
‘నే నెలాంటి సినిమా చేశానో చూడాలని మా నాన్న ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నార’’ని చెప్పారు జాసన్‌ సంజయ్‌. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు విజయ్‌ కుమారుడైన జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్‌కిషన్‌ కథానాయకుడు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ లిమిటెడ్, ఎన్‌.వి.ఆర్‌ సినిమా సంస్థల నుంచి అక్టోబరు 2న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘సంజయ్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో తను చెప్పిన కథనే వందశాతం తెరపైకి తీసుకొచ్చాడు. నా ప్రాధాన్యం ఎప్పుడూ తెలుగు భాషకే. అయితే ఒక తెలుగు హీరో తమిళంలోనూ ఇలాంటి సినిమా చేయడమనే విషయం నాకు మరింతగా సంతృప్తినిచ్చింది’’ అన్నారు. జాసన్‌ సంజయ్‌ మాట్లాడుతూ ‘‘సాహసాలతో కూడిన కథ ఇది. నిధి అన్వేషణ తరహాలో ఉంటుంది. ఈ సినిమాలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి’’ అన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




