
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు రుణ మంజూరు మొత్తం గతం కంటే పెరిగినా.. ఆశించిన స్థాయిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రుణ మంజూరులో కొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని.. లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని నిర్దేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన 236వ ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి)సమావేశంలో సీఎం చంద్రబాబు వివిధ రంగాలకు రుణ మంజూరు, లక్ష్యాల సాధనపై సమీక్షించారు. 15% వృద్ధి లక్ష్యంగా నిర్ణయించామని.. ఎల్‌నినో కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.కౌలు రైతులకు రుణాలు అందించేందుకు ముందుకు రావాలన్నారు. అమరావతి ఫైనాన్షియల్‌ హబ్‌లో బ్యాంకు కార్యాలయ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. స్త్రీనిధి కింద ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్‌ను తిరిగి బ్యాంకుకే జమచేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రుణాల చెల్లింపులో పొదుపు సంఘాల మహిళలు ముందున్నారని.. దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. 0.67శాతంమంది మహిళలు మాత్రమే రుణాల చెల్లింపులో వెనుకబడ్డారని.. వారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానం అమలుపై ఆలోచన చేయాలని చెప్పారు. టిడ్కో రుణాల మంజూరుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పొదుపు సంఘాల రుణాలపై సేవా ఛార్జీలు రద్దు చేసినట్లు బ్యాంకర్లు వివరించారు. రూ.20లక్షల వరకు తీసుకునే రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్‌ తదితర ఛార్జీల రద్దుతో ఒక్కో సంఘానికి రూ.33,500 ఆర్థిక ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తొలి త్రైమాసికంలో రూ.1.13లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





