టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు తెగ వెయిట్ చేస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకున్నాయి. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఏందయ్య సామీ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి డైరెక్టర్ రాహుల్ క్రేజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టినట్లు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.