
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధానాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆయన వైఖరిని తప్పుపట్టింది. యూపీఐకి సంబంధించి దశలవారీ ఆదాయ నమూనాను సూచించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారని బీజేపీ వర్గాలు గుర్తుచేశాయి.





