Ap Govt Registrations For Pm Surya Ghar Scheme Registrations: ఏపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లలు భారం తగ్గించేందుకు సోలార్ పవర్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలతో పాటుగా బీసీల కోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీలకు సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ అందిస్తోంది. ఈ మేరకు విద్యుత్‌శాఖ అధికారులు సర్వే ప్రారభించారు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది.





