
అ రుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ జిల్లాలోని ఓ ఎత్తయిన సరస్సులో అరుదైన హిమాలయ చేపను శాస్త్రవేత్తలు కనుక్కున్నట్లు అధికారులు 2026, సెప్టెంబరు 11న వెల్లడించారు. ఈ ఆవిష్కరణ దేశంలోని మంచినీటి చేపల వైవిధ్యంలో మరో కొత్త జాతిని జోడించింది. ఇంతకుమునుపు టిబెట్, చైనా పీఠభూముల్లోని ఎత్తయిన సరస్సుల్లో గుర్తించిన ‘స్కిజోపిగాప్సిస్‌ వడెల్లి’ అనే అరుదైన చేపల జాతికి ఇది విస్తరణగా భావిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని భీమతాల్‌లోని ఐకార్‌ - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోల్డ్‌వాటర్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ (ఐకార్‌ - సీఐసీఎఫ్‌ఆర్‌) నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ మత్స్యశాఖ సహకారంతో 2026, జులైలో పరిశోధకులు వీటి నమూనాలు సేకరించారు. టీ మ్‌ఇండియా యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 131 ఏళ్ల కిందట టామ్‌ హేవార్డ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. హాంప్‌షైర్‌తో గత మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి వార్విక్‌షైర్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సుతార్‌ గ్లామోర్గన్‌తో పోరులోనూ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడు వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క వికెట్టైనా తీసి, ఒక్క పరుగూ ఇవ్వని ఘనతను హేవార్డ్‌ (3/0) తర్వాత అందుకున్నది సుతారే. భా రత్‌లో కనిపించే భిన్న రకాల కోబ్రాల విషానికి విరుగుడుగా రీకాంబినెంట్‌ యాంటీవెనమ్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), జర్మనీలోని టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. స్పెక్టకల్డ్, మోనోకల్డ్‌ కోబ్రాలు, కింగ్‌ కోబ్రాల విషం నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. రీకాంబినెంట్‌ యాంటీవెనమ్‌ అనేది ల్యాబ్‌లో తయారవుతుంది. జంతువుల నుంచి సేకరించే యాంటీవెనమ్‌ల స్థానంలో ప్రవేశపెట్టేందుకు దీన్ని రూపొందించారు. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు లామా లాంటి జీవుల నుంచి సేకరించిన యాంటీబాడీలను ఉపయోగించారు. మరిన్ని కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. ఏ దేశ అధ్యక్షురాలిగా ఉల్లెమాడిస్‌ ఎన్నికయ్యారు? క్యాన్సర్‌ను నోటిఫై చేసిన వ్యాధిగా ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది? జ: 19 (దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 17 ఇప్పటికే క్యాన్సర్‌ను ప్రచార యోగ్యమైన వ్యాధిగా ప్రకటించిన నేపథ్యంలో సీజేఐ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ను నోటిఫై చేసిన వ్యాధిగా ప్రకటించాలని కోరుతూ ఒక ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌ కారణంగా ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.) ఓడరేవులు, టర్మినళ్ల నుంచి భారీ పరిమాణంలో సరకు రవాణాకు ఉపయోగపడే తొలి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలును ఇటీవల ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విజయవంతంగా నడిపినట్లు రైల్వేశాఖ వెల్లడించింది? జ: జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్ట్‌ నుంచి గుజరాత్‌లోని వడోదరా వరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటన ప్రకారం 2025-26లో భారతదేశంలో ఆటోమొబైల్‌ ఎగుమతులు ఎంతశాతం పెరిగాయి? ఇంధన సహకారంపై ఇండియా ఏ దేశంతో ఒప్పందాలపై సంతకం చేసింది? ఇటీవలే మరణించిన గౌరాంగ్‌ వ్యాస్‌ ఏ రంగానికి చెందినవారు? .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




