
దుబాయ్‌: మహిళల ఆసియా కప్ ( Asia Cup ) 2026 విజేతగా భారత్ నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక సరిగ్గా 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (36) టాప్ స్కోరర్. నీలాక్షిక 22, విష్మి గుణరత్నె 20 రన్స్‌ చేశారు. మిగతా బ్యాటర్లెవరూ అంతగా రాణించలేదు. భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీ చరణి (4/20) అదరగొట్టింది. దీప్తి శర్మ (3/19) కూడా మెరిసింది. క్రాంతి గౌడ్‌, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్‌ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ( Team India ) నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 183/5 స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) అర్ధ శతకాలు బాదారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 129 (77 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రిచా ఘోష్‌ (17), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, ప్రబోధ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా శ్రీ చరణి (Shree Charani) ఓ రికార్డు సృష్టింంచిది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక (39) వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచింది. పూనమ్ యాదవ్ (35 వికెట్లు, 2018)ని శ్రీ చరణి అధిగమించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




