
యూపీఐ ఛార్జీలపై దుమారం రేగుతోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ను (మర్చంట్ డిస్కౌంట్ రేటు) ప్రవేశపెట్టిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
© 2026 nimisham.in

యూపీఐ ఛార్జీలపై దుమారం రేగుతోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ను (మర్చంట్ డిస్కౌంట్ రేటు) ప్రవేశపెట్టిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తగ్గించాలంటున్న విపక్షం వెనక్కి తగ్గేది లేదన్న కేంద్రం దిల్లీ: యూపీఐ ఛార్జీలపై దుమారం రేగుతోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలపై ఎండీఆర్‌ను (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు) ప్రవేశపెట్టిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ప్రజా వ్యతిరేక చర్యని, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశాయి. ట్రంప్‌ను బుజ్జగించడానికి.. అమెరికా కంపెనీల జేబులు నింపడానికే ఎండీఆర్‌ పేరుతో ఛార్జీలను వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అయితే ఈ విమర్శలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చింది. ఈ విషయంలో ఎటువంటి విదేశీ ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. ఎండీఆర్‌పై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. వినియోగదారులపై భారం పడదు: కేంద్రం యూపీఐ ద్వారా జరిపే చెల్లింపులకు ప్రజలు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ‘‘ఎండీఆర్‌ అనేది వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థకు సంబంధించినది. అది వినియోగదారులపై భారం మోపదు. వ్యక్తులు అపరిమిత లావాదేవీలను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. వారికి నెలవారీ కోటా లేదు’’ అని వివరించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








