
అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు ఇటీవల ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ఆపరేషన్‌? జ: ఎకనామిక్‌ అవుట్‌ కాస్ట్‌ (ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌ కాస్ట్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ సరఫరా మార్గాలను నిలిపివేయడమే లక్ష్యంగా అమెరికా నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమం. 2026, ఆగస్టు 24న అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సెంట్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.) దక్షిణ సూడాన్‌లో ఎంతమంది భారత శాంతి పరిరక్షకులకు ఇటీవల ఐక్యరాజ్య సమితి పతకాలను ప్రదానం చేసింది? జ: 210 (దక్షిణ సూడాన్‌లోని యూఎన్‌ఎంఐఎస్‌ఎస్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ ఇన్‌ సౌత్‌ సూడాన్‌)లో వీరు అందిస్తోన్న విశిష్ట సేవలకు ఈ విలువైన ఐక్యరాజ్య సమితి పతకాలను జూబాలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.) చైనాకు చెందిన ఏ మానవ రూప రోబో ఇటీవల ఉసేన్‌ బోల్ట్‌ 100 మీటర్ల రికార్డు సమయాన్ని అధిగమించి వార్తల్లో నిలిచింది? జ: టియాంగాంగ్‌ అల్ట్రా (2026, ఆగస్టు 22 నుంచి 26 వరకు బీజింగ్‌లో జరిగిన రెండో ప్రపంచ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ గేమ్స్‌లో టియాంగాంగ్‌ అల్ట్రా 100 మీటర్ల దూరాన్ని 9.39 సెకన్లలో పూర్తిచేసి, 2009 బెర్లిన్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉసెన్‌ బోల్ట్‌ సాధించిన 9.58 సెకన్ల ప్రపంచ రికార్డును అధిగమించింది.) .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




