
ప్రపంచవ్యాప్తంగా శాంతి, దయ, అహింసలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుని విగ్రహాలు లేదా చిత్రపటాలను గమనిస్తే.. ప్రశాంతమైన ముఖంతో పాటు ఆయన తలపై గుండ్రంగా, రింగులు రింగులుగా ఏదో కనిపిస్తుంది. చాలామంది దీనిని బుద్ధుడి రింగుల జుట్టు అనుకుంటారు. కానీ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం.. అది జుట్టు కాదు… ఆయన తలపై ప్రాణాలు అర్పించిన 108 నత్తలని ఒక ప్రసిద్ధ కథ చెబుతుంది. ఈ కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నేపాల్లోని లుంబినీ వనంలో శాక్య వంశపు రాజు శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు సిద్ధార్థుడు జన్మించాడు. పుట్టిన కొద్ది రోజులకే తల్లి చనిపోవడంతో, ఆమె సోదరి గౌతమి ఆయనను పెంచి పెద్ద చేసింది. అందుకే ఆయనకు గౌతముడు అనే పేరు వచ్చింది.





