
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది. అభిషేక్‌ శర్మ (82; 32 బంతుల్లో 7×4, 7×6) రెచ్చిపోవడంతో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట అఫ్గానిస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.





