
బ్రహ్మపుర నగరం : గంజాం జిల్లా హింజిలికాటు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జనోత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హింజిలికాటు శివారున ఘోడాహడో నదిలో గణేశుడిని నిమజ్జనం చేసేందుకు నలుగురు విద్యార్థులు నదిలో దిగారు. ప్రమాదవశాత్తూ వారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గమనించిన కొందరు ఇద్దరిని కాపాడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారికోసం గాలింపు చేపట్టి వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులు ఆదర్శ సాహు (14), ప్రీతం సమాల్ (14)గా గుర్తించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





