
ఆసియా క్రీడల కోసం జపాన్కు భారత అథ్లెట్ల రాక మొదలైంది. వుషు, టీటీ క్రీడాకారులతో పాటు కొందరు షట్లర్లు కూడా బుధవారం నగోయా చేరుకున్నారు. కానీ వాళ్లకు ఇబ్బందులు తప్పలేదు.
© 2026 nimisham.in

ఆసియా క్రీడల కోసం జపాన్కు భారత అథ్లెట్ల రాక మొదలైంది. వుషు, టీటీ క్రీడాకారులతో పాటు కొందరు షట్లర్లు కూడా బుధవారం నగోయా చేరుకున్నారు. కానీ వాళ్లకు ఇబ్బందులు తప్పలేదు.
నగోయా (జపాన్‌): ఆసియా క్రీడల కోసం జపాన్‌కు భారత అథ్లెట్ల రాక మొదలైంది. వుషు, టీటీ క్రీడాకారులతో పాటు కొందరు షట్లర్లు కూడా బుధవారం నగోయా చేరుకున్నారు. కానీ వాళ్లకు ఇబ్బందులు తప్పలేదు. వేదిక వద్ద రిజిస్ట్రేషన్‌ పక్రియ సందర్భంగా వుషు బృందంలో కొందరి పేర్లు కనపడలేదు. అయితే క్రీడాకారులందరికీ ఇటాలియన్‌ క్రూయిజ్‌ షిప్‌లో గదులు లభించాయని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారి ఒకరు తర్వాత చెప్పారు. ఆసియా క్రీడల సందర్భంగా భారత టీటీ క్రీడాకారుల బస కూడా ఓడలోనే. వుషు, టీటీ పోటీలు ఆదివారం మొదలవుతాయి. ఓడలో గదులు పొందడానికి తమకు కూడా చాలా సమయం పట్టిందని ఓ టీటీ ఆటగాడు చెప్పాడు. ఇదేం బస..: ఆసియా క్రీడల బసపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏర్పాట్లు చెత్తగా ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించాడు. గదుల కొరత ఏర్పడే అవకాశముందని హెచ్చరించాడు. జపాన్‌లో అయిచి నగోయాలో ఈ నెల 19న ఆసియా క్రీడలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







