
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న అగ్నిమాపక భద్రత నిబంధనలను ప్రభుత్వం సవరించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించాక నూతన మార్గదర్శకాలు ఖరారు చేసింది. కార్మికులు, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం, ప్రమాదాల నుంచి పారిశ్రామిక ఆస్తులను కాపాడటం, వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడటం, క్లిష్టమైన నియామవళి తొలగింపు తదితరాలతో వీటిని రూపొందించింది. పరిశ్రమల్లోని ప్రమాద తీవ్రత ఆధారంగా కనీస భద్రత ప్రమాణాలను నిర్దేశించింది. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానాంశాలు..: రాష్ట్రంలోని పారిశ్రామిక భవనాలు, కర్మాగారాలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, వర్క్‌షాప్‌లు, ఇండస్ట్రియల్‌ పార్క్‌లు, సెజ్‌లు, ఎంఎస్‌ఎంఈలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




