
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సవరించిన భారత్‌ నెట్‌ కార్యక్రమం ద్వారా ‘ప్రత్యేక ప్రాజెక్ట్‌’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (యూనివర్సల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ విభాగం) నిబంధనలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాస్కీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో భారత్‌నెట్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద చేపట్టే మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్‌ విస్తరణ పనులకు వర్తించే ఛార్జీలు, ఫీజుల మినహాయింపు/మాఫీ పొందడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీని ఆదేశించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





