
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. నేరేడు చెరువులో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు వీరంతా నీటమునిగారు. మృతులను శిరీష ఛారిటబుల్ ట్రస్టు విద్యార్థులుగా గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం.





