
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా గిరీష్ ఎ.డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.305 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డును నెలకొల్పింది. ‘కొత్త లోక: చాప్టర్ 1’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసింది. కేరళలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచినా సందర్భంగా హీరో నివిన్ పౌలీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.





