
© 2026 nimisham.in

– బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ – నల్లగొండ పార్టీ కార్యాలయంలో ఘనంగా జాతీయ సమైక్యతా వేడుకలు నల్లగొండ, సెప్టెంబర్ 17 : కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండడమే జాతీయ సమైక్యతకు నిజమైన ప్రతీక అని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నేడు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్యతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన రోజు అని, ఈ రోజున హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై దేశ సమైక్యతలో భాగమైందన్నారు. ఆ చారిత్రక పరిణామానికి దారితీసిన ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేస్తూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతను కాపాడుతూ, తెలంగాణ ప్రజల ఐక్యతను మరింత బలోపేతం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమష్టిగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్ట మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, అభిమన్యు, శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఎస్కే కరీం పాషా, బొజ్జ వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, కార్పోరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి, అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి, జమాల్ ఖాద్రి, పిన్నపు రెడ్డి మధుసూదన్ రెడ్డి, మిర్యాల యాదగిరి, పొనుగోటి జనార్దన్ రావు, అల్లి వేణు, తవిటి కృష్ణ, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్ కన్నారావు, కడారి కృష్ణయ్య, గోండెబోయిన జంగయ్య, కోట్ల జయపాల్ రెడ్డి, సల్వాది సైదులు, పంతంగి శ్రీనాద్, నారగోని నర్సింహ, పెండెం ధనుంజయ, మామిడి పద్మ, కోండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ, నర్రా నిర్మల, కంచర్ల విజయ, చందు వంశీ, వజ్జే శ్రీనివాస్, కంకణాల వెంకట్ రెడ్డి, మోదుగు రాజవర్ధన్ రెడ్డి, జహంగీర్, నజీర్ పాల్గొన్నారు. ‘ఇదే జాతీయ సమైక్యతకు నిజమైన ప్రతీక’
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







