
పశ్చిమాసియాలో ఘర్షణలతో హర్మూజ్ జల సంధిలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా, భారతీయ సిబ్బందితో వెళ్తోన్న వాణిజ్య నౌకపై ఒమన్ తీరంలో దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరొకరు గల్లంతయ్యారని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది. బ్రిక్స్ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.




