
కావలి: పట్టణంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి వద్ద దీపం వెలిగించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ కావలి ఒకటో పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు కృతజ్ఞతగా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. బీజేపీ పరిధిలోని ప్రతి కార్యకర్త తమ ప్రాంతంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజలను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటి వద్ద దీపం వెలిగించడం ద్వారా దేశ అభివృద్ధి, సేవా భావం, వికసిత్ భారత్ సంకల్పంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. కావలి పట్టణ ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





