
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ముంబయి వీధుల్లో భిక్షగాడిగా మారిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రూ.3,300 కోట్ల ఆస్తి ఉన్న సంపన్న ఎమ్మెల్యే ఇలా యాచకుడిగా మారడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే జైన సంప్రదాయంలో భాగంగా ఆధ్యాత్మిక గురువు సూచనతోనే ఆయన ఈ భిక్షాటన దీక్షను చేపట్టినట్లు.. జీవిత సత్యాన్ని గ్రహించడానికే రోడ్లపై తిరిగినట్లు వెల్లడి అయింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.