
విజయవాడ: ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ తరహాలోనే ఉమెన్ ఏపీఎల్‌ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (Kesineni Sivanath)(చిన్ని) వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 27 వరకు మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్ పోటీలు జరగనున్నాయని చెప్పారు. మొత్తం నాలుగు టీమ్‌లు పాల్గొనే ఈ టోర్నమెంటును... డే అండ్ నైట్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విజయవాడ ఏసీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... ఉమెన్ ఏపీఎల్ ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని చెప్పారు. ప్రేక్షకులు ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని, విజయవాడ నుంచి విద్యార్థులను తీసుకువెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమెన్ ఏపీఎల్ ద్వారా మహిళా సాధికారతను ఘనంగా చాటబోతున్నామని చెప్పారు. ఈ సీజన్‌లో మంగళగిరి స్టేడియంలో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయని, వచ్చే సీజన్ నుంచి విశాఖ, కడపలోనూ ఉమెన్ ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించబోతున్నామని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





