
దేశ రాజధానిలో సామాన్యుడి గొంతును వినిపిస్తూ, స్థానిక అస్తిత్వపు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచిన రాజకీయ శక్తులే ప్రాంతీయ పార్టీలు. దిల్లీ పీఠం కేంద్రీకృత రాజకీయాలకు సవాలు విసురుతూ, తమ మాతృభాష, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణే ధ్యేయంగా ఈ పార్టీలు ప్రభవించాయి. సంకీర్ణ యుగంలో కేంద్ర ప్రభుత్వాల జాతకాలను మార్చే నిర్ణయాత్మక శక్తులుగా ఎదుగుతూనే, ఫెడరల్‌ వ్యవస్థలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నిలబెట్టే క్రియాశీలక వ్యవస్థలుగా పరిణతి చెందాయి. తమిళనాట ఆర్య-ద్రవిడ భావజాల పోరాటం నుంచి పుట్టుకొచ్చి అధికారాన్ని సొంతం చేసుకున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఉప్పెనలాంటి ప్రయాణం నుంచి, ఒడిశా నేలలో పేదల సంక్షేమమే లక్ష్యంగా దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని రాజకీయం నడిపిన బిజూ జనతాదళ్‌ వరకు ప్రతి పార్టీ అవతరణ ఒక చారిత్రక ఘట్టమే. ప్రజాస్వామ్య వృక్షానికి వేళ్లలాంటి ఈ ప్రాంతీయ పార్టీల ఆవిర్భావ నేపథ్యాలు, భావజాల ప్రాతిపదికల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. స్థా నిక ఆకాంక్షలకు ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భాష, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను జాతీయస్థాయికి తీసుకెళతాయి. స్థానిక ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ రాజకీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్నాయి. విభిన్న వర్గాలున్న భారతావనిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కృషిచేస్తున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్వ తంత్య్ర భారతంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటిలోనూ అతిప్రాచీన రాజకీయ పార్టీ ‘ద్రవిడ మున్నేట్ర కజగం’. 1929లో ఇ.వి.రామస్వామి నాయకర్‌ ఉన్నతకులాల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ‘ఆత్మ గౌరవ’ ఉద్యమాన్ని ప్రారంభించారు.1938లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ‘జస్టిస్‌ పార్టీ’కి మద్దతుగా ఆత్మగౌరవఉద్యమకారులు ప్రచారం చేశారు. 1944లో ఒకే భావజాలంతో ఉన్న ‘జస్టిస్‌ పార్టీ’, ఆత్మ గౌరవ ఉద్యమం కలిసిపోయి ‘ద్రవిడ కజగం పార్టీ’గా అవతరించింది. ఈ పార్టీలో చీలిక వచ్చి 1949, సెప్టెంబరు 17న అన్నాదురై నేతృత్వంలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (డీఎంకే) ఆవిర్భవించింది. ఎన్నికల గుర్తు: రెండు పర్వతాల మధ్య ఉదయిస్తున్న సూర్యుడు. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను పరిరక్షించే లక్ష్యంతో 1963లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించి, భారతదేశాన్ని విభజించే ఉద్యమాలను ప్రోత్సహించేవారికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించే అధికారం కేంద్రానికి ఉంటుందని నిర్దేశించారు. దాంతో డీఎంకే పార్టీ తన వేర్పాటు వాద వైఖరిని మార్చుకుని రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి పోరాడటం ప్రారంభించింది. బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఒ డిశా రాష్ట్రానికి చెందిన బిజూ పట్నాయక్‌ 1963లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 1969లో ఈయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి విడిపోయి ‘ఉత్కల్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని ఏర్పాటు చేశారు. 1974లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన బిజూ పట్నాయక్, మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖా మంత్రిగా చేశారు. 1990లో ఒడిశా అసెంబ్లీ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. 1996లో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుమారుడు నవీన్‌ పట్నాయక్‌ ఉప ఎన్నికలో గెలుపొంది లోక్‌సభకు జనతాదళ్‌ (పీపుల్స్‌ పార్టీ) నుంచి ప్రాతినిధ్యం వహించారు. బీజేడీ ఎన్నికల గుర్తు శంకువు ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏ ఐఏడీఎంకే పార్టీని 1974లో ఎం.జి.రామచంద్రన్‌ స్థాపించారు. ఈయన నేతృత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ 1977లో కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకుని 1977 నుంచి 1987 వరకు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎన్నికల గుర్తు: రెండు ఆకులు .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



