైన బలంతో మనుషులను సైతం చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి పామును నీటిలోంచి బయటకు తీయడం చాలా కష్టమని వారు భావించారు. అయినా సరే.. ఓ యువకుడు ఏ మాత్రం భయం లేకుండా నిచ్చెన సాయంతో ఆ నీటి గుంతలోకి దిగాడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
పామును అతను ఎంతో సులభంగా పట్టుకునేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. పాము బరువు ఎక్కువగా ఉండటంతో పాటు అది విపరీతంగా గింజుకోవడంతో.. పైనున్న మరికొంత మంది యువకులు అతనికి సహాయంగా ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. అందరూ ఎంతో కష్టపడి పామును నీటిలో నుంచి బయటికి లాగడం కూడా మీరు చూడొచ్చు.
ఆ భారీ కొండచిలువను నీటిలో నుంచి పైకి తీస్తున్న దృశ్యాలు చూసి చాలా మంది భయపడిపోయిన్నట్లు తెలుస్తోంది. పామును సురక్షితంగా బయటకు తీసిన తర్వాత దాన్ని సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టిన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ షార్ట్ వీడియోను ఏకంగా 25 కోట్ల మందికి పైగా (250 Million Views) వీక్షించగా, 24 లక్షలకు పైగా లైక్స్ చేయడం విశేషం.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




