
ఇంటర్నెట్‌ డెస్క్‌: శింగనమల బెబ్బులి రణబాలిగా, ఓ పవర్‌ఫుల్‌ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్‌ దేవరకొండ ( Vijay Deverakonda ). ‘రణబాలి’లో ఆయన తలపడబోతున్నది ఎవరితోనో తెలుసా? ఒకప్పుడు ‘ది మమ్మీ’ చిత్రాలతో ప్రేక్షకుల్లో వణుకు పుట్టించిన హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo)తో. ఇప్పుడు క్రూరుడైన బ్రిటిష్‌ అధికారి సర్ థియోడర్ హెక్టర్‌గా భయపెట్టేందుకు సిద్ధమయ్యారు ఆర్నాల్డ్. ఈ సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం.. ‘ది మమ్మీ’ (The Mummy) సినిమాలో ‘ఇమ్హోటెప్‌’ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ ఐకానిక్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ. ఇప్పుడు తొలిసారిగా భారతీయ చిత్రంలో నటిస్తుండటం, అందులోనూ తెలుగు తెరపై మెరవనుండటం విశేషం. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ రంగస్థల నటులే. దక్షిణాఫ్రికాలోని ఆల్బర్టన్‌లో ఆయన తండ్రి ఒక డ్రైవ్-ఇన్ థియేటర్ నడిపేవారు. ఆ ప్రభావంతో చిన్న వయసులోనే ఆర్నాల్డ్‌కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. హాలీవుడ్‌లో ఆర్నాల్డ్ ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ, ఆయనకు గ్లోబల్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది మాత్రం ‘ది మమ్మీ’ ఫ్రాంచైజీనే. అందులో భయపెట్టే ఇమ్హోటెప్‌ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ క్రేజ్‌తోనే ఆ తర్వాత పలు హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోలలో పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా విజయాలు అందుకున్నారు. వోస్లూ ఇప్పటివరకు 60కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లలో నటించారు. పలు టీవీ షోలలో అతిథి పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటారు. పలు వీడియో గేమ్స్‌లోనూ భాగమయ్యారు. ‘బూటీ కాల్’ వంటి గేమ్స్‌కు వాయిస్ ఇచ్చారు. ఆయనొక సీరియల్ ఆంత్రప్రెన్యూర్‌, ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి ఉన్న బాడీబిల్డర్ కూడా. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ‘రణబాలి’లో (Ranabaali) క్రూరుడైన బ్రిటిష్ పాలకుడిగా సర్ థియోడర్ హెక్టర్ పాత్రను డిజైన్ చేశారు. ఈ పాత్రకు ఆర్నాల్డ్ పోషించిన ఇమ్హోటెప్ క్యారెక్టరే ప్రధాన స్ఫూర్తి. తన పాత్రకు స్ఫూర్తినిచ్చిన నటుడితోనే ఆ క్యారెక్టర్ చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్నాల్డ్‌ను సంప్రదించారు. ఆర్నాల్డ్ చూసేందుకు అచ్చం అమెరికన్ నటుడు బిల్లీ జేన్‌ (టైటానిక్ విలన్) లాగానే కనిపిస్తారు. దీంతో చాలామంది అభిమానులు ఆయన వద్దకు వచ్చి ‘టైటానిక్‌లో నటించింది మీరేనా?’ అని అడిగేవారు. దానికి ఆర్నాల్డ్ సరదాగా ‘అవును.. నేనే’ అని సమాధానం చెప్పేవారు. ఆయనకు దక్షిణాఫ్రికాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. ‘యాక్ట్ ఆఫ్ పైరసీ’, ‘స్కెలిటన్ కోస్ట్’ చిత్రాల సహనటి నాన్సీ ముల్ఫోర్డ్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. అయితే, మూడేళ్ల తర్వాత (1998లో) వారు విడాకులు తీసుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటోన్న జీవీ ప్రకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’.
.webp)




