
జనరల్‌ స్టడీస్‌ - సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మానవ మేధస్సుకు యంత్ర పరిజ్ఞానం తోడైతే సృష్టి ఏ స్థాయికి చేరుతుందో నిరూపిస్తున్న అద్భుత సాంకేతిక రూపమే ‘రోబోటిక్స్‌’. ఒకప్పుడు కేవలం సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకే పరిమితమైన ఈ రోబోలు, నేడు కర్మాగారాల్లో శ్రమిస్తూ, శస్త్రచికిత్సల్లో వైద్యులకు చేదోడుగా నిలుస్తూ, అంతరిక్ష సరిహద్దులను దాటుతూ నిత్య జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు, కృత్రిమ మేధ రూపంలో వార్తలు చదివే వర్చువల్‌ యాంకర్లుగా, తరగతి గదుల్లో పాఠాలు చెప్పే రోబో టీచర్లుగా, భద్రతా వ్యవస్థలో పహారా కాసే రక్షకులుగా మారి సమాజ సాంకేతిక చిత్రాన్నే మార్చేస్తున్నాయి. రోబోటిక్స్‌ ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడంతోపాటు వ్యోమమిత్ర, ఆప్టిమస్, ఏఐ యాంకర్ల లాంటి జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై పోటీ పరీక్షార్థులు స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. రోబోల రకాలు, వాటి వినియోగ రంగాలు, సంబంధిత సంస్థలను తెలుసుకోవాలి. రోజువారీ వార్తల్లో నిలిచే సరికొత్త ఏఐ, రోబోటిక్స్‌ అప్‌డేట్లను అధ్యయనం చేయాలి. మా నవాళి భవిష్యత్‌ను మార్చేస్తున్న ఒక అద్భుతమైన సాంకేతికత రోబోటిక్స్, రోబోలు. రోబో అంటే మనుషులు చేసే పనులను స్వయంచాలకంగా చాలా కచ్చితత్వంతో చేసే ఒక యంత్రం. ఈ రోబోలను తయారుచేసే శాస్త్రాన్ని ‘రోబోటిక్స్‌’ అంటారు. రోబో అనే పదం ‘రొబోటా’ అనే ‘చెక్‌’ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ‘కష్టపడి పనిచేసే బానిస’ లేదా ‘శ్రామికుడు’. రోబోలు-రకాలు: మన చుట్టూ చాలా రకాల రోబోలున్నాయి. అందులో.. 1. ఇండస్ట్రియల్‌ రోబో: ఫ్యాక్టరీల్లో కార్లు తయారు చేయడానికి, భారీ వస్తువులను ఎత్తడానికి వాడతారు. 2. హ్యూమనాయిడ్‌ రోబోలు: ఇవి చూడటానికి అచ్చం మానవుడి లాగే ఉంటాయి. ఉదా: సోఫియా ్బసౌదీ అరేబియ్శా 3. మెడికల్‌ రోబోలు: క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడంలో వైద్యులకు సాయం చేస్తాయి. 4. స్పేస్‌ రోబోలు: అంతరిక్షంలో పరిశోధనలు చేస్తాయి. ్బఉదా: అంగారక గ్రహంపై తిరుగుతున్న నాసా రోవర్లు, మన ఇస్రో తయారు చేసిన వ్యోమమిత్ర. 5. మిలిటరీ రోబోలు: సరిహద్దుల్లో మైన్లను గుర్తించడానికి, బాంబులను నిర్వీర్యం చేయడానికి సైన్యానికి సాయపడతాయి. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




