
కం బాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ సెంటర్‌ (సీఏఎస్‌డీఐసీ), బెంగళూరు.. 30 ఇంటర్న్‌షిప్పులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విభాగాలు: ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: మొదటి ఏడాది గ్రాడ్యుయేషన్‌ (ఇంజినీరింగ్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (సైన్స్‌). స్టైపెండ్‌: నెలకు రూ.5,000. ఎంపిక: విద్యార్హతలు, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలతో. ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 11.10.2026. ఈమెయిల్‌: hrd.casdic@gov.in వెబ్‌సైట్‌: https://drdo.gov.in/ తె లంగాణ ఎంప్లాయిమెంట్‌ అసిస్టెన్స్‌ మిషన్‌ (టీమ్‌), యాదాద్రి, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏఎస్‌ఎల్‌పీ, బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌టీ పీజీ సంబంధిత సర్టిఫికెట్‌ ఉండాలి. వేతనం: నెలకు ఆడియో విజువల్‌ టెక్నీషియన్, వార్డ్‌బాయ్, ఆఫీస్‌ సబార్డినేట్, ల్యాబ్‌ అటెండెంట్, ధోబీ/ ప్యాకర్‌ పోస్టులకు రూ.15,600, టైలర్, రికార్డ్‌ అసిస్టెంట్, ప్లంబర్, మ్యూజియం అసిస్టెంట్‌ కమ్‌ ఆర్టిస్ట్, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, వడ్రంగి, క్షురకులు, థియేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.19,500, ఇతర పోస్టులకు రూ.22,750. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టు ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23.09.2026. చిరునామా: సంబంధిత ధ్రువపత్రాలను భువనగిరి జిల్లా, ఉపాధి కల్పనాధికారి కార్యాలయం దగ్గరలోని తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ అసిస్టెన్స్‌ మిషన్‌ (టీమ్‌) కార్యాలయంలో సమర్పించాలి. వెబ్‌సైట్‌: https://yadadri.telangana.gov.in/notice/notification-of





