
పురాతన నాగరికత, చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, చారిత్రక శిల్ప సంపదకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఓ వ్యవసాయ క్షేత్రంలో దొరికిన వస్తువు ఒక చిన్న మట్టి ముద్దలా కనిపిస్తుంది..! చేతిలోకి తీసుకుంటే సాధారణ రాయిలానే అనిపిస్తుంది..! కానీ దాని వెనుక ఉన్న చరిత్ర మాత్రం వందలు కాదు.. వేల ఏళ్ల నాటిది. నల్లగొండ నేల మరోసారి తనలో దాగిన చరిత్రను బయటకు తీసింది. శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న అరుదైన టెర్రకోట డాబర్ వెలుగులోకి రావడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ డాబర్ ఎక్కడ దొరికింది..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అలనాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, శాసనాలు కూడా ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఓ రైతు వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో మట్టి పెంకులు బయటపడ్డాయి. అయితే వాటిని సాధారణ మట్టి పెంకులుగా భావించి పక్కన పడేశారు. అయితే చూడటానికి మట్టి ముద్దలా కనిపించినా.. ఈ అరుదైన టెర్రకోట వస్తువుగా చరిత్రకారులు గుర్తించారు. ఈ మట్టి పెంకులను పరిశీలించిన చరిత్రకారులు ఇది సాధారణ వస్తువు కాదని గుర్తించారు.





