
మెన్స్‌ ఆసియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్‌ హాకీ బోర్డు నిరాకరించింది. ఈ టోర్నీని వేరే దేశంలో నిర్వహించాలని, లేదా తమ మ్యాచ్‌లకు ఏదైనా తటస్థ వేదికను కేటాయించాలని ఆసియా హాకీ ఫెడరేషన్‌ను కోరింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సున్నిత సంబంధాల నేపథ్యంలో.. పాకిస్థాన్‌ ఆటగాళ్లకు, సిబ్బందికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ హాకీ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ మొహియుద్దీన్‌ అహ్మద్‌ తెలిపారు. అక్టోబర్ 27 నుంచి ఆసియన్‌ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ పంజాబ్‌లోని మొహాలిలో జరగనుంది.





