
బ నారస్‌ లోకొమోటివ్‌ వర్క్స్‌ (బీఎల్‌డబ్ల్యూ), వారణాసి.. స్పోర్ట్స్‌ కోటాలో 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విభాగాలు: బాస్కెట్‌బాల్, వాలీబాల్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్‌. అర్హత: టెన్త్‌/ ఇంటర్‌/ ఐటీఐ/ డిగ్రీ/ పీజీతో పాటు కేటగిరీ-ఏ, బీ, సీ పోటీల్లో ప్రాతినిధ్యం లేదా కేటగిరీ-బీ, సీ పోటీలు/ నేషనల్‌ గేమ్స్‌/ ఆల్‌ ఇండియా ఇంటర్‌-యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లలో కనీసం మూడో స్థానం లేదా ఫెడరేషన్‌ కప్‌లలో (సీనియర్‌) మొదటి స్థానంలో నిలిచి ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు. ఎంపిక: షార్ట్‌లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, స్పోర్ట్స్‌ ట్రయల్స్‌తో. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 12. వెబ్‌సైట్‌: https://blw.indianrailways.gov.in/index.jsp?lang=1 ఇస్రోలో రిసెర్చ్‌ ఫెలోలు భా రత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)- స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ), అహ్మదాబాద్‌ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి జేఆర్‌ఎఫ్‌లకు 28 ఏళ్లు, రిసెర్చ్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌కు 35 ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు జేఆర్‌ఎఫ్‌లకు స్టైపెండ్‌ రూ.37,000. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌కు రూ.56,000. రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.58,000.ఎంపిక: ఇంటర్వ్యూతో. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30. వెబ్‌సైట్‌: https://www.sac.gov.in ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో రా ష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌), ముంబయి.. 10 అసిస్టెంట్‌ ఆఫీసర్‌ సెక్రటేరియల్‌ ఈవో గ్రేడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ పీజీ/ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ డిప్లొమా, ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌లకు 32 ఏళ్లు, దివ్యాంగులకు 42, ఎస్సీలకు 37, ఓబీసీలకు 35 ఏళ్లు మించకూడదు. వేతనం: రూ.65,000. ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్టు, స్కిల్‌ టెస్టులతో. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మహిళలకు ఫీజు ఉండదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 26. వెబ్‌సైట్‌: https://www.rcfltd.com/ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు సీ ఎస్‌ఐఆర్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ), పాలంపుర్‌.. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ ఎంసీఏ/ బీటెక్‌/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంఫార్మాతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: పోస్టు ప్రకారం 35 నుంచి 40 ఏళ్లు మించకూడదు. వేతన శ్రేణి: రూ.20,000-42,000 వరకు చెల్లిస్తారు. ఎంపిక: ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబరు 21, 22, 23, 24. వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐహెచ్‌బీటీ, పాలంపుర్, హిమాచల్‌ప్రదేశ్‌. వెబ్‌సైట్‌: https://www.ihbt.res.in/en సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు సెం ట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), దిల్లీ పోలీసు విభాగంలో 1,871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఏపీఎఫ్‌లో బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలు భాగంగా ఉంటాయి. అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ. సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ (ఫైర్‌) పోస్టుకు సైన్స్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌) డిగ్రీ లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. దిల్లీ పోలీస్‌ ఎస్‌ఐ (పురుషులు) పోస్టులకు ఫిజికల్‌ టెస్టు సమయానికి బైక్, కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వయసు: 01.08.2026 నాటికి సీఐఎస్‌ఎఫ్‌ పోస్టులకు 18-30 ఏళ్లు, మిగతా అన్ని పోస్టులకు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. వేతన శ్రేణి: నెలకు రూ.35,400 - 1,12,400. ఎంపిక: రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్టు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లతో. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ఫీజు ఉండదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30. వెబ్‌సైట్‌: https://ssc.gov.in/home ఈ ఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్, ఇందౌర్‌.. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.




