
తిరుమల పవిత్రత పరిరక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, సామాజిక బాధ్యతే లక్ష్యాలు హీలింగ్‌ సెంటర్‌గా తిరుమల మానవ సేవే మాధవసేవగా స్వామివారి సన్నిధిలో సరికొత్త అధ్యాయం: సీఎం చంద్రబాబు తిరుమలపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని ‘అహంకారాన్ని వదిలేయండి’ ఈనాడు డిజిటల్, తిరుపతి: రాజకీయాలకు అతీతంగా తిరుమల ఒక పవిత్ర దివ్యక్షేత్రంగా, భక్తుల పాలిట హీలింగ్‌ సెంటర్‌గా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. తిరుమల పర్యటన రెండోరోజు పద్మావతి అతిథిగృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, సామాజిక బాధ్యతను పెంచేందుకు ‘ఆరు సూత్రాల’తో కూడిన బృహత్తర ప్రణాళికను ఆయన ప్రకటించారు. రాబోయే రోజుల్లో తితిదే వీటిపై దృష్టి సారిస్తుందని సీఎం చెప్పారు. చంద్రబాబు ముఖ్యాంశాలివీ.. భవిష్యత్తులో తిరుమల కొండపై ఎలాంటి కొత్త కాంక్రీట్‌ నిర్మాణాలకు అనుమతిచ్చేది లేదు. కాలుష్య రహిత (నెట్‌ జీరో) ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఏడాదిన్నరలోగా వంద మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని (సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజ్‌) ఉత్పత్తి చేస్తాం. లెగసీ వేస్ట్‌ను తక్షణమే తొలగిస్తాం. ఏసీ బస్సులు, గదులు, లైటింగ్‌ అంతా గ్రీన్‌ పవర్‌తోనే నడిచేలా చూస్తాం. పూలవ్యర్థాలతో అగరబత్తులు, చెత్తతో బయోగ్యాస్‌ తయారు చేస్తూ సర్క్యులర్‌ ఎకానమీని అమలు చేస్తాం. రిలయన్స్, భారత్‌ బయోటెక్‌ సంస్థల సహకారంతో 32 కొత్త ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభించాం. తిరుమల ఒక మెడిటేషన్, హీలింగ్‌ సెంటర్‌గా మారాలి. 1999లో నేను పునాది వేసిన ఎస్వీ మ్యూజియాన్ని టీసీఎస్‌ సంస్థ రూ.104 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ఆధునికీకరించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, 4 అంతస్తులు, 14 గ్యాలరీలతో 8,000కి పైగా ప్రదర్శనలు, 6,000 పురాతన కళాఖండాలను ఇక్కడ అమర్చారు. 360 డిగ్రీల స్పేషియల్‌ సౌండ్, హోలోగ్రాఫిక్‌ సాంకేతికతతో రూపొందించిన ఈ మ్యూజియం నిర్వహణను రాబోయే ఐదేళ్ల పాటు టీసీఎస్‌ సంస్థే చూసుకుంటుంది. అమెరికాకు చెందిన కార్య ఫౌండేషన్‌ సహకారంతో వీక్యూసీ-1లో ‘దుర్లభ దర్శనం’ పేరుతో 13 నిమిషాల వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) ధ్యాన కేంద్రం అందుబాటులోకి తెచ్చాం. ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో భక్తులకు ఆధార్‌ ఆధారిత రూ.2 లక్షల ఉచిత బీమా కల్పిస్తున్నాం. గ తంలో మాన్యుమెంట్స్, ఆస్తుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. ఇకపై పారదర్శకత కోసం ఆస్తులు, భూములు, ఆభరణాలు, నగదు వివరాలన్నింటినీ డాక్యుమెంట్‌ చేసి ఆన్‌లైన్‌లో పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతాం. మేం ట్రస్టీలమే తప్ప పెత్తనం చేయడానికి రాలేదు. విదేశాల్లో (న్యూజిలాండ్, మారిషస్‌ లాంటి చోట్ల) కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అభ్యర్థనలు వస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





