
జగ్దల్‌పుర్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఝీరం లోయ మావోయిస్టు దాడి కేసులో 10 మంది దోషులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. దోషుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో ఉన్న ఎన్‌ఐఏ కోర్టు ప్రత్యేక జడ్జి అజయ్‌సింగ్‌ రాజ్‌పూత్‌ వీరందరినీ ఈ నెల 5నే దోషులుగా నిర్ధారించారు. బుధవారం శిక్ష ఖరారు చేశారు. 2013 మే 25న బస్తర్‌ జిల్లాలోని ఝీరం లోయలో జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. తొలుత ఐఈడీని పేల్చి కాల్పులు జరిపారు. గ్రెనేడ్లు విసిరారు. మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అప్పటి ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందకుమార్‌ పటేల్, ఆయన కుమారుడు దినేశ్, కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్‌ శుక్లా, పార్టీ సీనియర్‌ నేత మహేంద్ర కర్మా సహా పలువురు నాయకులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.