
ఇంటర్నెట్‌ డెస్క్: పసిఫిక్‌ మహాసముద్రంలోని ఫిజీ (Fiji) ద్వీప దేశం.. స్నేహపూర్వక సంస్కృతి, అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. కానీ, ఈ దేశం ఇప్పుడు హెచ్‌ఐవీ వ్యాప్తితో (HIV Outbreak) వణికిపోతోంది. కేసుల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్‌ హెచ్‌ఐవీ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. 10 లక్షల్లోపే జనాభా ఉన్న ఫిజీలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు ఈ వైరస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. గతేడాది జనవరిలో మొదటిసారి హెచ్‌ఐవీ వ్యాప్తిని ప్రకటించిన ఫిజీ ప్రభుత్వం.. పరీక్షలను ముమ్మరం చేసింది. గతేడాది కొత్తగా 2,060 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి డా.అటోనియో ప్రకటించారు. ప్రతి 50 మంది గర్భిణుల్లో ఒకరికి ఈ వైరస్ సోకిందన్నారు. నవజాత శిశువులకూ ఇది వ్యాప్తి చెందుతోందని, రెండు నెలల పసికందు హెచ్‌వీఐతో బాధపడుతున్నట్లు గుర్తించామని ‘సేవ్ ది చిల్డ్రన్ ఫిజీ’ సంస్థ పేర్కొంది. గతేడాది 59 మంది శిశువులకు వారి తల్లుల నుంచి వైరస్‌ సోకిందని వెల్లడించింది. జపాన్‌లో లక్ష దాటిన శతాధికుల సంఖ్య డ్రగ్స్‌ ఎక్కించుకునేందుకు ఒకే సిరంజీని అనేక మంది ఉపయోగించడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాల వంటి కారణాలతో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. అధికారిక గణాంకాల ప్రకారం.. 2021లో 25గా ఉన్న హెచ్‌ఐవీ సంబంధిత మరణాల సంఖ్య.. 2025 నాటికి 117కు పెరిగింది. స్థానికంగా హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో కేవలం 39 శాతం మందికి మాత్రమే ఆ విషయం తెలుసని, నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని యూఎన్‌ఎయిడ్స్‌ ఫిజీ ప్రతినిధి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





