
India vs Afghanistan: ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికే 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాలు సాధించిన భారత్, సెప్టెంబర్ 17 గురువారం నాడు నామమాత్రమైన మూడో టీ20 సమరంలో తలపడనుంది. మొదటి రెండు మ్యాచ్ ల్లో కలిపి మొత్తం 12 మంది ఆటగాళ్లను పరీక్షించిన టీమ్ మేనేజ్మెంట్, సిరీస్ చేతికి రావడంతో ఆఖరి మ్యాచ్‌లో మరికొందరికి మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో నిలకడగా రాణిస్తున్న ముగ్గురు కీలక సభ్యులకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ బెంచ్ పై ఉన్న వారికి తుది జట్టు (Playing XI) తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమవుతోంది.





