
ఈనాడు, అమరావతి: పట్టణ స్థానిక సంస్థలకు సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ, పునరావాస చట్టం-2013కి ప్రభుత్వం సవరణ చేసింది. సేకరించిన భూమి పట్టణ స్థానిక సంస్థల సరిహద్దు నుంచి 2 కి.మీ.లోపు ఉంటే 1.05 (మల్టిప్లికేషన్‌ ఫ్యాక్టర్‌) చొప్పున.. 2 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు 1.10 చొప్పున, 5 కి.మీ.పైన ఉంటే 1.25 చొప్పున, గిరిజన ప్రాంతాల్లో 1.50తో.. రిజిస్ట్రేషన్‌ విలువను హెచ్చించి పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములకు ప్రస్తుతం అక్కడి రిజిస్ట్రేషన్‌ విలువను 1.25తో హెచ్చించి, దానికి 100% సొలేషియం కలిపి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ఇక నుంచి మార్పు చేసిన విలువల ప్రకారం పరిహారం చెల్లించనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





