
Puja Room Vastu tips Telugu: హిందూ సంప్రదాయంలో పూజాగదికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఇంట్లో దైవసాన్నిధ్యాన్ని కల్పించే పవిత్ర ప్రదేశంగా పూజామందిరాన్ని భావిస్తారు. అందుకే పూజాగదిని ఏర్పాటు చేసే స్థలం, దిశ విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు సూచించబడ్డాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం, ప్రశాంతత నెలకొంటాయని నమ్మకం.





