
జిన్నారం, సెప్టెంబర్ 16 : ఆరు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో వారు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజులుగా జిన్నారంలో నల్లాలు కూడా విడవకపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి నీటి ట్యాంకు వద్దకు వెళ్లి స్వయంగా నీటిని విడిచారు. ప్రజాప్రతినిధులే పనులు చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.