
జనరల్‌ నాలెడ్జ్‌ స్టడీ జోన్‌ ఈ యన భారతదేశానికి చెందిన ప్రముఖ సివిల్‌ ఇంజినీర్, రాజనీతిజ్ఞుడు, పండితుడు. ఇంజినీరింగ్, పరిపాలనా రంగంలో అనేక నూతన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందారు. దేశవ్యాప్తంగా వివిధ జలాశయాల నిర్మాణం, రూపకల్పన చేశారు; అనేక విద్యాసంస్థలు, పరిశ్రమలు నెలకొల్పారు. నీటి ప్రవాహాలను మూసివేసే ఆటోమేటెడ్‌ తలుపులతో కూడిన బ్లాక్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన ఘనత ఈయనదే. భారత్‌లో ప్రణాళికలను రూపొందించి, ‘ప్రణాళికా పితామహుడిగా’ పేరొందారు. భారత ఇంజినీరింగ్‌ పితామహుడిగా పేర్కొనే విశ్వేశ్వరయ్య జయంతి రేపు (సెప్టెంబరు 15). ఆ తేదీన మన దేశంలో ‘ఇంజినీర్స్‌ డే’గానూ జరుపుకుంటారు. ఈ సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..! హైదరాబాద్, విశాఖపట్నాలకు విశ్వేశ్వరయ్య చేసిన మేలు, ఆర్థిక ప్రణాళికా పితామహుడిగా అందించిన సేవలు, అవార్డులు - గౌరవాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు-II’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





