
రాణించిన బ్యాంకింగ్‌ షేర్లు మంగళవారం నాటి భారీ నష్టాల నుంచి మన సూచీలు పుంజుకున్నాయి. తక్కువ స్థాయుల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కారణం. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లు రాణించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 3 పైసలు తగ్గి 95.91 వద్ద ముగిసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు 2.58% తగ్గి, 105.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్‌ మినహా మిగతా దేశాల సూచీలు రాణించగా.. ఐరోపా మార్కెట్లూ సానుకూల ధోరణిలోనే ఆరంభమయ్యాయి. స్వల్ప శ్రేణిలోనే...: ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 74,249.31 పాయింట్ల వద్ద లాభాల్లో (క్రితం ముగింపు 74,003.82) ఆరంభమైంది. ఆ తర్వాత 74,505.86 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. చివరకు 332.63 పాయింట్ల లాభంతో 74,336.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 23,217.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 23,284.75 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని; 23,116.10 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. 18 పైకి.. 12 కిందకు...: సెన్సెక్స్‌ 30 కంపెనీల షేర్లలో 12 మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి. ఐటీసీ 2.46%, ఎస్‌బీఐ 2.24%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.93%, ట్రెంట్‌ 1.51%, మహీంద్రా అండ్‌ మహీద్రా 1.45%, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ 1.43% పెరిగాయి. టీసీఎస్‌ 2.6%, ఇన్ఫోసిస్‌ 1.43%, టెక్‌ మహీంద్రా 1.26%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.99%, ఎన్‌టీపీసీ 0.91%, ఎల్‌అండ్‌టీ 0.71% నష్టపోయాయి. బీఎస్‌ఈ రంగాల సూచీల్లో బీమా, ఎఫ్‌ఎమ్‌సీజీ, పీఎస్‌యూ బ్యాంక్, స్థిరాస్తి, చమురు-గ్యాస్‌ రాణించగా.. ఐటీ, గృహ రుణాలు, ఇండస్ట్రియల్స్, హాస్పిటల్స్‌ డీలాపడ్డాయి. అక్టోబరు 15 నుంచి రూ.2000కు మించి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు 3.5% పెరిగి రూ.1,791.70 వద్ద ముగిసింది. ఒకదశలో 7.24% దూసుకెళ్లి రూ.1,856,50ను చేరింది. వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ షేరు 5.96%, పైన్‌ ల్యాబ్‌ 2.68% మేర పెరిగినా.. చివరకు వన్‌ మొబిక్విక్‌ 1.61%, పైన్‌ ల్యాబ్స్‌ 4.28% నష్టపోయాయి. స్టింగ్‌ అదుర్స్‌.. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





