
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆదిలోనే సంజు శాంసన్ (Sanju Samson) 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి ఒమర్జాయ్ బౌలింగ్‌లో రసూలీ (Rasooli) కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) తో కలిసి అభిషేక్ శర్మ అఫ్గాన్ బౌలింగ్‌పై విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 256.25 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు సాధించి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ నబీ బౌలింగ్‌లో ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటైనప్పటికీ, అప్పటికే మ్యాచ్ భారత్ వశమైంది.



