
రాజోలి: రాజోలి గ్రామం మీదుగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్‌మాల జాతీయ రహదారి నుంచి సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచి గంగిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎన్‌హెచ్ ఎఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంకె. బన్సల్‌కు వినతిపత్రం అందించారు. ఈ మేరకు వారు మహబూబ్‌నగర్‌లో ఆయనను కలిసి సర్వీసు రోడ్డు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వ్యవసాయ యంత్రాలతోపాటు, సాగు చేసిన పంటను తీసుకొచ్చేందుకు వాహనాలతో వెళ్లే పరిస్థితి లేదని వాపోయారు. అదేవిధంగా రాజోలి నుంచి భారత్‌మాల రోడ్డును ఎక్కేందుకు అవకాశం కల్పిస్తే.. రెండు మండలాలు, రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగిస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు డైరెక్టర్ హామీ ఇచ్చినట్లుగా సర్పంచి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యల్లారెడ్డి, మండలాధ్యక్షుడు హసేన్, దస్తగిరి తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





