
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ (NSE IPO) ఎన్నో అంచనాల మధ్య ప్రైమరీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రూ.22,562 కోట్ల మెగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 17న ప్రారంభమై.. సెప్టెంబర్ 21న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణి రూ.రూ.1700-1785గా కంపెనీ నిర్ణయించింది. 12.64 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో విక్రయిస్తున్నారు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద రిటైల్ ఇన్వెస్టర్లు 8 షేర్లు కలిగిన ఒక్కో లాట్ కొనుగోలుకు రూ.14,280 వెచ్చించాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలయాపన తర్వాత దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెడుతున్న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సబ్‌స్క్రిప్షన్‌కు ఒక్కరోజు ముందు క్షీణించింది. వారం క్రితం 12 శాతంగా ఉన్న ప్రీమియం.. ఐపీఓ ముందురోజు 9.4 శాతానికి పడిపోయింది. ఇష్యూ ధర కంటే గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ.200 అధికంగా ఉండగా.. అది రూ.167కి తగ్గింది. దీంతో రూ.1,952 వద్ద అరంగేట్రం చేయొచ్చని అంచనా వేస్తోంది. డెరివేటివ్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతుండడంతో మదుపర్లు అప్రమత్తత పాటించడం వల్ల ప్రీమియం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




